గాడిపర్తివారిపాలెం
గాడిపర్తివారిపాలెం ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
గాడిపర్తివారిపాలెం | |
---|---|
గ్రామం | |
అక్షాంశ రేఖాంశాలు: 15°40′22.404″N 79°54′30.636″E / 15.67289000°N 79.90851000°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | ప్రకాశం |
మండలం | చీమకుర్తి |
అదనపు జనాభాగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | స్త్రీ పురుష జనాభా వివరాలు లేవు |
ప్రాంతపు కోడ్ | +91 ( | )
పిన్‌కోడ్ | 523263 |
రవాణా సౌకర్యం
మార్చుఈ గ్రామం నుండి మండల కేంద్రమన చీమకుర్తికి నూతనంగా ఆర్.టి.సి.బస్సు సౌకర్యం ఏర్పడినది.
విద్యా సౌకర్యాలు
మార్చుజిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల.
గ్రామ పంచాయతీ
మార్చు2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, ఎస్.సుబ్బరామిరెడ్డి, సర్పంచిగా ఎన్నికైనాడు.
దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు
మార్చుశీతలాంబ, బొడ్డురాయి
మార్చుగ్రామములో శీతలాంబ, బొడ్డురాయి ప్రతిష్ఠా వేడుకలను 2017, జూన్-17వతెదీ శనివారం నుండి 19వతేదీ సోమవారం వరకు, వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శుక్రవారంనాడు బొడ్డురాయికి గ్రామోత్సవం నిర్వహించారు. ఉదయం నుండియే గ్రామములో వేదపారాయణం, అగ్నిప్రతిష్ఠ, యాగశాల తదితర కార్యక్రమాలు నిర్వహించారు. 18న గణపతిపూజ, మండలార్చన, 19న ఉదయం 9 - 10 మధ్యన నాభిశిల ప్రతిష్ఠ నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వహించారు. ఇక్కడ బొడ్డురాయిని ప్రతిష్ఠించి 16 రోజులైన సందర్భంగా, 2017, జూలై-4వతేదీ మంగళవారంనాడు, ప్రత్యేకపూజలు నిర్వహించారు. స్థానిక మహిళలు పొంగళ్ళతో ఆలయానికి చేరుకుని, అమ్మవారికి సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.
ప్రధాన పంటలు
మార్చుప్రధాన వృత్తులు
మార్చువ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు