గోరింటాకు (1979 సినిమా)
1979 సినిమా
గోరింటాకు 1979లో విడుదలైన ఒక తెలుగు చిత్రం. చక్కటి అభిరుచి గల నిర్మాత కె.మురారి, దాసరి నారాయణరావు దర్శకత్వంలో నిర్మించిన చిత్రం.
గోరింటాకు (1979 తెలుగు సినిమా) | |
![]() | |
---|---|
దర్శకత్వం | దాసరి నారాయణ రావు |
నిర్మాణం | మురారి నాయుడు |
రచన | దాసరి నారాయణ రావు |
తారాగణం | శోభన్ బాబు, సుజాత, కనకాల దేవదాస్, ఎం.ప్రభాకరరెడ్డి, వక్కలంక పద్మ, జె.వి.రమణమూర్తి, రమాప్రభ, సావిత్రి |
సంగీతం | కె.వి.మహదేవన్ |
నేపథ్య గానం | ఎస్.పీ.బాలసుబ్రమణ్యం, పి.సుశీల |
గీతరచన | ఆత్రేయ, శ్రీశ్రీ, వేటూరి సుందరరామ్మూర్తి, దేవులపల్లి కృష్ణశాస్త్రి |
నిర్మాణ సంస్థ | యువ చిత్ర |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
ఈ చిత్రం కె.రామలక్ష్మి నవల ఆధారంగా తీయబడింది[1]. ఐతే రంగనాయకమ్మ గారు ఇది తన నవల ఆధారంగా తీసారని కోర్టుకెళ్ళారు. చిత్రకథకు వస్తే రమణమూర్తి బాధ్యతారాహిత్యంతో, దురలవాట్లతో ఉంటాడు. సావిత్రి ఆతని భార్య. ఇద్దరుపిల్లలు. రమణమూర్తి దుశ్చేష్టలవల్ల కూతురు మరణిస్తుంది. కొడుకు శోభన్ బాబు తల్లితో పాటు పెరిగి డాక్టరు ఔతాడు. సుజాత అతని వృద్ధిలో తోడ్పడుతుంది. వృత్తి రీత్యా పరిచయమైన వక్కలంక పద్మను శోభన్ వివాహంచేసుకోవటం, అతని బ్రతుకుని పండించిన సుజాత గోరింటాకులా అతనినుండి దూరమవటం చిత్రకథ. చిత్రానికి సమాంతరంగా చలం, రమాప్రభ కథ నడుస్తుంది.
పాటలుసవరించు
- ఇలాగ వచ్చి అలాగ జొచ్చి ఎన్నో వరాల మాలలు గుచ్చి - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల - రచన: శ్రీశ్రీ
- ఎలా ఎలా దాచావు అలవికాని అనురాగం - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల - రచన: దేవులపల్లి కృష్ణశాస్త్రి
- గోరింట పూచింది కొమ్మ లేకుండా - పి.సుశీల - రచన: దేవులపల్లి కృష్ణశాస్త్రి
- కొమ్మకొమ్మకో సన్నాయి కోటి రాగాలు ఉన్నాయి. - పి.సుశీల, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం - రచన: వేటూరి
- పాడితే శిలలైన కరగాలి జీవిత గతులైన మారాలి - పి.సుశీల - రచన: ఆత్రేయ
- చెప్పనా సిగ్గు విడిచి చెప్పరానిది చెప్పకుంటే నీకు - పి.సుశీల, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం - రచన: ఆత్రేయ
- యేటంటవు యేటంటవు ఇంత కంటే నన్నేటి - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల - రచన: ఆత్రేయ
మూలాలుసవరించు
- ↑ "Gorintaku (1979)". Indiancine.ma. Retrieved 2023-05-31.
వనరులుసవరించు
- డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.