గుమ్మడి కుతూహలమ్మ

గుమ్మడి కుతూహలమ్మ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు మరియు మాజీ మంత్రి.

గుమ్మడి కుతూహలమ్మ

మాజీ ఎమ్మెల్యే & మాజీ మంత్రి
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2009 - 2014
తరువాత నారాయణస్వామి
నియోజకవర్గం గంగాధరనెల్లూరు నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1 జూన్ 1949
కందుకూరు , ప్రకాశం జిల్లా , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ
తల్లిదండ్రులు రంగయ్య
జీవిత భాగస్వామి డాక్టర్‌. మునిసిద్దయ్య
సంతానం 2
నివాసం గంగాధరనెల్లూరు , చిత్తూరు జిల్లా

జననం, విద్యాభాస్యంసవరించు

గుమ్మడి కుతూహలమ్మ 1 జూన్ 1949లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , ప్రకాశం జిల్లా , కందుకూరు లో జన్మించింది. ఆమె ఎం.బి.బి.ఎస్. పూర్తి చేసింది. అనంతరం ఆమె కొంతకాలం వైద్య వృత్తిలో పని చేసి 1979 నుండి 1981 వరకు డాక్టర్స్ సెల్ కన్వీనర్ గా పని చేసింది.

రాజకీయ జీవితంసవరించు

గుమ్మడి కుతూహలమ్మ 1979లో కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి చిత్తూరు జిల్లా యూత్ కాంగ్రెస్ కార్యకర్తగా పని చేసింది. ఆమె 1980 - 1985 సమయంలో చిత్తూరు జిల్లా జెడ్పి చైర్ పర్సన్ గా, కో- ఆప్షన్ సభ్యురాలిగా పని చేసింది. ఆమె 1985లో వేపంజేరి నియోజకవర్గం నుండి తొలిసారి ఎమ్మెల్యేగా శాసనసభకు ఎన్నికయింది.

ఆమె 2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్ పార్టీ కి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరింది.[1]ఆమె 2014లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడి పోయింది.[2]

నిర్వహించిన పదవులుసవరించు

  1. 1980-1983 చిత్తూర్ జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్
  2. 1985-1989 ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యవర్గ సభ్యురాలు
  3. 1987-1994 ,ఆంధ్రప్రదేశ్ మహిళ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి
  4. 1991 - 1992 వైద్యారోగ్య శాఖ మంత్రి
  5. 1992-1997 ఏఐసిసి సభ్యురాలు
  6. 1992-1993 మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రి
  7. 1998-2006 ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యురాలు
  8. 1999-2003 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యురాలు
  9. 2001-2004 ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎలక్షన్ కమిటీ సభ్యురాలు
  10. 24 జులై 2007 నుండి 19 మే 2009 వరకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్


పోటీ చేసిన నియోజకవర్గాలుసవరించు

సంవత్సరం పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ఫలితం
2014 గంగాధర నెల్లూరు (ఎస్సీ) కె. నారాయణ స్వామి (కళత్తూరు నారాయణస్వామి) పురుషుడు వైఎస్సార్సీపీ 84538 గుమ్మడి కుతూహలమ్మ మహిళా తె.దే.పా 63973 ఓటమి
2009 గంగాధర నెల్లూరు (ఎస్సీ) గుమ్మడి కుతూహలమ్మ మహిళ కాంగ్రెస్ పార్టీ 62249 గాంధీ పురుషుడు తె.దే.పా 51423 గెలుపు
2004 వేపంజేరి (ఎస్సీ) గుమ్మడి కుతూహలమ్మ మహిళ కాంగ్రెస్ పార్టీ 58350 డా. ఓ .చంద్రమ్మ పురుషుడు తె.దే.పా 46768 గెలుపు
1999 వేపంజేరి (ఎస్సీ) గుమ్మడి కుతూహలమ్మ మహిళ కాంగ్రెస్ పార్టీ 60760 పి. పుష్ప రాజ్ పురుషుడు తె.దే.పా 47554 గెలుపు
1989 వేపంజేరి (ఎస్సీ) గుమ్మడి కుతూహలమ్మ మహిళ కాంగ్రెస్ పార్టీ 60710 తలారి రుద్రయ్య పురుషుడు తె.దే.పా 42920 గెలుపు
1985 వేపంజేరి (ఎస్సీ) గుమ్మడి కుతూహలమ్మ మహిళ కాంగ్రెస్ పార్టీ 42534 బి.రమణ పురుషుడు తె.దే.పా 36827 గెలుపు

మూలాలుసవరించు

  1. Deccan Chronicle (18 March 2014). "Congress legislator Gummadi Kutuhalamma joins Telugu Desam" (in ఇంగ్లీష్). Archived from the original on 26 జూలై 2021. Retrieved 26 July 2021. {{cite news}}: Check date values in: |archivedate= (help)
  2. Sakshi (18 May 2014). "దిగ్గజాలకు శృంగభంగం". Archived from the original on 26 జూలై 2021. Retrieved 26 July 2021. {{cite news}}: Check date values in: |archivedate= (help)