గిరీశ్ కులకర్ణి

మరాఠి సినిమా నటుడు, రచయిత, నిర్మాత, దర్శకుడు.

గిరీష్ పాండురంగ్ కులకర్ణి (జననం 25 నవంబరు 1977) మరాఠి సినిమా నటుడు, రచయిత, నిర్మాత, దర్శకుడు. 2011లో వచ్చిన దేవూళ్ సినిమాకు జాతీయ ఉత్తమ నటుడిగా, జాతీయ ఉత్తమ స్క్రీన్ ప్లే రచయితగా రెండు జాతీయ చలనచిత్ర పురస్కారాలు అందుకున్నాడు. వాలూ (ది వైల్డ్ బుల్), విహిర్ (ది వెల్), దేవూళ్ (ది టెంపుల్), గబ్రిచా పాస్ (ది డామెండ్ రైన్), జౌండ్యా నా బాలాసాహెబ్ వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.[1][2][3] ఆమిర్ ఖాన్ నటించిన దంగల్ సినిమా, అనురాగ్ కశ్యప్ తీసిన అగ్లీ సినిమాలలో నటించి హిందీ ప్రేక్షకులకు సుపరిచితుడయ్యాడు. 2017లో వచ్చిన మరాఠీ క్రైమ్ థ్రిల్లర్ ఫాస్టర్ ఫెన్ లో గ్యాంగ్ స్టర్ 'అప్పా' పాత్రలో నటించినందుకు ప్రశంసలు అందుకున్నాడు.[4] 2018 భారతదేశపు మొట్టమొదటి నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ సిరీస్ సేక్రేడ్ గేమ్స్‌లో రాజకీయ నాయకుడు బిపిన్ భోంస్లే పాత్రలో నటించాడు.

గిరీశ్ కులకర్ణి
మసాల సినిమా ప్రీమియర్ లో గిరీశ్ కులకర్ణి
జననం (1977-11-25) 1977 నవంబరు 25 (వయసు 46)
వృత్తినటుడు, రచయిత, నిర్మాత, దర్శకుడు
పురస్కారాలుభారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు
2011 - ఉత్తమ నటుడు

వ్యక్తిగత జీవితం

మార్చు

గిరీష్ కులకర్ణి 1977, నవంబరు 25న మహారాష్ట్ర, ఉస్మానాబాద్ జిల్లాలోని పరందా తాలూకాలో జన్మించాడు. పూణేలో పెరిగాడు. లాతూర్ లోని పురన్మల్ లాహోటి గవర్నమెంట్ పాలిటెక్నిక్ నుండి మెకానికల్ ఇంజనీరింగ్ లో డిప్లొమా పొందాడు. స్థానికంగా ఉన్న నాటక సంస్థలలో చేరి పలు నాటకాలలతో నటించాడు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తయిన తరువాత, కొంతకాలం ప్రైవేట్ ఐటి కంపెనీలలో పనిచేశాడు. తనకు ఇష్టమైన రచనలు కొనసాగించాలని నిర్ణయించుకొని, మరాఠీ చిత్ర పరిశ్రమలో చేరాడు. సినిమారంగంలోకి రావడానికి ముందు రేడియో మిర్చిలో క్లస్టర్ ప్రోగ్రామింగ్ హెడ్‌గా పనిచేశాడు.[5]

 
గిరీష్ కులకర్ణి 2008లో కార్లోవీ వేరిలో వాలూ సినిమాను ప్రదర్శించాడు

సినిమాలు

మార్చు
సంవత్సరం సినిమా పేరు పాత్ర భాష
2006 బాదా బెవ్డా మరాఠీ
2008 వలూ జీవన్ మరాఠీ
2009 గబ్రిచా పాస్ కిస్నా మరాఠీ
2009 గాంధ మంగేష్ మరాఠీ
2009 విహిర్ భవష మామా మరాఠీ
2011 దేవూళ్ కేశ్య మరాఠీ
2012 మసాలా రేవన్ పాటిల్[6] మరాఠీ
2013 పూణే 52 అమర్ ఆప్టే మరాఠీ
2014 అందములేని విజయ్ జాదవ్ హిందీ
2013 పోస్ట్‌కార్డ్ పోస్ట్ మాన్
2015 హైవే శేఖర్ మరాఠీ
2016 జౌండ్య నా బాలాసాహెబ్ బాలాసాహెబ్ మరాఠీ
2016 దంగల్ రెజ్లింగ్ కోచ్ ప్రమోద్ కదమ్ హిందీ
2017 కాబిల్ ఇన్స్పెక్టర్ నాలావాడే హిందీ
2017 వేగంగా ఫెన్ అప్పా మరాఠీ
2018 ఫన్నీ ఖాన్ కరణ్ కక్కడ్ హిందీ
2018 బోయ్జ్ 2 మరాఠీ
2018 ఫైర్‌బ్రాండ్ మరాఠీ
2019 దితీ గోవింద మరాఠీ
2020 భాగ్ బీని భాగ్ హిందీ

వెబ్ సిరీస్

మార్చు
సంవత్సరం సినిమా పేరు పాత్ర భాష ఛానల్ మూలాలు
2018 సెక్రెడ్ గేమ్స్ బిపిన్ భోస్లే హిందీ నెట్‌ఫ్లిక్స్
2021 సన్ ఫ్లవర్ సబ్ ఇన్స్పెక్టర్ చేతన్ తంబే హిందీ జీ5
రచన, నిర్మాణం
సంవత్సరం సినిమా మూలాలు
2008 వలూ కథ, స్క్రీన్ ప్లే, డైలాగులు, నిర్మాత
2009 విహిర్ కథ, స్క్రీన్ ప్లే, డైలాగులు
2011 దేవూళ్ కథ, స్క్రీన్ ప్లే, డైలాగులు
2012 మసాలా కథ, స్క్రీన్ ప్లే, డైలాగులు
2016 జౌండ్య నా బాలాసాహెబ్ కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్
2018 ధప్ప రచయిత, నిర్మాత

అవార్డులు

మార్చు
జాతీయ చలన చిత్ర పురస్కారాలు [7]

మూలాలు

మార్చు
  1. "Girish Kulkarni". Mumbai Cinemas. Archived from the original on 26 April 2012. Retrieved 27 July 2021.
  2. Square on (12 March 2012). "Girish Kulkarni Latest Movies Videos Images Photos Wallpapers Songs Biography Trivia On". Gomolo.com. Archived from the original on 20 జనవరి 2021. Retrieved 27 July 2021.
  3. "Ugly IMDB".
  4. "Faster Fene review".
  5. "Ugly actor Girish Kulkarni". Marathi Sanmaan. Archived from the original on 15 మే 2016. Retrieved 27 July 2021.
  6. Shakti Salgaonkar (20 April 2012). "Review: Masala (Marathi)". DNA (newspaper). Mumbai. Retrieved 27 July 2021.
  7. Vidya Balan, Girish Kulkarni big winners at National Film Awards

బయటి లింకులు

మార్చు