చంద్రశేఖరపురం

ఆంధ్ర ప్రదేశ్, ప్రకాశం జిల్లా లోని గ్రామం,మండలకేంద్రం

చంద్రశేఖరపురం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని ప్రకాశం జిల్లాకు చెందిన ఒక గ్రామం, మండలకేంద్రం[2].,

రెవిన్యూ గ్రామం
నిర్దేశాంకాలు: 15°11′00″N 79°17′00″E / 15.1833°N 79.2833°E / 15.1833; 79.2833Coordinates: 15°11′00″N 79°17′00″E / 15.1833°N 79.2833°E / 15.1833; 79.2833
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా
మండలంచంద్రశేఖరపురం మండలం
విస్తీర్ణం
 • మొత్తం8.6 కి.మీ2 (3.3 చ. మై)
జనాభా వివరాలు
(2011)[1]
 • మొత్తం7,544
 • సాంద్రత880/కి.మీ2 (2,300/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి964
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 ( 08402 Edit this on Wikidata )
పిన్(PIN)523112 Edit this on Wikidata


గ్రామ భౌగోళికంసవరించు

 

సమీప గ్రామాలుసవరించు

నల్లమడుగుల 2.3 కి.మీ, కోవిలంపాడు 2.6 కి.మీ, అరివేముల 6 కి.మీ, పెదరాజుపాలెం 6.5 కి.మీ, తూర్పుకట్టకిందపల్లి 9.2 కి.మీ.

సమీప పట్టణాలుసవరించు

కనిగిరి 38.9 కి.మీ, పామూరు 17.8 కి.మీ, వెలిగండ్ల 23.4 కి.మీ, కొమరోలు 64.5 కి.మీ., సీతారామపురం 31.1

గ్రామానికి రవాణా సౌకర్యాలుసవరించు

చంద్రశేఖరపురం నుంచి చెన్నై, బెంగుళూర్ విజయవాడ హైదరాబాదు వంటి అన్ని ఇతర నగరాలకు రోడ్డు సౌకర్యం ఉంది.

గ్రామంలోని దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలుసవరించు

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం భైరవకోన ఈ మండలం లోని కొత్తపల్లి గ్రామానికి 5 కి.మీ. దూరంలో ఉంది.

శ్రీ రాచూరు పెద్దమ్మతల్లి ఆలయంసవరించు

చంద్రశేఖరపురం గ్రామం, వడియరాజులనగర్‌లోని ఈ ఆలయంలో, అమ్మవారి వార్షిక తిరునాళ్ళు, 2015, జూన్-4వతేదీ గురువారంతో ముగిసినవి. తిరునాళ్ళ సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. చివరిరోజు గురువారంనాడు, గుర్రం ఊరేగింపు కార్యక్రమం అత్యంత వైభవంగా సాగినది. ఈ గ్రామానికి చెందిన శ్రీ ముప్పాళ్ళ కొండపనాయుడు, గుర్రంపై ఎక్కి ఊరేగింపుతో ప్రజలకు అభివాదం తెలిపినారు. ఈ ఉత్సవాన్ని తిలకించడానికై మండలంలోని పరిసర గ్రామాలనుండి ప్రజలు అధికసంఖ్యలో తరలివచ్చారు. ప్రధానవీధులలో భారీ యెత్తున బాణాసంచా కాల్చారు. డప్పుదరువులు, భక్తుల కోలాహలం మధ్య, కార్యక్రమం కన్నులపండువగా సాగినది. తిరునాళ్ళలో భాగంగా వడ్డెరపాలెం నుండి మహిళలు, పెద్దసంఖ్యలో పొంగళ్ళు తలపై పెట్టుకొని ఆలయం వద్దకు ప్రదర్శనగా తరలివచ్చి, అమ్మవారికి ప్రతేకపూజలు నిర్వహించి, మొక్కులు తీర్చుకునారు. భక్తులు గండదీపాలు వెలిగించారు. భక్తులు అధికసంఖ్యలో విచ్చేసి అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. కొందరు భక్తులు కుంకుమబండ్లను కట్టుకొని ఊరేగింపుకు తరలివచ్చారు. ఊరేగింపులో కత్తివిన్యాసం నిర్వహించారు. [2]

శ్రీ నారాయణస్వామివారి ఆలయంసవరించు

గణాంకాలుసవరించు

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 5,541.[3] ఇందులో పురుషుల సంఖ్య 2,834, మహిళల సంఖ్య 2,707, గ్రామంలో నివాస గృహాలు 1,142 ఉన్నాయి.గ్రామ విస్తీర్ణం 860 హెక్టారులు.

  • గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[1]

మూలాలుసవరించు

  1. 1.0 1.1 2011 ఆంధ్ర ప్రదేశ్ జనగణన డేటా - గ్రామాలు దత్తాంశ సమితి (in ఇంగ్లీష్), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q42501043, archived from the original on 11 July 2017
  2. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
  3. http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18