గోగు మొక్క మాల్వేలిస్ వర్గంలో, మాల్వేసి కుటుంబానికి, హైబిస్కస్ ప్రజాతికి చెందినది. వృక్షశాస్త్రనామము హైబిస్కస్ శాబ్డారిఫ్ఫా (Hibiscus sabdariffa Linn).మొరియొకటి హైబిస్కస్ కన్నాబినస్ (Hibiscus cannabinus)[1] .ఒకరకం గోగును ఆకుకూరకై పెంచెదరు. దీని ఆకు పుల్లని రుచితొ వుండి కూరలలో వేయుటకు, పచ్చళ్ళు చేయుటకు వాడెదరు. రెండోరకమును గోగునారకై పెంచెదరు.కూరగొగుకన్న నారగోగు ఎత్తుగా, ఏపుగా పెరుగును.నారగోగునుండి గింజలను సేకరించు వీలున్నది. నారగోగు మొక్కనుండి తీసిన నారనుండి జనపనార వలె గోనెసంచులు, తాళ్ళు తయారు చేయుదురు. అలాగే గోగువిత్తనాల నుండి నూనెను కూడా తీయవచ్చును. ఈ నూనెను వంటనూనెగా, సాలాడు నూనెగా, సబ్బులతయారిలో ఉపయోగిస్తారు.[2] గోగును ఆంగ్లంలో Deccan hemp అనిపిలుస్తారు.

గోగు మొక్క
గోగు పువ్వు
పండిన కాయలు
గోగు విత్తనాలు

భారతభాషలలో గోగు పేరు[3]

మార్చు
  • సంస్కృతము:నలిత (Nalita)
  • హింది:అంబాని (Ambani, పస్తాన్ (pastan) పిత్వా (pitwa)
  • బెంగాలి:మెస్తా (Mesta)
  • మరాఠి:అంబాడి (AmbaDi, అంబాడ (Ambada)
  • గుజరాతి:అంబారి (ambaDi, అంబాడ (Ambada)
  • తమిళము:పులుమంజి (Pulimanji, కసిని (Kasini, పులిచ్చై (Pulichai)
  • కన్నడ:పుండి (Pundi)
  • మలయాళము:కంజరు (Kanjaru)
  • ఒరియా:కనురై (Kanurai)

భారతదేశంలో గోగుసాగుచేస్తున్న రాష్ట్రాలు

మార్చు

ఆంధ్ర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బీహరు, మహారాష్ట్ర, కర్నాటక,, ఒడిస్సా.

గోగుగింజలు

మార్చు

కన్నాబినస్ రకానికిచెందిన గోగుగింజలు బ్రౌన్‍రంగులో లేదా వెలిసిన పచ్చరంగులో వుండును. శబ్డారిఫా మొక్కగింజలు బ్రౌన్ లేదా పింకురంగులో వుండును. గింజలుమూడుపలకలుగా (Tetrahedral) వుండును.గింజలో 19-21% నూనె వుండును. ఎక్సుపెల్లరు యంత్రాల ద్వారనయినచో 12-13% వరకు రికవరివచ్చును.కేకులో6-8% నూనెవుండిపోవును. కేకులోనినూనెను సాల్వెంట్‍ప్లాంట్ ద్వారా తీయుదురు.

గోగుగింజలో వుండు పదార్ధాలు [3][4]

పదార్ధాలు విలువలమితి
తేమశాతం 4.8
నూనె 19-21
F.F.A (ఫ్రీఫ్యాటి ఆసిడ్) 2.1
మాంసకృత్తులు 18.0
ముడిపీచు (crude fibre) 22.0

గింజల పైపొట్టు (Hull) మొదటను డెకార్టికేటరుల ద్వారాతొలగించి, లేదా నేరుగా విత్తనాలను నీటిఆవిరి (Steam) ద్వారా ఉడికించి (cooking) నూనెయంత్రాల (Expellers) ద్వారా నూనెతీస్తారు ఎక్సుపెల్లరుల ద్వారా తీయగావచ్చిన నూనె బ్రౌన్‍ఛాయతో కూడిన పసుపురంగులో వుండును.కేకులో మిగిలివున్న నూనెను సాల్వెంట్‍ప్లాంట్‍లో ఆడించి తీయుదురు. నూనెలో మాములు కొవ్వు ఆమ్లాలతో పాటుగా సైక్లొప్రెన్ (cycloprene) లు, కొవ్వుఆమ్లాలను పోలిన (Eproxy) ఆమ్లాలను కూడా కొంచెం కల్గివుండును.

గోగుగింజల నూనెలోవుండు కొవ్వు ఆమ్లాలు [5][6]

కొవ్వు ఆమ్లాలు శాతం
పామిటిక్ ఆమ్లం (C16:0) 20-35 (సగటు:20.1)
స్టియరిక్ ఆమ్లం (C18:0) 2.0-4.0 (సగటు:3.5)
ఒలిక్ ఆమ్లం (C18:1) 25-34 (సగటు:29.2)
లినొలిక్ ఆమ్లం (C18:2) 15-47 (సగటు:45.9)
ఎపొక్షి (Epoxy) 3.3-4.5
సైక్లొప్రొపెనిక్ ( (C18:1) 1.2-2.9
సైక్లొప్రొపెనిక్ ( (C19:1) 2.3-2.4

గోగుగింజల నూనె భౌతిక లక్షణాలు [6]

లక్షణము విలువల మితి/సగటు
వక్రీభవన సూచిక,400C 1.465-1.471
సపొనిఫికెసన్ విలువ 187-190
ఐయోడిన్ విలువ 90-94
హెల్పన్‍టెస్ట్ పాజిటివ్
అన్ సపొనిఫియబుల్ మాటరు 2.0-2.5
ఆమ్లవిలువ 6-12
తేమ 0.25-0.5

నూనె ఉపయోగాలు

మార్చు

పస్తుతం సబ్బుల తయారి, కొవ్వు ఆంమ్లాల తయారిలో.మునుముందు ఈనూనె వినియోగం, ప్రయోజనాలు పెరుగవచ్చును.

ఇవికూడా చూడండి

మార్చు

ఉల్లఖనం/ములాలు

మార్చు
  1. "Hibiscus cannabinus - L". pfaf.org. Retrieved 2015-03-08.
  2. "Hibiscus cannabinus L". hort.purdue.edu. Retrieved 2015-03-08.
  3. 3.0 3.1 SEA Hand Book-2009 by Solvent Extractors'Association Of India
  4. "Nutrient composition and biological evaluation of mesta (Hibiscus sabdariffa) seeds". ncbi.nlm.nih.gov. Retrieved 2015-03-08.
  5. "Chemical composition of kenaf (Hibiscus cannabinus L.) seed oil". Retrieved 2015-03-08.
  6. 6.0 6.1 "Mesta" (PDF). assamagribusiness.nic.in. Archived from the original (PDF) on 2014-03-08. Retrieved 2015-03-08.