గుంతకల్లు జంక్షన్ రైల్వే స్టేషను

గుంతకల్లు జంక్షన్ రైల్వే స్టేషన్ (స్టేషన్ కోడ్: జిటిఎల్) [2] ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా లో ఉంది. ఇది గుంతకల్లు కు సేవలు అందిస్తుంది. గుంతకల్లు జంక్షన్ రైల్వే స్టేషను దక్షిణ కోస్ట్ రైల్వే లోని గుంతకల్లు రైల్వే డివిజను యొక్క ప్రధాన కార్యాలయం పరిధిలో పనిచేస్తుంది. ఇది ముంబై-చెన్నై రైలు మార్గము, గుంతకల్లు-చెన్నై రైలు మార్గము, గుంతకల్లు-సోలాపూర్‌ రైలు మార్గము, గుంతకల్లు-బెంగళూరు రైలు మార్గము, గుంతకల్లు-వాస్కో డా గామా రైలు మార్గము, గుంతకల్లు-విజయవాడ రైలు మార్గము లకు ఒక కూడలి స్టేషను.

గుంతకల్లు జంక్షన్ రైల్వే స్టేషను
ఎక్స్‌ప్రెస్ రైలు, ప్యాసింజర్ రైలు స్టేషను
గుంతకల్లు జంక్షన్ రైల్వే స్టేషను
సాధారణ సమాచారం
Locationగుంతకల్లు, ఆంధ్ర ప్రదేశ్
భారత దేశం
Coordinates15°10′30″N 77°22′01″E / 15.175°N 77.367°E / 15.175; 77.367
Elevation453.000 metres (1,486.220 ft)
యజమాన్యంభారతీయ రైల్వేలు
నిర్వహించువారుదక్షిణ తీర రైల్వే [1]
లైన్లుగుంతకల్లు-చెన్నై రైలు మార్గము
గుంతకల్లు-సోలాపూర్‌ రైలు మార్గము
గుంతకల్లు-బెంగళూరు రైలు మార్గము
గుంతకల్లు-వాస్కో డా గామా రైలు మార్గము
గుంతకల్లు-విజయవాడ రైలు మార్గము
ఫ్లాట్ ఫారాలు10 (6 పనిచేస్తున్నాయి, 1 త్వరలో ప్రారంభ మవుతుంది, 3 పూర్తి చేయాలి)
నిర్మాణం
నిర్మాణ రకంమైదానంలో ప్రామాణికం
పార్కింగ్ఉంది
Bicycle facilitiesలేదు
ఇతర సమాచారం
Statusపనిచేస్తున్నది
స్టేషను కోడుGTL
డివిజన్లు గుంతకల్లు
History
Opened1872; 152 సంవత్సరాల క్రితం (1872)
విద్యుత్ లైనుఅవును
మూస:Infobox station/services
మూస:Infobox station/services
మూస:Infobox station/services

చరిత్ర మార్చు

1861-1871 మధ్యకాలంలో మద్రాస్ రైల్వే చెన్నై-అరక్కోణం రైలు మార్గమును రాయచూరుకు విస్తరించింది. ఇది గ్రేట్ ఇండియన్ పెనిన్సులా రైల్వే రైలు మార్గములో చేరింది. తద్వారా ముంబై, చెన్నైలను కలుపుతూ 1871 లో 1,676 మి.మీ. (5 అ. 6 అం.) విస్తృత బ్రాడ్ గేజ్ రైలు మార్గము ఏర్పాటు అయ్యింది.[3]

1888 నుండి 1890 వరకు దక్షిణ మహారాష్ట్ర రైల్వే విజయవాడ నుండి మార్గోవా వరకు, వయా గుంతకల్లు మీదుగా ఒక మీటర్ గేజ్ రైలు మార్గాన్ని అభివృద్ధి చేసింది.[4]

గుంతకల్లు-బెంగళూరు రైలు మార్గము 1892-93లో ప్రారంభించబడింది.[5] 1893 లో మీటర్ గేజ్ అయిన గుంతకల్లు-మైసూర్ ఫ్రాంటియర్ రైలు మార్గము ను ప్రారంభించారు. ఇది దక్షిణ మహారాష్ట్ర రైల్వే ద్వారా నిర్వహించబడింది.[6]

విద్యుద్దీకరణ మార్చు

2013 లో 310 రూట్ కిలో మీటర్ల గుంతకల్లు-రేణిగుంట రైలు మార్గము విద్యుద్దీకరణ పూర్తి అయ్యింది.[7] 2016 లో 293 రూట్ కి.మీ.ల గుంతకల్లు-బెంగుళూరు రైలు మార్గము విద్యుద్దీకరణ పూర్తి అయ్యింది.[8] 2017 లో 228 రూట్ కి.మీ.ల గుంతకల్లు-వాడి రైలు మార్గము విద్యుద్దీకరణ పూర్తి అయ్యింది.[9] 430 రూట్ కిలోమీటర్ల గుంతకల్లు-గుంటూరు రైలు మార్గము విద్యుద్దీకరణ ఇప్పుడు వరకు క్రియాశీలంగా ఉంది. 234 రూట్ కిలోమీటర్లు మొదటి దశలో విద్యుద్దీకరణ చేయబడింది. మొదటి దశ యొక్క 165 రూట్ కిలోమీటర్ల నల్లపాడు-కంబం, 89 రూట్ కిలోమీటర్ల గుంతకల్లు-ధోన్ విభాగాలు విద్యుద్దీకరణ చేయబడి ఉన్నాయి.[10]

షెడ్లు మార్చు

డీజిల్ లోకో షెడ్, గుంతకల్లు మొదట మీటర్ గేజ్ షెడ్‌గా ప్రారంభించారు. కానీ, గుంతకల్లు, హుబ్లీ విభాగాలలో గేజ్ మార్పిడులు తర్వాత, 1995 లో బ్రాడ్ (విస్తృత) గేజ్ షెడ్‌గా ప్రారంభించబడింది. ఇందులో డబ్ల్యుడిఎం-2, డబ్ల్యుడిఎం-3ఎ, డబ్ల్యుడిఎం-3డి, డబ్ల్యుడిజి-3, డబ్ల్యుడిజి-3ఎ, డబ్ల్యుడిజి-4 లొకోలు ఉన్నాయి.

గుంతకల్లులో ఒక కోచింగ్ నిర్వహణ డిపో ఉంది.[11] ఎలెక్ట్రిక్ ట్రాక్షన్‌తో మార్పిడి తర్వాత,  భారతీయ రైల్వేలు ఎలక్ట్రిక్ లోకో షెడ్‌ను కూడా మంజూరు చేసింది.[12]

జంక్షన్ మార్చు

గుంతకల్లు రైల్వే స్టేషను నుండి 8 రైలు మార్గాల ట్రాక్స్ గుంతకల్లు కలిగి ఉన్న జంక్షన్‌గా ఉన్నది.

  1. గుంతకల్లు -గుంటూరు-విజయవాడ-హౌరా / న్యూఢిల్లీ.
  2. గుంతకల్లు -బళ్ళారి-హుబ్లీ-వాసో డా గామా.
  3. గుంతకల్లు -గూటీ-అనంతపురం-ధర్మవరం-బెంగళూరు / తిరుపతి.
  4. గుంతకల్లు-రేణిగుంట-చెన్నై.
  5. గుంతకల్లు-పూణే-ముంబై.
  6. గుంతకల్లు-కర్నూలు-కాచిగూడ
  7. గుంతకల్లు-కల్లూరు-అనంతపురం
  8. గుంతకల్లు-ఆదోని-రాయచూర్

గుంతకల్లు జంక్షన్ రైల్వే స్టేషను నందు 114 రైళ్ళు ఆగుతాయి. అలాగే ఈ స్టేషను గుండా 123 రైళ్ళు వెళ్ళతాయి. ఇక్కడ నుండి 9 రైళ్ళు ప్రారంభ మవుతాయి. అలాగే 9 రైళ్ళు ఈ స్టేషను నందు తమ ప్రయాణాన్ని ముగిస్తాయి.

ఇవి కూడా చూడండి మార్చు

బయటి లింకులు మార్చు


మూలాలు మార్చు

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2017-07-04. Retrieved 2019-03-13.
  2. "Station Code Index" (PDF). Portal of Indian Railways. p. 2. Retrieved 31 May 2017.
  3. John Hurd, Ian J. Kerr, India’s Railway History: A Research Handbook, page 177
  4. "IR History:Early days II". 1870-1899. IRFCA. Retrieved 9 December 2013.
  5. W. Francis. "Gazetteer of South India". Vol II, page 479. Mittal Publications, A 110 Mohan Garden, New Delhi – 110059. Retrieved 30 December 2013.
  6. "Guntakal-Mysore Frontier Railway". fibis. Archived from the original on 4 మార్చి 2016. Retrieved 9 December 2013.
  7. http://m.timesofindia.com/city/hyderabad/South-Central-Railway-completes-electrification-of-Guntakal-Renigunta-section/articleshow/27438885.cms
  8. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2018-07-22. Retrieved 2019-03-13.
  9. http://www.railjournal.com/index.php/main-line/wadi-guntakal-line-electrification-completed.html[permanent dead link]
  10. http://www.thehindu.com/todays-paper/tp-national/tp-telangana/two-major-routes-under-scr-jurisdiction-electrified/article18477680.ece
  11. "Sheds and Workshops". IRFCA. Retrieved 9 December 2013.
  12. http://www.thehansindia.com/posts/index/Andhra-Pradesh/2016-02-25/Guntakal-division-seeks-funds-for-rail-lines/209598