గొడిశెల రాజేశం గౌడ్

తెలంగాణకు చెందిన రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి

గొడిశెల రాజేశం గౌడ్ తెలంగాణకు చెందిన రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి. జిల్లా పరిషత్ మాజీ చైర్మన్‌గా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రిగా[1], తెలంగాణ రాష్ట్ర ఆర్థిక సంఘం తొలి చైర్మన్‌గానూ పనిచేశాడు.

గొడిశెల రాజేశం గౌడ్

ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి
పదవీ కాలం
1985-1989
నియోజకవర్గం జగిత్యాల శాసనసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం జూన్ 10
అంతర్గం, జగిత్యాల జిల్లా, తెలంగాణ
రాజకీయ పార్టీ భారత రాష్ట్ర సమితి
ఇతర రాజకీయ పార్టీలు తెలుగుదేశం పార్టీ

జననం మార్చు

రాజేశం గౌడ్ జూన్ 10న తెలంగాణ రాష్ట్రం, జగిత్యాల జిల్లాలోని అంతర్గం గ్రామంలో జన్మించాడు.[2][3]

రాజకీయ జీవితం మార్చు

పార్టీ కార్యకర్తగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన రాజేశం గౌడ్, జిల్లా పరిషత్ చైర్మన్‌గా తన సేవలు అందించాడు. ఆ తరువాత రాష్ట్ర రాజకీయాల్లోకి ప్రవేశించి రాష్ట్ర మంత్రిగా కూడా పనిచేశాడు.

శాసనసభ్యుడిగా మార్చు

1985లో తెలుగుదేశం పార్టీ తరపున జగిత్యాల శాసనసభ నియోజకవర్గం నుండి పోటీచేసి శాసనసభ్యుడిగా గెలుపొందిన రాజేశం గౌడ్, 1989లో జరిగిన ఎన్నికలలో ఓడిపోయాడు.

సంవత్సరం పేరు గెలుపొందిన అభ్యర్థి పార్టీ ఓట్లు ఓడినవారు పార్టీ ఓటు మెజారిటీ
1985 జగిత్యాల గొడిశెల రాజేశం గౌడ్ తెలుగుదేశం 43,530 టి.జీవన్ రెడ్డి కాంగ్రెసు 28,408 15,122
1989 జగిత్యాల టి.జీవన్ రెడ్డి కాంగ్రెసు 62,590 గొడిశెల రాజేశం గౌడ్ తెలుగుదేశం 30,804 31,786

చైర్మన్ గా మార్చు

తెలంగాణ ప్రభుత్వం 2017 డిసెంబరు 29న తెలంగాణ రాష్ట్ర ఆర్థిక సంఘంను ఏర్పాటుచేసి అదేరోజు తొలి చైర్మన్‌గా రాజేశం గౌడ్ నియమించింది.[4] రెండు సంపత్సరాలపాటు చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు.

మూలాలు మార్చు

  1. Eenadu. "ఇద్దరికి అమాత్యయోగం". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.
  2. Eenadu (6 November 2023). "నేతల గ్రామం అంతర్గాం". Archived from the original on 21 December 2023. Retrieved 21 December 2023.
  3. "Telangana State Finance Commission Formed, Rajesham Goud Appointed Chairman - Pressmediaofindia". www.pressmediaofindia.com/. 2017-12-29. Archived from the original on 2023-07-07. Retrieved 2023-07-07.
  4. "G Rajesham Goud to head Telangana State Finance Commission". India Today (in ఇంగ్లీష్). Archived from the original on 2023-07-07. Retrieved 2023-07-07.