గాడ్ ఫాదర్ (2022 సినిమా)
గాడ్ ఫాదర్ 2022లో రూపొందుతున్న పొలిటికల్ యాక్షన్ డ్రామా సినిమా. 2019లో మలయాళంలో హిట్టైన 'లూసిఫర్' సినిమాను తెలుగులో గాడ్ ఫాదర్ పేరుతో కొణిదెల సురేఖ సమర్పణలో సూపర్ గుడ్ ఫిల్మ్స్, కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌లపై ఆర్. బి.చౌదరి, ఎన్వీ ప్రసాద్ రీమేక్ చేస్తున్నారు. చిరంజీవి, సల్మాన్ ఖాన్, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు మోహన్ రాజా దర్శకత్వం వహించిన ఈ సినిమా 2022 అక్టోబరు 5న విడుదల కాగా, 2022 నవంబరు 19న నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో విడుదలైంది.[1]
గాడ్ ఫాదర్ | |
---|---|
![]() | |
దర్శకత్వం | మోహన్ రాజా |
స్క్రీన్ ప్లే | మోహన్ రాజా |
దీనిపై ఆధారితం | లూసిఫర్ - మలయాళం సినిమా |
నిర్మాత | ఆర్. బి.చౌదరి ఎన్వీ ప్రసాద్ |
తారాగణం | చిరంజీవి సల్మాన్ ఖాన్ నయనతార సత్యదేవ్ కంచరాన |
ఛాయాగ్రహణం | నీరవ్ షా |
కూర్పు | ఏ. శ్రీకర్ ప్రసాద్ |
సంగీతం | ఎస్.ఎస్. తమన్ |
నిర్మాణ సంస్థలు | సూపర్ గుడ్ ఫిల్మ్స్ కొణిదెల ప్రొడక్షన్స్ |
విడుదల తేదీs | 2022 అక్టోబరు 5(థియేటర్) 2022 నవంబరు 19 ( నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో ) |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
అధికార పార్టీకి చెందిన అత్యున్నత నాయకుడు చనిపోవడంతో పార్టీ ఎన్నికల, నాయకత్వం విషయంలో భారీ శూన్యతను ఏర్పడుతుంది. అతని తరువాత ఎవరు వస్తారనేది సినిమా కథ. హైదరాబాద్, ఊటీ, ముంబైలలో చిత్రీకరణ జరుపుకోవడంతో ప్రధాన ఫోటోగ్రఫీ ఆగస్టు 2021లో ప్రారంభమైంది. థమన్ ఎస్ సంగీతం అందించిన ఈ చిత్రానికి నీరవ్ షా సినిమాటోగ్రఫీ అందించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ₹100 కోట్ల బడ్జెట్‌కు గాను ₹119 కోట్లు వసూలు చేసింది.
నటీనటులుసవరించు
- చిరంజీవి, బ్రహ్మ తేజా రెడ్డి / అబ్రమ్ ఖురేషి / గాడ్ ఫాదర్ గా
- సల్మాన్ ఖాన్,[2] మాసూమ్ భాయ్ గా
- నయనతార, సత్యప్రియా రెడ్డి దాస్‌గా
- గద్దర్[3]
- సత్యదేవ్ కంచరాన, జైదేవ్ దాస్ గా
- గంగవ్వ[4], కాంతమ్మగా
- అనసూయ, రామ్ ప్రసాద్ భార్యగా
- ఇంద్రజిత్ సుకుమారన్,
- వారినా హుస్సేన్, ఐటెమ్ నంబర్ "బ్లాస్ట్ బేబీ" లో
- సముద్రఖని, రఘురామ్ IPS గా
- షఫి, మురుగన్ గా
సాంకేతిక నిపుణులుసవరించు
- బ్యానర్: సూపర్ గుడ్ ఫిల్మ్స్
కొణిదెల ప్రొడక్షన్స్ - నిర్మాత: ఆర్. బి.చౌదరి
ఎన్వీ ప్రసాద్ - కథ: మురళి గోపి
- స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మోహన్ రాజా
- సంగీతం: ఎస్.ఎస్. తమన్
- సినిమాటోగ్రఫీ: నీరవ్ షా
మూలాలుసవరించు
- ↑ Namasthe Telangana (2 November 2022). "అప్పుడే ఓటీటీలోకి 'గాడ్‌ఫాదర్'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?". Archived from the original on 2 November 2022. Retrieved 2 November 2022.
- ↑ HMTV (23 December 2021). "గాడ్ ఫాదర్ షూటింగ్ సెట్స్ కి సల్మాన్ ఖాన్ రాక అప్పుడేనా..." Archived from the original on 27 March 2022. Retrieved 27 March 2022.
- ↑ TNews Telugu (18 March 2022). "'గాడ్ ఫాదర్'లో గద్దర్ క్యారెక్టర్ రివీల్..!". Archived from the original on 27 March 2022. Retrieved 27 March 2022.
- ↑ Namasthe Telangana (4 October 2021). "చిరంజీవికి తల్లిగా గంగవ్వ.. ఏ చిత్రంలోనో తెలుసా?". Archived from the original on 27 March 2022. Retrieved 27 March 2022.