బి. జయ
బి. జయ తెలుగు సినిమా దర్శకురాలు.[1] జర్నలిస్ట్ గా కెరీర్ ను ప్రారంభించి, సూపర్ హిట్ అనే సినీవారపత్రికను స్థాపించి, ప్రేమలో పావని కళ్యాణ్ సినిమాతో దర్శకురాలిగా మారింది.[2]
బి. జయ | |
---|---|
జననం | |
మరణం | 2018 ఆగస్టు 30 హైదరాబాదు | (వయసు 54)
జాతీయత | భారతీయురాలు |
వృత్తి | సినిమా దర్శకురాలు |
క్రియాశీల సంవత్సరాలు | 2002 – 2018 |
జీవిత భాగస్వామి | బి.ఎ. రాజు |
జననం - విద్యాభ్యాసం
మార్చుఈవిడ 1964 జనవరి 11 న తూర్పు గోదావరి జిల్లా, అడ్డతీగల మండలం, రావులపాలెం గ్రామంలో జన్మించింది. చెన్నై విశ్వవిద్యాలయంలో ఎం.ఎ. (ఇంగ్లీష్ లిటరేచర్), జర్నలిజంలో డిప్లొమా చేసింది. అన్నామలై విశ్వవిద్యాలయంలో ఎం.ఎ. (సైకాలజీ) చదివింది.[3]
సినీరంగ ప్రస్థానం
మార్చుచదువు పూర్తికాగానే ఆంధ్రజ్యోతి డైలీతో తన జర్నలిస్ట్ జీవితాన్ని ప్రారంభించింది. ఆ తరువాత చిత్రజ్యోతి, ఇండియన్ ఎక్స్ ప్రెస్ పత్రికలలో పనిచేసింది. 2002లో దీపక్, అంకిత హీరో, హీరోయిన్స్ గా నటించిన ప్రేమలో పావని కళ్యాణ్ చిత్రం ద్వారా నిర్మాతగా మారింది. చంటిగాడు సినిమాకు తొలిసారిగా దర్శకత్వం వహించింది. ఈ సినిమా 25 కేంద్రాలలో 100 రోజులు పూర్తిచేసుకుంది.
దర్శకత్వం వహించిన చిత్రాల జాబితా
మార్చుక్రమసంఖ్య | సంవత్సరం | చిత్రంపేరు | నటవర్గం | ఇతర వివరాలు |
---|---|---|---|---|
1 | 2003 | చంటిగాడు | బాలాదిత్య, సుహాసిని | |
2 | 2005 | ప్రేమికులు | యువరాజ్, రిషి గిరీష్, కామ్నా జఠ్మలానీ | |
3 | 2007 | గుండమ్మగారి మనవడు | ఆలీ, సింధూరి | |
4 | 2008 | సవాల్ | భరత్, సుహానీ | |
5 | 2012 | లవ్‌లీ | ఆది, శాన్వీ | |
6 | 2016 | వైశాఖం[1] | హరీశ్, అవంతిక | చిత్రీకరణ |
మరణం
మార్చుగుండె పోటు కారణంగా హైదరాబాదు లో ఆగష్టు 30 2018 న మరణించింది.[4]
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 ఆంధ్రభూమి. "ప్రేమలో కొత్త ఫీల్ -దర్శకురాలు బి.జయ". Retrieved 23 May 2017.
- ↑ టాలీవుడ్ ఫోటో ప్రొఫైల్. "జయ బి. , Jaya B". tollywoodphotoprofiles.blogspot.in. Archived from the original on 19 మార్చి 2017. Retrieved 24 May 2017.
- ↑ నవతెలంగాణ, మానవి (18 February 2018). "కథ నచ్చితేనే." వి.యశోద. Archived from the original on 5 సెప్టెంబరు 2018. Retrieved 6 March 2018.
- ↑ సాక్షి, సినిమా (1 September 2018). "డైనమిజం". Archived from the original on 20 November 2018. Retrieved 20 November 2018.