కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (సి.పి.ఐ)

భారతదేశ రాజకీయ పార్టీ
(సి.పి.ఐ నుండి దారిమార్పు చెందింది)

కమ్యూనిజం భావజాలంతో భారతదేశంలో తొలిగా ఏర్పడ్డ రాజకీయ పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ. దీని ఆంగ్ల పేరు (Communist Party of India (CPI) లోని ప్రథమాక్షరాలతో సిపిఐగా లేక భా.క.పాగా పేరుపొందింది.ఈ పార్టీ డిసెంబరు 26 1925 స్థాపించబడింది. 1964లో దీనిలోని అతివాద వర్గం కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు)గా విడిపోయింది.

కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా
సెక్రటరీ జనరల్సురవరం సుధాకర రెడ్డి
స్థాపన తేదీడిసెంబరు 26, 1925; 98 సంవత్సరాల క్రితం (1925-12-26)
ప్రధాన కార్యాలయంఢిల్లీ
పార్టీ పత్రికNew Age (English),
Mukti Sangharsh (Hindi),
Kalantar (Bengali),
Janayugam daily (Malayalam),
Visalandra Daily (Telugu) Andhrapradesh,
JANASAKTHI Daily (Tamil) Tamilnadu
విద్యార్థి విభాగంAll India Students Federation
యువత విభాగంAll India Youth Federation
మహిళా విభాగంNational Federation of Indian Women
కార్మిక విభాగంAll India Trade Union Congress and Bharatiya Khet Mazdoor Union
రైతు విభాగంAll India Kisan Sabha (Ajoy Bhavan)
రాజకీయ విధానంకమ్యూనిజం
International affiliationInternational Conference of Communist and Workers' Parties.
రంగు(లు)Red
కూటమిLeft Front
లోక్‌సభ స్థానాలు
2 / 543
రాజ్యసభ స్థానాలు
1 / 245

కమ్యూనిస్ట్ పార్టీ అఫ్ ఇండియా (సిపిఐ) పార్టీ 1925 చివరలో కాన్పూర్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోలో స్థాపించబడింది, భారతదేశం లోపల, బయట చాలా మంది ప్రజలు ఉపఖండంలో కమ్యూనిస్ట్ ఉనికిని నెలకొల్పడానికి ప్రయత్నించారు. 1920 లో తాష్కెంట్‌లో (ఇప్పుడు ఉజ్బెకిస్తాన్‌లో) మనబేంద్ర నాథ్ రాయ్, అబాని ముఖర్జీ,రాయ్ భార్య ఎవెలిన్ భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీని ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చిన వారు. కమ్యూనిస్ట్ పార్టీ అఫ్ ఇండియా తమ లక్ష్యాలలో మిలిటెంట్ సామ్రాజ్యవాద దేశభక్తిని అంతర్జాతీయవాదంతో కలిపి మోహన్‌దాస్ కె. గాంధీ, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (కాంగ్రెస్ పార్టీ) నేతృత్వంలోని అహింసాత్మక శాసనోల్లంఘన (సత్యాగ్రహ) ప్రచారాలకు ఒక ఉద్యమాన్ని ప్రారంభించాయి . అయితే, ఆ సమయంలో, బ్రిటీష్ పరిపాలన కమ్యూనిస్ట్ కార్యకలాపాలపై సాధారణ నిషేధాన్ని విధించింది, పార్టీకి వ్యతిరేకంగా అనేక చర్యలు తీసుకుంది, పార్టీ నాయకులను 1929 లో జైళ్ళలో వేయడంతో సహా సిపిఐ సంస్థాగతంగా బలహీనంగా ఉండి, పార్టీ అయ్యే వరకు రహస్యంగా పనిచేయడానికి ఆంక్షలు విధించారు . తర్వాత 1942 లో రద్దు చేయబడింది. 1947 లో భారతదేశం వచ్చిన తరువాత కమ్యూనిస్ట్ పార్టీ అఫ్ ఇండియా ( సిపిఐ) బలపడింది . కమ్యూనిస్ట్ పార్టీ ( సి.పి .ఐ ) మహిళలకు సామాజిక సమానత్వం, పెద్దలందరికీ ఓటు హక్కు, ప్రైవేటు యాజమాన్యంలోని సంస్థల జాతీయం, భూ సంస్కరణలు, అట్టడుగు కులాలకు సామాజిక న్యాయం ( అంటరానివారితో సహా), సమ్మెల ద్వారా నిరసన తెలపడం, వంటివి పార్టీ యొక్క ప్రజాదరణను పెంచాయి. 1951 లో పార్టీ "జాతీయ ప్రజాస్వామ్యం" అని ప్రజలకు పిలుపునిచ్చింది. పార్టీ 1950 నుంచి దేశములో జరిగిన ఎన్నికలలో (లోక్‌సభ, రాజ్యసభ ) 1951, 1957, 1962 కాంగ్రెస్ పార్టీతో పోలిస్తే ఇది చాలా తక్కువ సీట్లను పొంది, ప్రధాన ప్రతిపక్ష పార్టీగా దేశములో అవతరించింది. 1957 లో సిపిఐ కేరళలో జరిగిన శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్‌ను ఓడించింది, ఇ.ఎం.ఎస్. నంబూద్రిపాద్మొ ముఖ్యమంత్రిగా భారతదేశంలో మొదటి కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కేరళలలో నంబూద్రిపాద్ ప్రభుత్వం అనేక సంస్కరణలను ( భూసంస్కరణ, విద్యా విధానములో ) ప్రవేశపెట్టింది. ఈ సంస్కరణ లతో వ్యతిరేకంగా ఉద్యమాలు కూడా జరిగినవి [1]

భారతదేశములో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా స్థాపించిన వ్యక్తులు : ఎం. ఎన్. రాయ్, ఎవెలిన్ రాయ్-ట్రెంట్, అబాని ముఖర్జీ, రోసా ఫిటింగోవ్, మహ్మద్ అలీ, మొహమ్మద్ షఫీక్, . సి .పి.ఐ పార్టీ యొక్క కార్యక్రమాన్ని భారతదేశ పరిస్థితులకు తగినట్లుగా రూపొందించాలని నిర్ణయించింనారు [2] ఎస్ . వి . ఘటే మొదటి జనరల్ సెక్రటరీ, కమ్యూనిస్ట్ పార్టీ అఫ్ ఇండియా ( 1925-1933) వరకు [3][4][5]

సంస్థాగతరూపం

మార్చు
 
సురవరం సుధాకర రెడ్డి, ప్రధాన కార్యదర్శి, 2012-19
 
కంకి-కొడవలి సిపిఐ ఎన్నికల గుర్తు

భా.క.పా. భారత ఎన్నికల కమీషను చే జాతీయ పార్టీగా గుర్తింపబడింది. As of 2019 భా.క.పా. ప్రస్తుత ప్రధాన కార్యదర్శి డి. రాజా. కె. నారాయణ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా, కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్నాడు.

సి.పి.ఐ.కి చెందిన అనుబంధ సంస్థలు:

లోక్‌సభ ఎన్నికలలో కమ్యూనిస్టు పార్టీ స్థితి

మార్చు
ఎన్నిక సంవత్సరం పోటీచేసిన స్థానాలు గెలిచిన స్థానాలు
1999 54 4
2004 34 10
2009 56 4
2014 67 1
2019 49 2

ప్రధాన కార్యదర్శులు, చైర్మన్లు

మార్చు
వ.సంక్య చిత్తరువు పేరు పదవీకాలం
1వ సచ్చిదానంద్ విష్ణు ఘటే 1925-1933
2వ   గంగాధర్ అధికారి 1933-1935
3వ   పురాణ్ చంద్ జోషి 1935-1948
4వ   బి.టి.రణదివే 1948-1950
5వ చండ్ర రాజేశ్వరరావు 1950-1951, 1964-1990
6వ అజోయ్ ఘోష్ 1951-1962
Chairman   శ్రీపాద అమృత్ డాంగే 1962-1981
7th   ఇ.ఎం.ఎస్.నంబూద్రిపాద్ 1962-1964
8th ఇంద్రజిత్ గుప్తా 1990-1996
9th   ఎ.బి.బర్ధన్ 1996-2012
10th   సురవరం సుధాకరరెడ్డి 2012-2019
11th   డి. రాజా 2019–Present

రాష్ట్రాల వారిగా భా.క.పా. ఫలితాలు

మార్చు

2006 వరకు రాష్ట్రాల శాసనసభలలో భాకపా స్థితి క్రింద ఇవ్వబడింది.

రాష్ట్రం అభ్యర్థుల సంఖ్య గెలుపొందినవారి సంఖ్యశాసనసభలో మొత్తం సీట్లుఎన్నికల సంవత్సరం
ఆంధ్రప్రదేశ్1262942004
అస్సాం1911262001
బీహారు15353242000
ఛత్తీస్‌గఢ్180902003
ఢిల్లీ20702003
గోవా30402002
గుజరాత్101812002
హర్యానా100902000
హిమాచల్ ప్రదేశ్70682003
జమ్ము కాశ్మీర్50872002
కర్ణాటక502242004
కేరళ22171402006
మధ్యప్రదేశ్1702302003
మహారాష్ట్ర1902881999
మణిపూర్164602006
మేఘాలయ30602003
మిజోరం40402003
ఒడిషా611472004
పాండిచ్చేరి20302001
పంజాబ్1101172006
రాజస్థాన్1502002003
తమిళనాడు862342006
త్రిపుర21602003
ఉత్తర ప్రదేశ్504022002
ఉత్తరాంచల్140702002
పశ్చిమ బెంగాల్1382942006

ఆంధ్రప్రదేశ్ శాసనసభకు జరిగిన 2009ఎన్నికలలో నాలుగు సీట్లు గెలుచుకుంది.

కూటమి

మార్చు

మరుమలార్చి ద్రవిడ మున్నేట్ర కజగం, విదుతలై చిరుతైగల్ కట్చి, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) అనే పార్టీలతో కలిసి 2015 అక్టోబరులో పీపుల్స్ వెల్ఫేర్ ఫ్రంట్ ఏర్పాటు చేసింది.

ఇవీ చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. "Communist Party of India | political party, India". Encyclopedia Britannica (in ఇంగ్లీష్). Retrieved 2020-10-20.
  2. "Formation of the Communist Party of India at Tashkent (1920)". Communist Party of India (Marxist) (in ఇంగ్లీష్). 2015-02-03. Archived from the original on 2020-11-06. Retrieved 2020-10-20.
  3. NOORANI, A. G. "Origins of Indian communism". Frontline (in ఇంగ్లీష్). Retrieved 2020-10-20.
  4. "List of General Secretaries of CPI (Communist Party of India)". TeachingBanyan.com - A Place for Students to learn online (in అమెరికన్ ఇంగ్లీష్). 2020-07-07. Retrieved 2020-10-20.
  5. "COMMUNIST MOVEMENT: THE BACKGROUND" (PDF). shodhganga.inflibnet.ac.in/. 2020-10-20. Retrieved 2020-10-20.{{cite web}}: CS1 maint: url-status (link)

రివల్యూషనరీ కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (దాస్)బయటి లింకులు

మార్చు