గిద్దలూరు (ప్రకాశం జిల్లా)

ఆంధ్ర ప్రదేశ్, ప్రకాశం జిల్లా, గిద్దలూరు మండలం లోని జనగణన పట్టణం
(గిద్దలూరు(ప్రకాశం జిల్లా) నుండి దారిమార్పు చెందింది)


గిద్దలూరు ప్రకాశం జిల్లాలోని ఒక ముఖ్య పట్టణం.[1] పిన్ కోడ్: 523 357., ఎస్.టి.డి.కోడ్ = 08405.

గిద్దలూరు
పట్టణం
గిద్దలూరు is located in Andhra Pradesh
గిద్దలూరు
గిద్దలూరు
నిర్దేశాంకాలు: 15°22′42″N 78°55′35″E / 15.3784°N 78.9265°E / 15.3784; 78.9265Coordinates: 15°22′42″N 78°55′35″E / 15.3784°N 78.9265°E / 15.3784; 78.9265 Edit this at Wikidata
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా
మండలంగిద్దలూరు మండలం
విస్తీర్ణం
 • మొత్తం2,094 హె. (5,174 ఎ.)
జనాభా
(2011)
 • మొత్తం35,150
 • సాంద్రత1,700/కి.మీ2 (4,300/చ. మై.)
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 (08405 Edit this at Wikidata)
పిన్(PIN)523357 Edit this at Wikidata
జాలస్థలిEdit this at Wikidata

గ్రామ చరిత్రసవరించు

 
గిద్దలూరు చరిత్రకు కేంద్రబిందువైన పురాతన పాతాళ నాగేశ్వరస్వామి ఆలయం. ఇది సగిలేరు ఒడ్డున ఉంది.

గిద్దలూరు యొక్క పూర్వ నామము సిద్ధలూరు. సిద్ధలూరు సమీపములోని నాగేశ్వరాలయము దగ్గర ఒక స్థలమును నందన చక్రవర్తి శ్రీవత్స గోత్రజుడు, నందనవారిక వంశానికి చెందిన కుంచాల శివప్పకు అగ్రహారముగా ఇచ్చాడు. కానీ తరువాత ఈ గ్రామం.[2] పాడుబడటము వలన, శివప్ప వంశీయుడైన రామచంద్ర నందవరము నకు తరలివెళ్లి, అక్కడి నుండే సిద్ధలూరి యొక్క వ్రిత్తిని అనుభవించాడు.

శక యుగములో తొండమారయగుళ్ల స్థాపన జరిగిన తరువాత, కుంచెల రామచంద్ర తొండమారయగుళ్ల నాయకుని నుండి కొత్తగా స్థాపించిన సిద్ధలూరిని అగ్రహారముగా పొంది నందవరము నుండి ఇరవై - ముప్పై బ్రాహ్మణ కుటుంబములు, బారబలావతులతో (12 మంది గ్రామ సేవకులు) సహా సిద్ధలూరికి తిరిగి వచ్చాడు. అయితే, తొండమారయగుళ్ల నాయకుని మరణానంతరము ఆ ప్రదేశము నిర్జనమైంది. ఆ కాలములో సిద్ధలూరి ప్రాభవము పెరిగి గ్రిద్ధలూరని కొత్త పేరు సంతరించుకొన్నది. కొంత కాలము తర్వాత గ్రిద్దలూరు అగ్రహారీకుడూ, కుంచాల రామచంద్రుని వంశజుడూ అయిన కుంచెల వెంకటాద్రయ్య గ్రామం చుట్టూ అనేక కుగ్రామంలు స్థాపన చేయించి గిద్దలూరిని మెరుగు పరచెను. అనతి కాలములోనే ఆ కుగ్రామంలు కంచిపల్లె, చట్టిరెడ్డిపల్లె, అక్కలరెడ్డిపల్లె మౌజే లుగా (స్వంతంత్ర గ్రామంలు లేదా ఒక మాదిరి పట్టణములు) ఎదిగినవి. దీనితో గిద్దలూరు కస్బా (ప్రధాన కేంద్రము) అయినది.

హరిహర దేవరాయల కాలములో రామచంద్రరాజు ఈ ప్రాంతములను జాగీర్దారుగా పరిపాలించుటకు వచ్చి ఈ గ్రామంలను వెంకటాద్రి నుండి వశము చేసుకొన్నాడు. కానీ ఆ తర్వాత కాలములో వెంకటాద్రి నుండి ఆ వంశములో మూడవ తరానికి చెందిన రామచంద్ర, హరిహర రాయలచే పునస్థాపించబడి తన గ్రామాలను తిరిగి పొందెను. ఆయన కరణముగా కూడా నియమించబడెను. ఈ విధముగా ముస్లింలు రాక వరకు రామచంద్రరాజు వంశజులు గిద్దలూరు కస్బాను, దాని గ్రామాలను పరిపాలించారు. రాయల పాలన ముగింపుతో గిద్దలూరు ముస్లింల ఆక్రమణకు గురై, ఆ తరువాత కాలములో దత్తమండలాలను నిజాము బ్రిటీషువారికి దత్తము చేసినప్పుడు కడప జిల్లాలో భాగముగా ఉన్న గిద్దలూరు బ్రిటిషు పాలనలోకి వచ్చింది. కర్నూలు జిల్లా యేర్పడిన తర్వాత కర్నూలు జిల్లాలోను భాగమై, 1971లో ఒంగోలు జిల్లా ఏర్పాటు చేసినప్పుడు కొత్తగా ఏర్పడిన జిల్లాలో కలపబడింది.

పురావస్తు చరిత్రసవరించు

1930వ దశకములో కామ్మియెడ్, బర్కెట్ట్ అను ఇద్దరు పురావస్తు శాస్త్రజ్ఞులు గిద్దలూరు పరిసరాల్లో పాత రాతియుగము (అప్పర్ పేలియోలిథిక్) నాటి మానవుడు నివసించిన ఆధారాలు కనుగొన్నారు.[3] ఇక్కడ మధ్య రాతియుగము నాటి చిన్న రాతి పనిముట్ల పరిశ్రమలు బయల్పడ్డాయి.[4] ఈ చిన్న పనుముట్లు క్వార్ట్‌జ్ చేయబడినవి.[5]

గ్రామ భౌగోళికంసవరించు

సగిలేరు నది (స్వర్ణబాహు నది) గిద్దలూరికి దక్షిణాన ప్రవహిస్తున్నది.

సమీప గ్రామాలుసవరించు

నరవ 1.9 కి.మీ, కొంగలవీడు 2.2 కి.మీ, తిమ్మాపురం 5.6 కి.మీ, అంబవరం 5.7 కి.మీ, ముండ్లపాడు 6.1 కి.మీ.

సమీప పట్టణాలుసవరించు

రాచెర్ల 11.7 కి.మీ,కొమరోలు 13.2 కి.మీ,బెస్తవారిపేట 28.2 కి.మీ.

గ్రామంలోని విద్యా సౌకర్యాలుసవరించు

 1. వివేకానంద డిగ్రీ కళాశాల.
 2. ఎస్.వి. డిగ్రీ కళాశాల.
 3. సాయిశ్రీ జూనియర్ కళాశాల.
 4. శ్రీ వివేకానంద ఉన్నత పాఠశాల.
 5. శ్రీ జీవన జ్యోతి డిగ్రీ కళాశాల.
 6. శ్రీ సాయి చైతన్య డిగ్రీ కళాశాల. 

గ్రామానికి రవాణా సౌకర్యంసవరించు

గిద్దలూరు గుంటూరు - ద్రోణాచలము రైల్వే లైనుపై ఒక ప్రముఖ రైల్వేస్టేషను. ఈ రైల్వే స్టేషన్ నుండి * బెంగళూరు, విజయవాడ, హైదరాబాద్ వంటి ప్రధాన నగరాలకు చేరుకోవచ్చు.

గిద్దలూర్‌లో బస్ డిపో ఉంది. ఇక్కడి నుండి సమీప గ్రామాలకు చేరుకోవడానికి మాకు చాలా బస్సులు ఉన్నాయి.

గ్రామంలోని మౌలిక సదుపాయాలుసవరించు

బ్యాంకులుసవరించు

1.బ్యాంక్ ఆఫ్ ఇండియా, 2.స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, 3. స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, 4.ఆంధ్రా బ్యాంక్, 5.హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ లిమిటెడ్, 6.కోటక్ మహీంద్రా బ్యాంక్.

వినోదంసవరించు

గిద్దలూర్ మేజర్ పట్టణంలో నాలుగు థియేటర్లు ఉన్నాయి 1. నటరాజ్ 2. శ్రీ వెంకటేశ్వర మహల్ 3. కృష్ణ మహల్ 4. శ్రీనివాస థియేటర్

అమ్మ ఆశ్రమంసవరించు

ఈ ఆశ్రమం, గిద్దలూరు నగర పంచాయతీ, కొంగళవీడు రహదారిపై ఉన్న్నది.

గ్రామంలో ప్రధాన పంటలుసవరించు

వరి, అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులుసవరించు

వ్యవసాయం, వ్యవసాయ ఆధారిత వృత్తులు.

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలుసవరించు

గిద్దలూరు నగర పంచాయతీ రేడియో బావి సమీపంలోని శ్రీ అభయాంజనేయస్వామి, శ్రీ ఉమామహేశ్వరస్వామి దేవస్థానం, నవగ్రహ దేవతల ప్రతిష్ఠా మహోత్సవం నిర్వహించారు.

శ్రీ అభయాంజనేయస్వామివారి ఆలయంసవరించు

గిద్దలూరు నగర పంచాయతీ రేడియోబావి కూడలిలోని ఈ ఆలయంలో, ప్రతి సంవత్సరం, హనుమజ్జయంతి వేడుకలు వైభవంగా నిర్వహించెదరు.

శ్రీ సీతారామస్వామివారి ఆలయంసవరించు

ఈ ఆలయం గిద్దలూరు నగర పంచాయతీలోని పాత బద్వేలు రహదారిపై ఉంది. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం శ్రీరామనవమికి, తొమ్మిది రోజులపాటు ఉత్సవాలు వైభవంగా నిర్వహించెదరు.

శ్రీ రమా సత్యనారాయణస్వామివారి ఆలయంసవరించు

గిద్దలూరు నగర పంచాయతీ లోని ఆంకాళమ్మ వీధిలో 2015,ఫిబ్రవరి-21వ తేదీ, శనివారం ఉదయం, శ్రీ రమా సత్యనారాయణస్వామివారి విగ్ర ప్రతిష్ఠా కార్యక్రమం వైభవంగా నిర్వహించారు.

శ్రీ వరసిద్ధివినాయకస్వామివారి ఆలయంసవరించు

గిద్దలూరు నగర పంచాయతీలోని కొంగళవీడు రహదారిలో నెలకొనిఉన్నది.

పురాతన పాతాళ నాగేశ్వరస్వామి ఆలయంసవరించు

 • ఈ ఆలయం గిద్దలూరు-కొంగలవీడు రహదారిపై, సగిలేరు వాగు ఒడ్డున ఉంది.
 • గిద్దలూరు నగర పంచాయతీలోని పాతాళ నాగేశ్వరస్వామివారి ఆలయంలో, జీవ ధ్వజ స్థంభం ప్రతిష్ఠా మహోత్సవం, వేద పండితుల ఆధ్వర్యంలో, వైభవంగా నిర్వహించినారు.

శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయంసవరించు

ఈ ఆలయం గిద్దలూరు నగర పంచాయతీలోని రాచర్ల గేటు కూడలిలో ఉంది.

శ్రీ కాశినాయన దేవస్థానంసవరించు

ఈ ఆలయం గిద్దలూరు నగర పంచాయతీలోని కాశిరెడ్డినగరులో ఉంది.

శ్రీ గాయత్రీమాత దేవస్థానంసవరించు

శ్రీ కాశి నాయన దేవస్థానం ఆవరణలో, గాయత్రీ మాత దేవస్థానం నిర్మాణానికి, గాయత్రీ పరివారం భూమిపూజ నిర్వహించారు.

శ్రీ కాళికాంబ దేవి ఆలయంసవరించు

ఈ ఆలయం గిద్దలూరు మండలం వీరన్న బావి కూడలి వద్ద ఉంది.

శ్రీ ఈశ్వరమ్మ తల్లి ఆలయంసవరించు

ఈ ఆలయం స్థానిక కొంగళవీడు రహదారిలో ఉంది.

శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి ఆలయంసవరించు

నరవ రహదారిలో కొత్తగా నిర్మించనున్న ఈ ఆలయ నిర్మాణానికి, శంకుస్థాపన నిర్వహించారు.

ఇవి కూడా చూడండిసవరించు

గణాంకాలుసవరించు

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 26,977.[6] ఇందులో పురుషుల సంఖ్య 13,662, మహిళల సంఖ్య 13,315, గ్రామంలో నివాస గృహాలు 5,979 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 2,094 హెక్టారులు.

మూలాలుసవరించు

 1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
 2. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2012-10-01. Retrieved 2015-09-04.
 3. Indian Anthropologist: Journal of the Indian Anthropological Association By Indian Anthropological Association v.11 (1981) పేజీ.21 [1]
 4. An Encyclopaedia of Indian Archaeology By Amalananda Ghosh పేజీ.149
 5. Indian History (21st Edition, 2005) Allied Publishers ISBN 8177647660 పేజీ.A-9 [2]
 6. http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18