గొల్లత్తగుడి, మహబూబ్ నగర్ జిల్లా, జడ్చర్ల మండలం, గంగాపూర్ శివారు ఈ పురాతన ఆలయం ఉంది.[1]

మహబూబ్ నగర్ లోని పిల్లలమర్రి పురావస్తు మ్యూజియంలో ఉన్న గొల్లత్తగుడి వద్ద బయల్పడిన మహావీరుని తలలేని విగ్రహం

ఇది మండల కేంద్రమైన జడ్చర్ల నుండి పది కిలోమీటర్ల దూరంలో గంగాపూర్, అల్వాన్‌పల్లి గ్రామాల మధ్యలో ఉంది.[2] ఇదే పేరుతో రెవెన్యూ లెక్కలలో ఆ ఆలయం ఉండిన ప్రాంతం నిర్జన గ్రామంగా ఉంది.

ఇక్కడ జరిగిన త్రవ్వకాలలో జైన క్షేత్రముతో పాటు ఒక మధ్యయుగపు హిందూ ఆలయం యొక్క శిథిలాలు బయల్పడినవి.

ఇక్కడ బయల్పడిన మహావీర, పార్శ్వనాథ తదితర జైన శిల్పాలను మహబూబ్ నగర్ జిల్లా మ్యూజియంలోనూ, హైదరాబాదులోని రాష్ట్ర మ్యూజియంలోనూ ప్రదర్శింపబడుతున్నవి. ఇక్కడ బయల్పడిన సా.శ.7-8వ శతాబ్దపు ఇటుకలతో కట్టిన ఆలయం చాలా అరుదైనది. జైనమతానికి చెందిన ఇటుకలతో కట్టిన ఆలయాల్లో శిల్పశైలి రూపాలు, బయటి అలంకరణలు ఇంకా నిలుపుకొని ఉన్న ఏకైక ఆలయం. ఇక్కడ దొరికిన శిల్పాలు అమరావతి శైలిలోని సున్నపురాయి కళాప్రతిమలు.[3] ఇక్కడ దొరికిన తల లేని తీర్ధంకరుని శిల్పాన్ని బట్టి గొల్లత్తగుడి జైన ఆవాసము వీరశైవుల దాడికి గురైందని చెప్పవచ్చు.[4]

గొల్లత్తగుడి పురావస్తు శాఖ వారు 1958-59లోనూ, 1970 నుండి 1975వరకు రెండు విడతల త్రవ్వకాలు జరిపారు.[5] చరిత్రకారుల ప్రకారం ఇక్కడ ఆసియాలోనే అతి పెద్దవైన మహిళ, పురుషుల సంఖ్య పాదాలున్నాయి.ఈ పాదాల పొడవు 6.4 మీ, వెడల్పు సుమారు 3 మీటర్లు.[6]

మూలాలు

మార్చు
  1. Brahma sri: Researches in archaeology, history, and culture in the new millennium : Dr. P.V. Parabrahma Sastry felicitation volume, Volume 1
  2. "గొల్లత్త గుడి విశిష్టతను.. కాపాడుదాం".
  3. http://www.aparchaeologymuseum.com/wp-content/uploads/2012/05/Mahabubnagar-dt.pdf[permanent dead link]
  4. Studies in Jainism: as gleaned from archaeological sources - G. Jawaharlal
  5. http://www.docstoc.com/docs/109443004/ap-excv-IAR
  6. నమస్తే తెలంగాణ దినపత్రిక, జిందగీ పేజీ కథనం, తేది 10-03-2014

బయటి లింకులు

మార్చు