విజయనిర్మల

సినీ నటి, దర్శకురాలు
(ఘట్టమనేని విజయనిర్మల నుండి దారిమార్పు చెందింది)

విజయనిర్మల (ఫిబ్రవరి 20, 1946 - జూన్ 27, 2019) తెలుగు సినిమా నటి, దర్శకురాలు, సినీ నటుడు ఘట్టమనేని కృష్ణ భార్య. ఈమె మొదటి పెళ్ళి ద్వారా సినీ నటుడు విజయ నరేష్ కి తల్లి, నటి జయసుధకు ఈమె పిన్నమ్మ.

విజయనిర్మల
Vijaya-nirmala-ghattamaneni.jpg
విజయనిర్మల
జననం
నిర్మల

ఫిబ్రవరి 20, 1946
మరణంజూన్ 27, 2019[1]
మరణ కారణంఅనారోగ్యం
ఇతర పేర్లునిర్మల
వృత్తినటి, దర్శకురాలు
జీవిత భాగస్వామిఘట్టమనేని కృష్ణ
పిల్లలువిజయ నరేష్
తల్లిదండ్రులు
  • శకుంతల (తల్లి)

జీవిత విషయాలుసవరించు

విజయనిర్మల పుట్టిల్లు నరసరావుపేట. విజయనిర్మల తల్లి శకుంతల, అన్నలు వసంతరావు, సంజీవరావు పాతూరులో వీరి కుటుంబాలన్నీ ఉండేవి. విజయనిర్మల బాల్యం అత్యధిక కాలం పాతూరులోనే గడిచింది. రాజాగారి కోటలోని విక్టోరియా హాల్లో ఆమె చిన్నతనంలో నృత్య ప్రదర్శన కూడా ఇచ్చింది. తదనంతర కాలంలో విజయనిర్మల తల్లిదండ్రులతో కలిసి చెన్నై వెళ్లిపోయారు. ఈమె అసలు పేరు నిర్మల అయితే తనకు సినీరంగములో తొలి అవకాశమిచ్చిన విజయా స్టూడియోకు కృతజ్ఞతగా విజయనిర్మల అని పేరు మార్చుకొన్నది. అప్పటికే ఇదే పేరుతో వేరే నటి (ఇప్పటి నిర్మలమ్మ) ఉండడం కూడా పేరు మార్పునకు మరో కారణము.

సినిమారంగంసవరించు

పాండురంగ మహత్యంలో బాలనటిగా చిత్రరంగంలో ప్రవేశించారు. ఆ తరువాత అంచెలంచెలుగా ఎదిగి కథానాయకిగా ఉన్నతస్థానానికి చేరారు. తరువాత దర్శకత్వ బాధ్యతలు చేపట్టి ప్రపంచంలోనే అత్యధిక సినిమాలకు దర్శకత్వం వహించిన మహిళగా 2002లో గిన్నిసుబుక్‌లో ఎక్కారు.[2] నటి అయిన ఈమె 1971లో దర్శకత్వము వహించడము ప్రారంభించింది. ఈమె నటించిన అధిక చిత్రాలలో కథానాయకుడు కృష్ణ కావటం విశేషం. వీరిద్దరూ జంటగా సుమారు యాభై వరకూ చిత్రాలలో నటించారు. రఘుపతి వెంకయ్య పురస్కారానికి ఎంపికయ్యారు.[3]

విజయనిర్మల, కృష్ణ జంటగా నటించిన తెలుగు చిత్రాలుసవరించు

మరణంసవరించు

గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న విజయనిర్మల హైదారాబాదు గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ 2019, జూన్ 27 గురువారం ఉదయం మరణించారు.[4][5][6]

వంశవృక్షంసవరించు

మూలాలుసవరించు

  1. Veteran actor-directorVijaya Nirmala passes away at 73, www.thenewsminute.com.
  2. ది హిందూ ఆంగ్ల పత్రికలో(Tuesday, Apr 30, 2002) Vijayanirmala enters the Guinness Archived 2006-09-25 at the Wayback Machine శీర్షికన వివరాలు 22 జులై, 2008న సేకరించబడినది.
  3. BBC News తెలుగు (8 March 2021). "తెలుగు సినిమాల్లో మహిళలు: నటనలోనే కాదు... సాంకేతిక రంగాల్లోనూ సత్తా చాటుతున్నారు". Archived from the original on 16 జూలై 2021. Retrieved 16 July 2021. Check date values in: |archivedate= (help)
  4. https://www.ndtv.com/entertainment/actress-director-vijaya-nirmala-dies-at-73-2059943
  5. నమస్తే తెలంగాణ, తెలంగాణ వార్తలు (28 June 2019). "విజయనిర్మల ఇకలేరు". Archived from the original on 28 June 2019. Retrieved 28 June 2019.
  6. ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యాంశాలు (28 June 2019). "విజయ నిర్మల ఇకలేరు". Archived from the original on 28 June 2019. Retrieved 28 June 2019.

బయటి లింకులుసవరించు