వెలగపూడి (తుళ్ళూరు మండలం)
వెలగపూడి గుంటూరు జిల్లా లోని తుళ్ళూరు మండలానికి చెందిన గ్రామం. ఈ గ్రామం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నగరంలో ఉంది. ఇది మండల కేంద్రమైన తుళ్ళూరు నుండి 8 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన మంగళగిరి నుండి 13 కి. మీ. దూరంలోనూ ఉంది. ఇచ్చటనే ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక సచివాలయం నిర్మించబడింది, మొత్తం 5 బ్లాకులుగా ఎల్&టి, షాపూర్ జీ వారు నిర్మాణంచేపట్టి 4 నెలలో పూర్తిచేసి ప్రభుత్వానికి అప్పగించటం జరిగింది.[1]
వెలగపూడి | |
— రెవిన్యూ గ్రామం — | |
అక్షాంశరేఖాంశాలు: 16°33′28″N 80°27′47″E / 16.557885°N 80.463066°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
జిల్లా | గుంటూరు |
మండలం | తుళ్ళూరు |
ప్రభుత్వం | |
- సర్పంచి | శ్రీమతి కంచర్ల శాంతకుమారి |
జనాభా (2011) | |
- మొత్తం | 2,688 |
- పురుషుల సంఖ్య | 1,346 |
- స్త్రీల సంఖ్య | 1,342 |
- గృహాల సంఖ్య | 783 |
కాలాంశం | భారత ప్రామాణిక కాలమానం (UTC) |
పిన్ కోడ్ | 522237 |
ఎస్.టి.డి కోడ్ | 08645 |
గ్రామ చరిత్ర
మార్చు1199 AD నుండి 1261AD వరకు ఈ ప్రాంతాన్ని కాకతీయ చక్రవర్తి గణపతి దేవుడు పరిపాలించారు. ఆకాలంలో శైవ మతం ఉచ్చస్థితి లో ఉంది. శైవులు దేశం నలుమూలల అనేక మఠాలు నెలకొల్పి ప్రజాసేవ చేసారు. ఈ శైవ మఠాలలో దాహళ దేశం నుండి వచ్చిన గోళకీ మఠము సుప్రసిద్దమైనది. ఈ మఠానికి మందడం ప్రధాన కేంద్రం. ఈ మఠానికి అనుభంధంగా వేద పాఠశాలు, సత్రాలు, దేవాలయాలతో పాటు ప్రసూతి ఆరోగ్య శాలలు ఉండేవి. ఈ గోళకీ మఠము యొక్క మఠాధిపతి విశ్వేశర శివ దేశికులు. వీరు కాకతీయ చక్రవర్తి గణపతి దేవునికి శివ దీక్ష ను ఇచ్చారు, ఈ గోళకీ మఠము నిర్వహణ నిమిత్తం వెలగపూడి, మందడ గ్రామాలను మందడంలో ఉన్న ఆధ్యాత్మిక గురువు శివాచర్యకు బహుమతిగా ఇచ్చారు.[2]
ఇక్కడికి సమీపంలో మల్కపురం గ్రామంలో కాకతీయ చక్రవర్తి వేయించిన శిలా శాసనం మల్కాపురం శాసనం కూడా ఇక్కడ చూడవచ్చు. ఈ శాసనం 2.9x2.9 అడుగుల చతురస్రాకారపు ఒక నల్ల రాతి శిలా స్థంభం. దీని ఎత్తు 14.6 అడుగులు. తెలుగు సంస్కృత భాషలలో 182 పంక్తులలో రాణి రుద్రమదేవి జన్మించిన శుభ సందర్బంగా విశ్వేశర గోళకీ మఠానికి గణపతి దేవుడు ఇచ్చిన భూదానం గురించి చెక్కబడింది.[2] [3]
పరిపాలన
మార్చు2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి కంచర్ల శాంతకుమారి, సర్పంచిగా ఏకగ్రీవంగా ఎన్నికైనారు. వెలగపూడి అమరావతిలో నగరంలో ఒక భాగం.
సీఆర్‌డీఏ
మార్చుసీఆర్డీఏ పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.[4] తుళ్లూరు మండలం పరిధిలో: లింగాయపాలెం, దాని పరిధిలో ఉన్న ఆవాస ప్రాంతాలు (హామ్లెట్స్), మోదుగు లంకపాలెం, ఉద్దండ రాయుని పాలెం, వెలగపూడి, నేలపాడు, శాకమూరు, ఐనవోలు, మల్కాపురం, మందడంతో పాటు దాని పరిధిలో ఉన్న హామ్లెట్స్, వెంకటపాలెం, అనంతవరం, నెక్కల్లు, తుళ్లూరు, దొండపాడు, అబ్బరాజుపాలెం, రాయపూడి, బోరుపాలెం, కొండ్రాజుపాలెం, పిచుకల పాలెం, ఉండవల్లి, పెనుమాక, తాడేపల్లి మున్సిపాలిటీ పరిధిలోని నులకపేట, డోలస్ నగర్ ప్రాంతాలు ఉన్నాయి.[5]
ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక సచివాలయము
మార్చుఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన పిమ్మట అమరావతిని రాష్ట్ర రాజధానిగా నిర్ణయించారు. భారత ప్రధాని శ్రీ నరేంద్రమోడి గారు ఉద్దండరాయునిపాలెం లో రాజధాని నగర నిర్మాణానికి 2015 అక్టోబర్ 22న విజయదశమి నాడు శిలాన్యాసం (శంకుస్థాపన) గావించారు . కాగా జనవరి లో ముఖ్యమంత్రి గారు తాత్కాలిక సచివాలయ భవన సముదాయానికి శంకుస్థాపన గావించారు. జూన్ 2015 నాటికి పరిపాలన అక్కడి నుంచి సాగించాలని భావించినా అది అక్టోబర్ నాటికి సాకారమయింది. అనతి కాలంలో అన్ని హంగులతో సదుపాయాలతో సచివాలయ భవన సముదాయాన్ని నిర్మించిన ఘనత ప్రభుత్వానికి లభించింది.
విద్యా సౌకర్యాలు
మార్చుగ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఒకటి, ప్రైవేటు ప్రాథమిక పాఠశాల ఒకటి , ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి ఉన్నాయి. బాలబడి తుళ్ళూరులోను, మాధ్యమిక పాఠశాల మందడంలోనూ ఉన్నాయి. సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్, సైన్స్, డిగ్రీ కళాశాల తుళ్ళూరులోను, ఇంజనీరింగ్ కళాశాల మంగళగిరిలోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల, మేనేజిమెంటు కళాశాల మంగళగిరిలోను, పాలీటెక్నిక్ విజయవాడలోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం విజయవాడలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల గుంటూరు లోనూ ఉన్నాయి.
వైద్య సౌకర్యం
మార్చుప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. డిస్పెన్సరీ గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. పశు వైద్యశాల గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, సంచార వైద్య శాల, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.
సమాచార, రవాణా సౌకర్యాలు
మార్చువెలగపూడిలో సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉంది. పోస్టాఫీసు సౌకర్యం గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. పబ్లిక్ ఫోన్ ఆఫీసు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. ప్రైవేటు బస్సు సౌకర్యం, రైల్వే స్టేషన్, ట్రాక్టరు సౌకర్యం మొదలైన సౌకర్యాలు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. జాతీయ రహదారి, రాష్ట్ర రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు ఉన్నాయి.
భూమి వినియోగం
మార్చువెలగపూడిలో భూ వినియోగం కింది విధంగా ఉంది:[ఆధారం చూపాలి]
- వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 31 హెక్టార్లు
- శాశ్వత పచ్చిక ప్రాంతాలు, ఇతర మేత భూమి: 8 హెక్టార్లు
- నికరంగా విత్తిన భూమి: 768 హెక్టార్లు
- నీటి సౌకర్యం లేని భూమి: 213 హెక్టార్లు
- వివిధ వనరుల నుండి నీటి పారుదల లభిస్తున్న భూమి: 555 హెక్టార్లు
నీటిపారుదల సౌకర్యాలు
మార్చువెలగపూడిలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది. కాలువలు: 59 హెక్టార్లు
ఉత్పత్తి
మార్చుగణాంకాలు
మార్చు2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం ఈ గ్రామంలో 809 హెక్టారులు విస్తరించి 737 భవనాలను కలిగి ఉంది. ఈ గ్రామ జనాభా 2,695, ఇందులో పురుషుల సంఖ్య 1,388, స్త్రీల సంఖ్య 1,307, షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1131 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 264. 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సున్న వారి జనాభా 260. అక్షరాస్యత రేటు 62.81 శాతం, అనగా 1,525 మంది అక్షరాస్యులు ఉన్నారు.
మూలాలు
మార్చు- ↑ "ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక సచివాలయం". The Hindu. Amaravati. 17 February 2016. Retrieved 12 May 2019.
- ↑ 2.0 2.1 శ్రీనివాస్, కొడాలి (2020). అమారావతి - ఆవశ్యకత. గుంటూరు: రాయల్ సివిల్ పబ్లికేషన్.
- ↑ "13వ శతాబ్దానికి చెందిన శాశనాలు వెలగపూడి సమీపంలో దొరికాయి". The Hindu. Amaravati. 17 May 2015. Retrieved 12 May 2019.
- ↑ Subba Rao, GVR (23 September 2015). "సీఆర్‌డీఏ రాజధాని ప్రాంత సరిహద్దులను విస్తరించింది". The Hindu. Vijayawada. Retrieved 13 May 2019.
- ↑ "ఆంధ్రప్రదేశ్ రాజధాని నగర వైశాల్యాన్ని సవరించిన ఉత్తర్వులను ప్రకటించారు" (PDF). Andhra Nation. Municipal Administration and Urban Development Department. 22 సెప్టెంబరు 2015. Archived from the original (PDF) on 24 జూన్ 2016. Retrieved 21 ఫిబ్రవరి 2016.