గురప్పగారి పల్లె

వీరబల్లె మండలంలో గురప్పగారి పల్లె ఓ గ్రామ పంచాయతి.ఇది రెవెన్యూయేతర గ్రామం. ఇక్కడి ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం. ఖరిఫ్ సీజన్లో ప్రధానంగా వరి పండిస్తారు. రబీలో వేరుశనగ, నువ్వులు, రాగులు, సజ్జలు.. ఇలా పొడి పంటలు పండిస్తారు.. ఇక్కడ పండించే మామిడి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది.. బేనిషా రకం మామిడిని ఇక్కడ ప్రధానంగా పండిస్తారు. భూగర్భ జలం అడుగంటిపోవడంతో వర్షాలపైనే ఇక్కడి వ్యవసాయం ఆధారపడి ఉంటుంది. తాగునీటికి కూడా కిలోమీటర్లు వెళ్ళాల్సిన దుస్థితి ఇప్పటికి ఇక్కడ నెలకొని ఉంది.

గురప్పగారి పల్లె
—  రెవెన్యూయేతర గ్రామం  —
గురప్పగారి పల్లె is located in Andhra Pradesh
గురప్పగారి పల్లె
గురప్పగారి పల్లె
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 13°49′01″N 78°47′23″E / 13.816898°N 78.789807°E / 13.816898; 78.789807
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా అన్నమయ్య
మండలం వీరబల్లె
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 516268
ఎస్.టి.డి కోడ్

మూలాలు మార్చు