గురు శిష్యులు (1990 సినిమా)
గురు శిష్యులు 1990 లో వచ్చిన యాక్షన్ కామెడీ చిత్రం, శ్రీలత ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో ఎం. పూర్ణ ప్రకాష్, ఎస్. సాంబశివరావు నిర్మించారు. ఎస్పీ ముత్తురామన్ దర్శకత్వం వహించాడు. కృష్ణంరాజు, రాజేంద్ర ప్రసాద్, సుమలత, ఖుష్బూ ముఖ్యపాత్రధారులు. ఇళయరాజా సంగీతం అందించాడు.[1] ఇది తమిళ చిత్రం గురు శిష్యన్ (1988) కు రీమేక్. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అపజయం పొందింది.[2][3]
గురు శిష్యులు (1990 సినిమా) (1990 తెలుగు సినిమా) | |
![]() | |
---|---|
సంగీతం | కె. చక్రవర్తి |
నిర్మాణ సంస్థ | శ్రీలత ఆర్ట్ ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
కథసవరించు
ఈ చిత్రం సెంట్రల్ జైలులో ప్రారంభమవుతుంది. అక్కడ ఇద్దరు చిన్న దొంగలు రాజా (కృష్ణరాజు) & బాబు (రాజేంద్ర ప్రసాద్) శిక్ష అనుభవిస్తున్నారు. అక్కడే, మరణశిక్షకు గురైన మనోహర్ (మహర్షి రాఘవ) అనే అమాయక వ్యక్తితో వారికి పరిచయం అవుతుంది. అతను తన చివరి కోరికగా రాజా & బాబులను కలవాలని కోరుకుంటాడు. వాళ్ళకు తన కథను వివరిస్తాడు. ఒకసారి, అతని సోదరి సుమతి (సుధ) ని టాక్సీ డ్రైవర్ కిడ్నాప్ చేయగా, లక్షాధికారి రాజశేఖరం (రామ కృష్ణ) తమ్ముడు, దుర్మార్గుడూ అయిన ముద్దు కృష్ణ (సుధాకర్) అమెను మనభంగం చేసి చంపేస్తాడు. పరమశివం (కోట శ్రీనివాసరావు) కేసును తారుమారు చేసి మనోహర్ పైనే నేరం మోపుతారు. ప్రస్తుతం, రాజా & బాబు మనోహర్‌ను రక్షించాలని నిర్ణయించుకుంటారు. వాళ్ళు ఆ పని ఎలా సాధిస్తారనేది చిత్ర కథ.
తారాగణంసవరించు
- కృష్ణంరాజు రాజా గా
- బాబుగా రాజేంద్ర ప్రసాద్
- గీతగా సుమలత
- చిత్రంగా కుష్బూ
- జైరామ్‌గా గొల్లపూడి మారుతీరావు
- ఇన్స్పెక్టర్ పరమశివంగా కోట శ్రీనివాసరావు
- ముద్ద కృష్ణగా సుధాకర్
- రాజా శేఖరంగా రామ కృష్ణుడు
- మంజులగా మనోరమ
- నారాయణరావుగా హేమ సుందర్
- మనోహర్‌గా మహర్షి రాఘవ
- మాడా వెంకటేశ్వరరావు
- టెలిఫోన్ సత్యనారాయణ - డిఐజి ప్రభు
పాటలుసవరించు
క్రమసంఖ్య | పేరు | గాయనీ గాయకులు | నిడివి |
---|---|---|---|
1. | "దొరికావు దొరికావు" | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం | 4:22 |
2. | "జింగిడీ జింగిడి బ్యూటీ" | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్. చిత్ర | 4:15 |
3. | "ఏదో నిప్పు" | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, చిత్ర | 4:13 |
4. | "కుర్చీ కోసం కుస్తీ" | ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం | 4:36 |
5. | "మత్తుగా చిత్తుగా" | చిత్ర | 4:18 |
మూలాలుసవరించు
- ↑ "Guru Sishyulu (Cast & Crew)". gomolo.com. Archived from the original on 2018-06-16. Retrieved 2020-08-30.
- ↑ https://cinemacinemacinemasite.wordpress.com/?s=Guru+Sishylu+
- ↑ "Guru Sishyulu (Review)". The Cine Bay.