గావిన్ లార్సెన్

న్యూజీలాండ్ మాజీ క్రికెటర్

గావిన్ రోల్ఫ్ లార్సెన్ (జననం 1962, సెప్టెంబరు 27) న్యూజీలాండ్ మాజీ క్రికెటర్. అతని సహచరులు అతనిని "ది పోస్ట్‌మ్యాన్" అని పిలుస్తారు. న్యూజీలాండ్ క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ప్రస్తుతం జాతీయ జట్టుకు చీఫ్ సెలెక్టర్ గా ఉన్నాడు.

గావిన్ లార్సెన్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
గావిన్ రోల్ఫ్ లార్సెన్
పుట్టిన తేదీ27 September 1962 (1962-09-27) (age 61)
వెల్లింగ్టన్, న్యూజీలాండ్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి మీడియం
పాత్రబౌలర్, సెలెక్టర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 190)1994 జూన్ 2 - ఇంగ్లాండ్ తో
చివరి టెస్టు1996 ఏప్రిల్ 27 - వెస్టిండీస్ తో
తొలి వన్‌డే (క్యాప్ 64)1990 మార్చి 1 - ఇండియా తో
చివరి వన్‌డే1999 జూన్ 16 - పాకిస్తాన్ తో
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలు ఫక్లా లిఎ
మ్యాచ్‌లు 8 121 103 229
చేసిన పరుగులు 127 629 3,491 1,981
బ్యాటింగు సగటు 14.11 14.62 28.61 18.17
100లు/50లు 0/0 0/0 2/17 0/2
అత్యుత్తమ స్కోరు 26* 37 161 66
వేసిన బంతులు 1,967 6,368 12,765 12,061
వికెట్లు 24 113 156 227
బౌలింగు సగటు 28.70 35.39 29.62 30.31
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0 5 1
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0 0
అత్యుత్తమ బౌలింగు 3/57 4/24 6/37 5/30
క్యాచ్‌లు/స్టంపింగులు 5/– 23/– 70/0 59/9
మూలం: Cricinfo, 2017 మే 4

అంతర్జాతీయ కెరీర్ మార్చు

లార్సెన్ వన్డే క్రికెట్‌లో అసాధారణమైన ఎకానమీ రేటు 3.76తో తన కెరీర్‌ను ముగించాడు.

ఎనిమిది టెస్టులు ఆడాడు, 24 వికెట్లు తీసుకున్నాడు. బ్యాట్స్‌మన్ గా, బౌలర్‌గా వన్డే జట్టులో స్థానం సంపాదించాడు. 1999 క్రికెట్ ప్రపంచ కప్‌లో సెమీ-ఫైనల్ దశకు చేరుకోవడంలో న్యూజీలాండ్‌లో ప్రధాన పాత్ర పోషించాడు.

లార్సెన్ తన స్వస్థలమైన వెల్లింగ్‌టన్‌లో భారత బ్యాట్స్‌మెన్ సచిన్ టెండూల్కర్ను ఔట్ చేసి తన 100వ వన్డే వికెట్‌ని సాధించాడు.

క్రికెట్ తర్వాత మార్చు

లార్సెన్ క్రికెట్ వెల్లింగ్టన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేసి, నాలుగు సంవత్సరాల తర్వాత 2011 అక్టోబరులో ఆ పదవిని విడిచిపెట్టాడు.[1] 2015 జూలై 8న న్యూజీలాండ్ క్రికెట్ జట్టు సెలెక్టర్‌గా నియమితుడయ్యాడు.[2]

మూలాలు మార్చు

  1. Millmow, Jonathan (20 October 2011). "Gavin Larsen will still feel the heat". Stuff. Retrieved 13 June 2021.
  2. "Gavin Larsen appointed New Zealand selector". ESPNcricinfo. 8 July 2015. Retrieved 13 June 2021.

బాహ్య లింకులు మార్చు