గుండయ పాళెం
గుండయ పాళెం ప్రకాశం జిల్లా ఒంగోలు మండలం లోని రెవెన్యూయేతర గ్రామం.
గుండయ పాళెం | |
---|---|
గ్రామం | |
అక్షాంశ రేఖాంశాలు: 15°32′19.896″N 80°12′15.984″E / 15.53886000°N 80.20444000°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | ప్రకాశం |
మండలం | ఒంగోలు |
అదనపు జనాభాగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | స్త్రీ పురుష జనాభా వివరాలు లేవు |
ప్రాంతపు కోడ్ | +91 ( 08592 ) |
పిన్‌కోడ్ | 523182 |
గ్రామ పంచాయతీ
మార్చు2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో సంకె వెంకటేశ్వరమ్మ, సర్పంచిగా ఎన్నికైంది
దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు
మార్చుశ్రీ రామాలయం
మార్చుతిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో, మనగుడి కార్యక్రమంలో భాగంగా, ఈ ఆలయంలో,2017,ఆగస్టు-12వతేదీ శనివారంనాడు ప్రత్యేకపూజలు నిర్వహించారు. 13వతేదీ ఆదివారంనాడు, గ్రామములో, భక్తిశ్రద్ధలతో నగర సంకీర్తన నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీవారి సేవకులు కోలాట ప్రదర్శన చేసారు. గ్రామస్థులు ప్రత్యేకపూజలు నిర్వహించి, తీర్థప్రసాదాలు స్వీకరించారు.
ప్రధాన పంటలు
మార్చుప్రధాన వృత్తులు
మార్చువ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు
గ్రామ విశేషాలు
మార్చుఈ తీర ప్రాంత మత్స్యకార గ్రామంలో మద్యం తాగే అవకాశమే లేదు. గొడవలకు ఆస్కారమే లేదు. సంపాదించిన సొమ్ముతో సుఖంగా జీవనం సాగిస్తున్నారు. గ్రామంలో ఈ సమూల మార్పునకు మహిళా సంకల్పమే కారణం. స్త్రీలంతా ఐక్యంగా కదిలి అధికారుల సాయంతో గొలుసు దుకాణాలను మూయించారు. తమ గ్రామాన్ని తీర్చి దిద్దుకుంటున్నారు.
2016-17 సంవత్సరానికి సంబంధించి, ఈ గ్రామానికి చెందిన ఎం.పి.టి.సభ్యుడు శింగోతు వెంకటేశ్వర్లు, రాష్ట్రస్థాయిలో ఉత్తమ ఎం.పి.టి.సి.సభ్యుడుగా ఎంపికైనాడు. 2017, ఏప్రిల్ - 24న, రాష్ట్ర రాజధాని వెలగపూడిలో నిర్వహించు పంచాయతీరాజ్ దినోత్సవ వేడుకలలో భాగంగా, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుగారి చేతుల మీదుగా పురస్కారం అందుకున్నాడు.