ఘటకేసర్ పురపాలకసంఘం
ఘటకేసర్ పురపాలకసంఘం, తెలంగాణ రాష్ట్రం, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాకు చెందిన ఒక పట్టణ స్థానిక స్వపరిపాలన సంస్థ.[1] ఘటకేసర్ పట్టణం దీని ప్రధాన పరిపాలన కేంద్రం. ఈ పురపాలక సంఘం మల్కాజ్గిరి లోక్‌సభ నియోజకవర్గం లోని మేడ్చల్ శాసనసభ నియోజకవర్గం పరిధిలో ఉంది.[2]
ఘటకేసర్ పురపాలకసంఘం | |
— పురపాలకసంఘం — | |
అక్షాంశరేఖాంశాలు: 17°29′48″N 78°40′06″E / 17.4967966°N 78.6682395°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | మేడ్చల్ మల్కాజిగిరి |
మండలం | ఘటకేసర్ |
ప్రభుత్వం | |
- చైర్పర్సన్ | |
- వైస్ చైర్పర్సన్ | |
వైశాల్యము | |
- మొత్తం | 17.50 km² (6.8 sq mi) |
జనాభా (2011) | |
- మొత్తం | 22,657 |
- పురుషుల సంఖ్య | 11,692 |
- స్త్రీల సంఖ్య | 10,965 |
- గృహాల సంఖ్య | 5,172 |
పిన్ కోడ్ - 501301 | |
వెబ్సైటు: అధికార వెబ్ సైట్ |
చరిత్ర
మార్చుమేజర్ గ్రామ పంచాయితీగా ఉన్న ఘటకేసర్, తెలంగాణ ప్రభుత్వం చేసిన పురపాలక సవరణ బిల్లులో భాగంగా 2018, ఆగస్టు 2న పురపాలక సంఘంగా ఏర్పడింది.[3]
భౌగోళికం
మార్చుఘటకేసర్ 17.50 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోఉంది. ఇది 17°27′00″N 78°41′06″E / 17.450°N 78.685°E అక్షాంశరేఖాంశాల మధ్య ఉంది. రాష్ట్ర రాజధాని హైదరాబాదు నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది.
జనాభా గణాంకాలు
మార్చు2011 భారత జనాభా లెక్కల ప్రకారం, పురపాలక సంఘం పరిధిలో ఉన్న జనాభా మొత్తం 22657 మంది కాగా, అందులో 11692 మంది పురుషులు, 10965 మంది మహిళలు ఉన్నారు. 5172 గృహాలు ఉన్నాయి ఇది పరిపాలనా పరంగా మునిసిపాలిటీ 22 రెవెన్యూ వార్డులుగా విభజించబడింది.[4]
పౌర పరిపాలన
మార్చుపురపాలక సంఘం కౌన్సిల్ కు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నిక జరుగుతుంది. పురపాలక సంఘం పరిధిలోని జనాభా ప్రాతిపదికననుసరించి దీనిని 18 ఎన్నికల వార్డులుగా విభజించారు. ప్రతి వార్డుకు వార్డు కౌన్సిలర్ ప్రాతినిధ్యం వహిస్తాడు. కౌన్సిల్ బోర్డుకు చైర్పర్సన్ నేతృత్వం వహిస్తారు. 2020 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో చైర్‌పర్సన్‌గా, వైస్ చైర్‌పర్సన్‌గా ఎన్నికైనారు.[5] వీరు ఎన్నికైననాటినుండి ఐదు సంవత్సరాలు పదవిలో కొనసాగుతారు.
వార్డు కౌన్సిలర్లు
మార్చు- చందుపట్ల వెంకట్ రెడ్డి
- కొమ్మగోని రమాదేవి
- బొక్క సంగీతరెడ్డి
- బండారి అంజనేయులు
- కొమ్మిడి అనురాధ
- ఎండి. సుల్తానా
- సల్లూరి నాగజ్యోతి
- చిల్కూరి హేమలత
- పలుగుల మాధవరెడ్డి
- బార్ల శశికళ
- కడుపోల్ల మల్లేష్
- ఎం. పద్మారావు
- ఎండి. జహంగీర్
- బండారి వసంత
- బత్తుల నరేష్
- ఎం. పావని
- బి. నర్సింగ్ రావు
- కె. రవీందర్
మూలాలు
మార్చు- ↑ "Ghatkesar Municipality". ghatkesarmunicipality.telangana.gov.in. Archived from the original on 16 ఏప్రిల్ 2021. Retrieved 1 April 2021.
- ↑ Telangana, Government. "Commissioner and Director of Municipal Administration(CDMA), Municipal Administration and Urban Development (MA&UD) Department". cdma.telangana.gov.in. Archived from the original on 4 December 2019. Retrieved 1 April 2021.
- ↑ నమస్తే తెలంగాణ (28 March 2018). "రాష్ట్రంలో కొత్త పురపాలికలు ఇవే..." Archived from the original on 13 September 2018. Retrieved 1 April 2021.
- ↑ "Basic Information of Municipality, Ghatkesar Municipality". ghatkesarmunicipality.telangana.gov.in. Archived from the original on 17 మే 2021. Retrieved 1 April 2021.
- ↑ admin (2020-05-11). "Ghatkesar municipality Councillors list 2020". Telangana data. Archived from the original on 2021-05-17. Retrieved 17 May 2021.
వెలుపలి లంకెలు
మార్చు- ఘటకేసర్ పురపాలక సంఘ అధికారిక వెబ్సైటు Archived 2021-04-16 at the Wayback Machine