గుండుమల తిప్పేస్వామి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ

గుండుమల తిప్పేస్వామి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ. ఆయన ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్నాడు.

గుండుమల తిప్పేస్వామి

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2015 నుండి 2021
నియోజకవర్గం ఎమ్మెల్యే కోటా

వ్యక్తిగత వివరాలు

జననం 03 జనవరి 1960
గుండుమల గ్రామం, మడకశిర మండలం, అనంతపురం జిల్లా , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ
తల్లిదండ్రులు తిగళప్ప, బాలమ్మ

జననం, విద్యాభాస్యం

మార్చు

గుండుమల తిప్పేస్వామి 1960 జనవరి 03లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అనంతపురం జిల్లా, మడకశిర మండలం, గుండుమల గ్రామంలో తిగళప్ప, బాలమ్మ దంపతులకు జన్మించాడు. ఆయన కర్ణాటక రాష్ట్రం, బెంగళూరు, తుంకూర్ లోని సిద్ధగంగా కాలేజీలో 1985లో బీఎస్సీ పూర్తి చేసి, 1989లో బెంగళూరు లోని ఎస్.జె.ఆర్ కాలేజ్ నుండి ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశాడు.

రాజకీయ జీవితం

మార్చు

గుండుమల తిప్పేస్వామి 1987లో కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి, 2001లో జరిగిన స్థానిక సంస్థ ఎన్నికల్లో రొల్ల జెడ్పీటీసీ సభ్యుడిగా ఎన్నికై, 2005లో అనంతపురం జిల్లా పరిషత్ ఛైర్మన్‌గా ఎన్నికయ్యాడు. గుండుమల తిప్పేస్వామి 2007లో కాంగ్రెస్ పార్టీ తరపున ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి శాసనసభ్యుల కోటాలో తొలిసారి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు. ఆయన 2009 ఏప్రిల్లో ఎమ్మెల్సీగా రెండో సారి ఎన్నికయ్యాడు. తిప్పేస్వామి 2010 జూన్ లో అసెంబ్లీ బీసీ వెల్ఫేర్ కమిటీ చైర్మన్‌గా తొలిసారి ఎన్నికై తిరిగి 2010 జూన్ లో రెండో సారి చైర్మన్‌గా పనిచేశాడు.

గుండుమల తిప్పేస్వామి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అనంతరం 2014 మార్చి 15లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరాడు.[1] ఆయన 2015లో మూడో సారి టీడీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికై 2021 మార్చి 30 వరకు ఎమ్మెల్సీగా పనిచేశాడు. తిప్పేస్వామి 2015 మార్చిలో మూడవసారి అసెంబ్లీ బీసీ వెల్ఫేర్ కమిటీ చైర్మన్‌గా నియామితుడయ్యాడు. ఆయన ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్నాడు.[2]

మూలాలు

మార్చు
  1. Sakshi (17 March 2015). "ఎమ్మెల్సీగా హ్యాట్రిక్ అవకాశం". Archived from the original on 18 July 2021. Retrieved 18 July 2021.
  2. Andrajyothy (5 June 2021). "సంక్షేమం పేరుతో బీసీలకు తీరని అన్యాయం". Archived from the original on 18 July 2021. Retrieved 18 July 2021.