ఘట్టమనేని మంజుల

మంజుల ఘట్టమనేని (జననం 1970), భారతీయ సినీ నిర్మాత, నటి. ఆమె ఎక్కువగా తెలుగు సినిమాల్లో పనిచేసింది. ప్రముఖ తెలుగు సినీ నటుడు ఘట్టమనేని కృష్ణ కుమార్తె ఆమె. 1999 లో రాజస్థాన్ అనే సినిమాలో నటించడం ద్వారా తెరకు పరిచయమయ్యారు. సమ్మర్ ఇన్ బెత్లెహెం అనే మలయాళ సినిమాలో కథానాయకురాలిగా నటించారు. 2002 లో షో సినిమా ద్వారా అందరి మెప్పు పొందారు. ఈ చిత్రానికి జాతీయ స్థాయి ఉత్తమ చిత్రం,, ఉత్తమ స్క్రీన్‌ప్లే పురస్కారాలు దక్కాయి. ఈమె తన సొంత ప్రొడక్షన్ సంస్థ ఇందిరా ప్రొడక్షన్స్ ద్వారా సినిమా నిర్మాణం చేస్తున్నారు.

ఘట్టమనేని మంజుల (స్వరూప్)
ఘట్టమనేని మంజుల.jpg
ఘట్టమనేని మంజుల
జననం
మంజుల

1970
ఇతర పేర్లుమంజుల, మంజుల స్వరూప్
వృత్తినటి, నిర్మాత
క్రియాశీల సంవత్సరాలు2001–ప్రస్తుతం
గుర్తించదగిన సేవలు
షో సినిమాలో పాత్ర
జీవిత భాగస్వామిసంజయ్ స్వరూప్
పిల్లలు1
తల్లిదండ్రులుఘట్టమనేని కృష్ణ
ఇందిరా దేవి
బంధువులు

వ్యక్తిగత జీవితంసవరించు

ఈమె కృష్ణ, ఇందిరా దేవీల మూడవ సంతానం, మొదటి కూతురు. ఈమెకు ఇద్దరు అన్నలు, ఇద్దరు చెల్లెళ్ళు. ఈమె దర్శక నిర్మాత సంజయ్ స్వరూప్ ను వివాహంచే సుకున్నారు.[1] వీరికి జాహ్నవి అనే కూతురుంది.[2]

సినిమాలుసవరించు

నిర్మాతగాసవరించు

సంవత్సరం సినిమా దర్శకులు భాష వివరాలు
2002 షో నీలకంఠ తెలుగు జాతీయ ఉతమ చిత్రం
2004 నాని ఎస్.జె. సూర్య తెలుగు
2006 పోకిరి పూరీ జగన్నాథ్ తెలుగు నంది పురస్కారం - ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం
2009 కావ్యాస్ డైరీ వి.కె. ప్రకాష్ తెలుగు
2010 యేం మాయ చేసావె గౌతం మీనన్ తెలుగు
2018 మనసుకు నచ్చింది తెలుగు

నటిగాసవరించు

సంవత్సరం సినిమా పాత్ర సహనటీనటులు వివరాలు
1998 సమ్మర్ ఇన్ బెత్లెహెం అపర్ణ సురేష్ గోపి, జయరాం, మంజు వారియర్ మలయాళం
1999 రాజస్థాన్ శరత్ కుమార్, విజయశాంతి తమిళం
2002 షో రిధిమ సూర్య
2009 కావ్యాస్ డైరీ పూజ చార్మీ, ఇంద్రజిత్, ఇంద్రజిత్ సుకుమారన్
2010 ఓరెంజ్ రాం సోదరి రాం చరణ్ తేజ, జెనీలియా
2013 సేవకుడు కృష్ణ, శ్రీకాంత్ [3]
2022 మళ్ళీ మొదలైంది డాక్టర్ మిత్ర సుమంత్, సుహాసిని [4]

మూలాలుసవరించు

  1. "Didn't we tell you she's returning!". Entertainment section. ది టైంస్ ఆఫ్ఇం డియా. 2008-12-16. Retrieved 2009-06-23.
  2. Mahesh Babu, Namratha’s Son – Image. "Mahesh Babu, Namratha's Son – Image". Whatslatest.com. Retrieved 2012-11-04.{{cite web}}: CS1 maint: multiple names: authors list (link)
  3. ఆంధ్రవిలాస్. "Superstar Krishna is going to act with Daughter! -". Andhravilas.com. Archived from the original on 2012-07-30. Retrieved 2012-11-04.
  4. Sakshi (9 August 2021). "రీఎంట్రీ ఇస్తున్న మహేశ్‌ సోదరి.. ఫస్ట్‌ లుక్‌ అవుట్‌". Archived from the original on 22 జనవరి 2022. Retrieved 22 January 2022.