గొట్టిపాటి సుబ్బరాయుడు

గొట్టిపాటి సుబ్బరాయుడు
జననంగొట్టిపాటి సుబ్బరాయుడు
1917
అనంతపురం జిల్లా కోనాపురం గ్రామం
మరణం1970, జనవరి 21
ప్రసిద్ధిపత్రికా సంపాదకుడు, కవి, రాజకీయవేత్త
తండ్రివెంకటప్ప
తల్లివెంకటమ్మ

జీవిత విశేషాలు

మార్చు

ఇతడు 1917లో వెంకటమ్మ, వెంకటయ్య దంపతులకు జన్మించాడు[1]. ఇతడు కమ్మ కులస్థుడు. ఇతని పూర్వీకులు గుంటూరు జిల్లావాసులు. వారు అక్కడి నుండి అనంతపురం జిల్లా తాడిపత్రి ప్రాంతానికి వచ్చి చేరారు. అక్కడి నుండి వారి నివాసము ధర్మవరం సమీపంలోని ఎగువపల్లెకు మారింది. ఎగువపల్లె దగ్గరలో కల కోనాపురంలో ఇతని తండ్రి వెంకటప్ప కాపురం పెట్టి గౌరవముగా సేద్యం చేసేవాడు. ఇతని 10వ యేటనే తల్లిదండ్రులను కోల్పాయాడు. తన అన్నగారి వద్ద పెరిగాడు. వెంకటరామారావు వద్ద తెలుగు సాహిత్యము, వీరభద్రరావు వద్ద ఆంగ్లము, చరిత్ర మొదలైనవి చదివాడు. గాంధీ పిలుపు మేరకు స్వరాజ్య ఉద్యమములో పాల్గొన్నాడు. వ్యవసాయకూలీగా జీవితము ప్రారంభించి ఆంధ్రరాష్ట్ర రైతు సంఘ అధ్యక్షుడిదాకా ఎదిగాడు. ఇతడు రాజకీయ రంగంలో ప్రవేశించినా పదవులకోసం ప్రాకులాడలేదు.

రచనలు

మార్చు

ఇతడు రచించిన అనేక కావ్యాలు అముద్రితాలు. అలభ్యాలు. ముద్రిత రచనలు:

  1. అసంపూర్ణ వికాస భారతము (ఆదిమ-బౌద్ధ-శాంతి-అణు పర్వములు)
  2. రాయలసీమ
  3. గాంధిగీత

పత్రికలు

మార్చు

ఇతడు ఈ క్రింది పత్రికలకు సంపాదకత్వం వహించాడు.

  1. కమ్మ మహారాజు [2].
  2. విజయవాణి
  3. వాహిని
  4. స్వశక్తి
  5. ఆంధ్రశ్రీ

మూలాలు

మార్చు
  1. కల్లూరు, అహోబలరావు (ఆగస్టు 1981). రాయలసీమ రచయితల చరిత్ర 3 వ సంపుటి. హిందూపురం: శ్రీకృష్ణదేవరాయ గ్రంథమాల. pp. 74–78.
  2. ఆర్., భార్గవి (1999). "అనంతపురం జిల్లా పత్రికల చరిత్ర". అనంతనేత్రం (వార్త దినపత్రిక జిల్లా ప్రత్యేక అనుబంధం): 196.