టి.జీవన్ రెడ్డి

తాటిపర్తి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు.2019 మార్చినెల లో టీచర్లు యంఎల్ సి ఎన్నికల్లో విజయం సాధించినారు. అటు 2018 లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి తన ప్రత్యర్థి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తరపున పోటీ చేసిన ఎమ్. సంజయ్ కుమార్ పై 61,185 ఓట్ల మెజార్టీతో ఓడిపోయారు.

తాటిపర్తి జీవన్ రెడ్డి
టి.జీవన్ రెడ్డి


తెలంగాణ శాసనమండలి సభ్యుడు
పదవీ కాలం
30 మార్చి 2019 నుండి 29 మార్చి 2025
నియోజకవర్గం నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం

రోడ్లు, భవనాల శాఖ మంత్రి
పదవీ కాలం
14 మే 2004 – 2 మార్చి 2009

పదవీ కాలం
1983–1985
1989–1994
1996–2009
2014–2018
నియోజకవర్గం జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం (1952-05-01) 1952 మే 1 (వయసు 70)
బతికపల్లి .
రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ
సంతానం
  • రామచంద్రా రెడ్డి
  • బాలకృష్ణా రెడ్డి
  • చంద్రకృష్ణా రెడ్డి
నివాసం బతికపల్లి: గ్రామం, పెగడపల్లి: మండలం, కరీంనగర్ : జిల్లా.

బాల్యం, విద్యాభ్యాసంసవరించు

తాటిపర్తి జీవన్ రెడ్డి కరీంనగర్ జిల్లా పెగడపల్లి మండలం బత్కేపల్లిలో మే 1, 1952న జన్మించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి బీఏ, ఎల్‌ఎల్‌బి పూర్తిచేశారు.

కుటుంబంసవరించు

జీవన్ రెడ్డి అహల్య దేవి వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు రామచంద్ర రెడ్డి, బాలకృష్ణ రెడ్డి, చంద్ర కృష్ణ రెడ్డి అనే ముగ్గురు కుమారులు ఉన్నారు.

రాజకీయ జీవితంసవరించు

జీవన్ రెడ్డి జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఆరుసార్లు శాసనసభకు ఎన్నికై మూడుసార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రిగా పని చేశాడు. ఆయన 1983లో టీడీపీలో చేరి జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా తొలిసారి శాసనసభలో అడుగుపెట్టి ఎన్టీఆర్ మంత్రివర్గంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా, నాదెండ్ల భాస్కరరావు మంత్రివర్గంలో పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా భాద్యతలు నిర్వహించాడు. ఎన్‌టీ రామారావు 1985లో ప్రభుత్వం రద్దు చేయడంతో తిరిగి జరిగిన ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరి 1985లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి గుడిసెల రాజేశం గౌడ్ చేతిలో ఓడిపోయాడు.

జీవన్ రెడ్డి 1989లో రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై, 1994లో ఓడిపోయి 1996 ఉప ఎన్నికలో గెలిచి 1999, 2004లో జరిగిన ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ విజయం సాధించాడు. ఆయన 14 మే 2004 నుండి 2 మార్చి 2009 వరకు వై.యస్. రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో రోడ్లు భవనాల శాఖ మంత్రిగా భాద్యతలు నిర్వహించాడు. ఆయన 2006, 2009లో కరీంనగర్ లోక్‌సభ స్థానం నుండి పోటీ చేసి ఓడిపోయాడు. జీవన్ రెడ్డి 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత  2014లో జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేసి గెలిచి ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యేగా ఉన్నాడు.[1][2] ఆయన 2018లో జరిగిన ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి 2019లో తెలంగాణ శాసనమండలికి జరిగిన ఎన్నికల్లో నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుండి పోటీ చేసి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు.[3][4]

మూలాలుసవరించు

  1. Sakshi (19 May 2014). "సీఎల్పీ లీడర్.. టీపీసీసీ చీఫ్!". Archived from the original on 13 April 2022. Retrieved 13 April 2022.
  2. Sakshi (30 November 2018). "జగిత్యాల జీవన జ్యోతి". Archived from the original on 13 April 2022. Retrieved 13 April 2022.
  3. HMTV (27 March 2019). "ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి జీవన్‌రెడ్డి గెలుపు". Archived from the original on 13 April 2022. Retrieved 13 April 2022.
  4. Sakshi (27 March 2019). "ఎమ్మెల్సీ ఎన్నికల్లో జీవన్‌ రెడ్డి విజయం". Archived from the original on 13 April 2022. Retrieved 13 April 2022.

వెలుపలి లంకెలుసవరించు