గోల్కొండ హైస్కూల్

2011 సినిమా

గోల్కొండ హైస్కూల్ 2011 లో ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో విడుదలైన ఒక తెలుగు చిత్రం.[1][2] ఇందులో సుమంత్, స్వాతి ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ సినిమా పరువు హరిమోహన్ రాసిన ద మెన్ వితిన్ అనే పుస్తకం ఆధారంగా తీశారు.[3] 2011 జనవరి 12 న విడుదలైన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుని విజయవంతమైన చిత్రంగా నిలిచింది.

గోల్కొండ హైస్కూల్
(2011 తెలుగు సినిమా)
దర్శకత్వం ఇంద్రగంటి మోహన కృష్ణ
తారాగణం సుమంత్, స్వాతి, సుబ్బరాజు, తనికెళ్ళ భరణి, ఎస్.ఎం. బాషా
విడుదల తేదీ 2011 జనవరి 12 (2011-01-12)
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

కథ మార్చు

గోల్కొండ హైస్కూల్ ట్రస్టు బోర్డు సభ్యుల్లో ఒకరైన కిరీట్ దాస్ ఆ పాఠశాలలోని విశాలమైన క్రికెట్ మైదానాన్ని ఐఐటి శిక్షణా కేంద్రంగా మార్చేందుకు ప్రతిపాదన తెస్తాడు. ప్రిన్సిపల్ అయిన విశ్వనాథ్ మరికొంతమంది ట్రస్టీలతో కలిసి ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తాడు. కానీ వారి మాట చెల్లదు. కిరీట్ దాస్ విశ్వనాథ్ కి ఒక ప్రతిపాదన తెస్తాడు. స్కూలు కనీసం ఒక క్రీడలో అయినా మంచి పేరు తెచ్చుకుంటే క్రీడా మైదానాన్ని అలాగే ఉంచుతానని చెబుతాడు. విశ్వనాథ్ అందుకు బదులుగా గోల్కొండ హైస్కూల్ రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల్లో విజేతగా నిలిస్తే మైదానాన్ని అలాగే వదిలేయమని చెబుతాడు. విశ్వనాథ్ స్కూలు మాజీ విద్యార్థియైన సంపత్ ను క్రికెట్ శిక్షకుడిగా నియమిస్తాడు.

సంపత్ చాలా క్రమశిక్షణ కలిగిన వాడు. అందుకని స్కూలు క్రికెట్ జట్టు మొదట్లో అతన్ని శిక్షకుడిగా అంగీకరించరు. కానీ నెమ్మదిగా అతని మంచి తనాన్ని గమనించి అతని శిక్షణకు చేరువవుతారు. ఈ లోపు తమ ప్రింసిపల్ విశ్వనాథ్, కిరీట్ దాస్ ల మధ్య జరిగిన ఒప్పందం గురించి కూడా వాళ్ళకు తెలుస్తుంది. దాంతో మరింత బాగా సాధన చేయడం మొదలుపెడతారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో ఫైనల్ దాకా వెళతారు. అక్కడ ప్రత్యర్థి జట్టు శిక్షకుడైన సుందర్ కి సంపత్ కి పూర్వం ఏదో గొడవలు జరిగి ఉంటాయి. సంపత్ మీద అపనమ్మకం వల్ల గోల్కొండ హైస్కూల్ ఫైనల్లో ప్రత్యర్థికి ధారాళంగా పరుగులిచ్చేస్తారు. కానీ విశ్వనాథ్ వచ్చి సంపత్ గతం గురించి, అతని ప్రతిభ గురించి చెప్పడంతో మళ్ళీ విజృంభించి ప్రత్యర్థిని ఓడించి 15 ఏళ్ళ తర్వాత మళ్ళీ కప్పు గెలుస్తారు. క్రీడా మైదానం కూడా అలాగే ఉండిపోతుంది.

నటవర్గం మార్చు

పాటలు మార్చు

ఈ సినిమాకు కల్యాణి మాలిక్ సంగీతం అందించాడు.

జాగో , గానం.హేమచంద్ర

ఇది అదేనేమో , గానం.గీతామాధురి , శ్రీకృష్ణ

అడుగేస్తే , గానం.అనురాధ పాలకృతి

జీ . హెచ్.ఎస్ . యుద్దభేరి, గానం. కల్యాణి మాలిక్

అడుగేస్తే (మేల్ వాయిస్) గానం.హేమచంద్ర

ఏతినావో , గానం: హేమచంద్ర

సాంకేతికవర్గం మార్చు

మూలాలు మార్చు

  1. "'Golconda High School' film team visits city". The Hindu.
  2. "Golconda High School review. Golconda High School Telugu movie review, story, rating - IndiaGlitz.com". IndiaGlitz.
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2011-07-08. Retrieved 2020-06-26.

బయటి లంకెలు మార్చు