గోరంట్ల బుచ్చయ్య చౌదరి

గోరంట్ల బుచ్చయ్య చౌదరి (1946) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీకి చెందిన ముఖ్య రాజకీయ నాయకుడు.[1] మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ముఖ్య అనుచరుడు, సన్నిహితుడు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో తెలుగుదేశం పార్టీ ఉపనాయకుడు.

గోరంట్ల బుచ్చయ్య చౌదరి

ఉప ప్రతిపక్షనాయకుడు
ఆంధ్రప్రదేశ్ శాసనసభ
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2019 మే 30 - ప్రస్తుతం

ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ ముఖ్యమంత్రి
పదవీ కాలం
1994 – 1995

ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2014 - ప్రస్తుతం

పదవీ కాలం
1983 – 1999

వ్యక్తిగత వివరాలు

జననం (1950-04-20) 1950 ఏప్రిల్ 20 (వయసు 73)
చీరాల , మద్రాసు రాష్ట్రం, భారతదేశం
(ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, భారతదేశం)
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
బంధువులు గోరంట్ల రాజేంద్రప్రసాదు (తమ్ముడు)
సంతానం ఇద్దరు కుమార్తెలు
నివాసం రాజమండ్రి , భారతదేశం
పూర్వ విద్యార్థి ఆంధ్రా విశ్వవిద్యాలయం
మతం హిందూ

ప్రాథమిక జీవితం సవరించు

గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా బాపట్ల తాలూకా నరసాయపాలెం గ్రామంలో సంపన్న రైతు కుటుంబానికి చెందిన గోరంట్ల వీరయ్య చౌదరి, అనసూయమ్మ దంపతులకు చీరాల లోని క్రిస్టియన్ హాస్పిటల్ లో జన్మించారు.

బుచ్చయ్య చౌదరి బాపట్లలో ఎస్.ఎల్.సి, రాజమండ్రి లోని వీరేశలింగం విద్యాసంస్థల్లో ఇంటర్మీడియట్, రాజమండ్రి ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో బీఎస్సీ డిగ్రీ పూర్తి చేశారు.

బుచ్చయ్య చౌదరి వ్యాపార రంగంలోకి ప్రవేశించి కలప, లిక్కర్, చేపల చెరువులు, నిర్మాణ రంగం,ఇలా పలు వ్యాపారాలు నిర్వహించారు.

రాజకీయ జీవితం సవరించు

కమ్యూనిస్టు పార్టీ సానుభూతి పరుల కుటుంబం నుంచి వచ్చిన బుచ్చయ్య చౌదరి రాజమండ్రిలో కమ్యూనిస్టు పార్టీల అనుబంధ విద్యార్థి సంఘాల రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించారు. తరువాతి కాలంలో వ్యాపార రంగంలోకి వచ్చిన కమ్యూనిస్టు పార్టీలకు ఆర్థికంగా సహాయం చేస్తూ వచ్చారు.

1982లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించిన తరువాత ఆ పార్టీలో చేరిన మొదటి వ్యక్తి బుచ్చయ్య సోదరుడు రాజేంద్రప్రసాద్, సోదరుడు ప్రోద్బలంతో ఎన్టీఆర్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. గోదావరి జిల్లాల్లో పార్టీ కన్వీనర్ గా పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతానికి కృషి చేశారు.

1983, 1985లలో తెలుగుదేశం పార్టీ నుంచి రాజమండ్రి ఎమ్మెల్యేగా ఎన్నికైన బుచ్చయ్య చౌదరిని తన మంత్రివర్గంలో కాకుండా పార్టీ కార్యక్రమాలు కోసం ఎన్టీఆర్ వినియోగించడం జరిగింది. ఎన్టీఆర్ హయాంలో పార్టీ ఉత్తరాంధ్ర బాధ్యుడిగా, పార్టీ అధికార ప్రతినిధిగా, తూర్పుగోదావరి జిల్లా పార్టీ అధ్యక్షుడుగా మరియు పలు పార్టీ కీలకమైన కమిటీలలో పనిచేయడం జరిగింది.

1987లో ఆంధ్రప్రదేశ్ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడుగా నియమితులైన బుచ్చయ్య 1989 వరకు పనిచేశారు.1989, 1991 లోక్ సభ ఎన్నికల్లో రాజమండ్రి, అమలాపురం, కాకినాడ పార్లమెంట్ స్థానాలకు బాధ్యుడిగా పనిచేశారు.

1994లో మూడో సారి శాసనసభ్యుడిగా ఎన్నికైన బుచ్చయ్య చౌదరి ఎన్టీఆర్ మంత్రివర్గంలో పౌరసరఫరాల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టి 1995 వరకు నిర్వహించారు.1995లో ఎన్టీఆర్ గద్దె దింపడంతో చంద్రబాబుకు వ్యతిరేకంగా ఎన్టీఆర్ పక్షాన పోరాటం చేసి ఆయన మరణం వరకు ఆయనతోనే నడిచారు. 1996లో ఎన్టీఆర్ టిడిపి తరుపున రాజమండ్రి లోక్ సభకు పోటీ చేసి ఓటమి పాలయ్యారు.ఎన్టీఆర్ టిడిపి అధ్యక్షురాలిగా ఉన్న లక్ష్మీ పార్వతి వ్యవహార శైలి నచ్చకపోవడంతో రాజకీయాల్లో కొంత కాలం స్తబ్దత వహించారు.

1997 లో చంద్రబాబు నాయుడు ఆహ్వానం మేరకు తిరిగి తెలుగుదేశం పార్టీలో చేరిన బుచ్చయ్య చౌదరి 1999 లో నాలుగోసారి రాజమండ్రి నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యి తెలుగుదేశం పార్టీ తరపున రాయలసీమ, కోస్తాంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో ఇంచార్జిగా వ్యవహరించారు. 2003 లో జరిగిన గోదావరి పుష్కరాలను ఎటువంటి అవాంతరాలు లేకుండా ఘనంగా నిర్వహించారు.

2004 నుండి 2014 వరకు పార్టీ అప్పగించిన ప్రతి కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించి అధినేత చంద్రబాబు నాయుడు మన్నలు అందుకోవడం జరిగింది. జిల్లాలో ఎవ్వరిని లెక్కచేయకుండా ఉండే అప్పటి రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ను ధైర్యంగా ఢీ కొట్టేవారు.

2014లో రాజమండ్రి గ్రామీణ ఎమ్మెల్యేగా గెలిచిన బుచ్చయ్య చౌదరి 2014, 2016 మంత్రివర్గ విస్తరణల్లో అధినేత చంద్రబాబు చోటు కల్పించకపోవడంతో రాష్ట్ర, జిల్లా పార్టీ కార్యక్రమాలకు దూరంగా తన నియోజకవర్గానికి పరిమితం కావడంతో అనుభవం లేని కొందరి వ్యక్తుల కారణంగా జిల్లాలో పార్టీకి బాగా చెడ్డ పేరు రావడం జరిగింది. ఆ ప్రభావం 2019లో బాగా ప్రభావం చూపింది, 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరుపున గెలిచిన 23 మంది వ్యక్తుల్లో బుచ్చయ్య చౌదరి ఒకరు.[1] ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో విపక్ష పార్టీ ఉపనేతగా వ్యవహరిస్తున్నారు.

2021లో పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఉదాసీన వైఖరిని నిరసిస్తూ రాజీనామా చేసి సంచలనం సృష్టించారు, స్వయంగా చంద్రబాబు రంగంలోకి దిగి మాట్లాడటంతో తన రాజీనామా విరమించుకున్నారు.

వ్యక్తిగత జీవితం సవరించు

బుచ్చయ్య చౌదరి వీరేశలింగం కళాశాలలో చదువుతున్న రోజుల్లో తనతో పాటుగా చదువుతున్న ఝాన్సీ లక్ష్మీని ప్రేమించి పెద్దల అంగీకారంతో వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు.

మూలాలు సవరించు

  1. 1.0 1.1 "Buchayya Chowdary Gorantla(TDP):Constituency- RAJAMUNDRY RURAL(EAST GODAVARI) - Affidavit Information of Candidate:". myneta.info. Retrieved 2022-11-12.

వెలుపలి లంకెలు సవరించు

  1. https://myneta.info/andhrapradesh2019/candidate.php?candidate_id=4705
  2. State Elections 2004 Partywise Comparison for 40-Rajahmundry Constituency of Andhra Pradesh.
  3. https://www.andhrajyothy.com/telugunews/huge-shock-to-telugudesam-party-1921081912023450