మధుమణి
మధుమణి ఒక తెలుగు నటి. సినిమాల్లో ఎక్కువగా సహాయ పాత్రలు పోషిస్తుంటుంది. టి. వి. ధారావాహికల్లో కూడా నటించింది. డబ్బింగ్ చెబుతుంది.[1]
మధుమణి | |
---|---|
జననం | పార్వతీపురం, విజయనగరం జిల్లా |
వృత్తి | నటి |
జీవిత భాగస్వామి | గణేష్ |
పిల్లలు | మనీష, సుజిత్ |
వ్యక్తిగత జీవితం
మార్చుమధుమణి విజయనగరం జిల్లా, పార్వతీపురంలో పుట్టింది. ఆమెకు పదకొండేళ్ళ వయసులో తండ్రి మరణించాడు. తల్లి ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలిగా పనిచేసేది. ఈమెకు ఇంటర్మీడియట్ లో ఉండగానే గణేష్ తో వివాహం అయింది. ఈయన వ్యాపారం చేస్తాడు. వీరికి ఇరువురు సంతానం. కూతురు మనీష్ సాఫ్ట్ వేరు ఇంజనీరుగా పనిచేస్తుంది. కుమారుడు సుజిత్ చదువు పూర్తి చేసుకుని లఘుచిత్రాలపై పని చేస్తున్నాడు.
కెరీర్
మార్చుఈమె 1992 దాకా సాధారణ గృహిణి. ఒకసారి పద్మాలయా స్టూడియోస్ కు వెళ్ళి ఒక సీరియల్ చిత్రీకరణ చూస్తుండగా సదరు సీరియల్ వాళ్ళు ఈమెను అందులో నటించమన్నారు. ఇంట్లో వాళ్ళకు కూడా అడిగి అనుమతి తీసుకుని ఆ ధారావాహికలో మహర్షి రాఘవకు జోడీగా నటించింది. దూరదర్శన్ లో ప్రసారమైన ఋతురాగాలు ధారావాహికలో ఈమె పోషించిన కావేరి అనే పాత్ర మంచి పేరు తెచ్చిపెట్టింది. తర్వాత సంసార సాగరం, చక్రవాకం, విధి, మనోయజ్ఞం, అందం, మొగలిరేకులు, చంద్రముఖి మొదలైన కార్యక్రమాల్లో నటించింది.
ఈమె కొన్ని లఘుచిత్రాల్లో కూడా నటించింది. 2008లో ఈమె నటించిన లఘుచిత్రం ఇటలీలో జరిగిన చిత్రోత్సవంలో ప్రదర్శించారు. అందులో ఈమెకు ఉత్తమ నటి పురస్కారం లభించింది. ఈమె డబ్బింగ్ వృత్తిలో లేకపోయినా కొన్నిసార్లు అవసరం మేరకు డబ్బింగ్ చెప్పించి. సుధా చంద్రన్ తెలుగులో ఒక ధారావాహికలో నటించగా ఆమెకు మధుమణి డబ్బింగ్ చెప్పింది.
సినిమాలు
మార్చు- రాఖీ (2006)
- గోదావరి (2006)
- అష్టా చమ్మా (2008)
- జోగిని
- గోల్కొండ హైస్కూల్ (2011)
- మిర్చి (2013)
- అమ్మమ్మగారిల్లు (2018)
- రామ చక్కని సీత (2019)
మూలాలు
మార్చు- ↑ "ఇప్పటికీ కావేరినే". navatelangana. Archived from the original on 26 సెప్టెంబరు 2016. Retrieved 25 February 2019.