చమర సిల్వా

శ్రీలంక మాజీ క్రికెట్ ఆటగాడు

లిండమ్లీలేజ్ ప్రగీత్ చమర సిల్వా (జననం 1979, డిసెంబరు 14) శ్రీలంక మాజీ క్రికెట్ ఆటగాడు. 12 సంవత్సరాలపాటు క్రికుట్ లోని అన్ని ఫార్మాట్లలో ఆడాడు. కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్, లెగ్ బ్రేక్ బౌలర్ గా రాణించాడు.[1] 2007, 2009, 2011 లో మూడు ప్రపంచ రన్నరప్ శ్రీలంక జట్లలో ముఖ్యమైన సభ్యుడిగా ఉన్నాడు.

చమర సిల్వా
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
లిండమ్లీలేజ్ ప్రగీత్ చమర సిల్వా
పుట్టిన తేదీ (1979-12-14) 1979 డిసెంబరు 14 (వయసు 45)
పాణదుర, శ్రీలంక
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి లెగ్-స్పిన్
పాత్రబ్యాటరు
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 105)2006 డిసెంబరు 7 - న్యూజీలాండ్ తో
చివరి టెస్టు2008 ఏప్రిల్ 3 - వెస్టిండీస్ తో
తొలి వన్‌డే (క్యాప్ 101)1999 ఆగస్టు 26 - ఆస్ట్రేలియా తో
చివరి వన్‌డే2011 నవంబరు 23 - పాకిస్తాన్ తో
తొలి T20I (క్యాప్ 6)2006 డిసెంబరు 22 - న్యూజీలాండ్ తో
చివరి T20I2011 నవంబరు 25 - పాకిస్తాన్ తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2007–Bloomfield Cricket and Athletic Club
2005–2007Sebastianites Cricket and Athletic Club
2003–2005Sinhalese Sports Club
1996–2003Panadura Sports Club
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలు T20I
మ్యాచ్‌లు 11 75 16
చేసిన పరుగులు 537 1,587 175
బ్యాటింగు సగటు 33.56 28.85 13.46
100s/50s 1/2 1/13 0/0
అత్యధిక స్కోరు 152* 107* 38
వేసిన బంతులు 102 42 18
వికెట్లు 1 1 1
బౌలింగు సగటు 65.00 33.00 15.00
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0
అత్యుత్తమ బౌలింగు 1/57 1/21 1/4
క్యాచ్‌లు/స్టంపింగులు 7/– 20/– 5/–
మూలం: Cricinfo, 2017 ఫిబ్రవరి 9

దేశీయ క్రికెట్

మార్చు

ఇతడు పాణదుర రాయల్ కళాశాలలో చదువుకున్నాడు.[2][3] క్లబ్ పాణదుర కోసం రికార్డును నెలకొల్పిన జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే అంతర్జాతీయ అరంగేట్రంలో 54 పరుగులతో సహా మంచి రికార్డును సాధించాడు. 1998 నుండి లిస్ట్ ఎ క్రికెట్, 2004 నుండి ట్వంటీ 20 క్రికెట్‌లో ఆడాడు. 2004 ఆగస్టు 17న 2004 ఎస్ఎల్సీ ట్వంటీ20 టోర్నమెంట్‌లో సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ తరపున తన ట్వంటీ20 అరంగేట్రం చేసాడు.[4]

2018 మార్చిలో 2017–18 సూపర్ ఫోర్ ప్రావిన్షియల్ టోర్నమెంట్ కోసం కొలంబో జట్టులో ఎంపికయ్యాడు.[5][6] తరువాతి నెలలో 2018 సూపర్ ప్రావిన్షియల్ వన్ డే టోర్నమెంట్ కోసం కొలంబో జట్టులో కూడా ఎంపికయ్యాడు.[7] 2019 మార్చిలో 2019 సూపర్ ప్రావిన్షియల్ వన్ డే టోర్నమెంట్ కోసం కొలంబో జట్టులో ఎంపికయ్యాడు.[8]

అంతర్జాతీయ కెరీర్

మార్చు

న్యూజిలాండ్‌లో తన టెస్ట్ అరంగేట్రం చేసాడు. రెండవ అవకాశంలో కుమార సంగక్కరతో కలిసి 121 పరుగుల భాగస్వామ్యాన్ని చేశాడు. 2వ టెస్ట్ మొదటి ఇన్నింగ్స్‌లో 61 పరుగులు చేశాడు. రెండవ ఇన్నింగ్స్‌లో అజేయంగా 152 పరుగులు చేశాడు, 20 ఫోర్లు కొట్టాడు. తన భాగస్వామ్యులు ఔట్ అయ్యే ముందు (ముఖ్యంగా చమిందా వాస్, కలిసి 88 పరుగులు చేయడం)తో బ్యాటింగ్ చేశాడు.

ప్రపంచ కప్‌కు కేవలం 3 వారాల ముందు భారత్‌తో జరిగిన మ్యాచ్ లో తన మొదటి వన్డే ఇంటర్నేషనల్ సెంచరీని చేశాడు.[9] క్రికెట్ వరల్డ్ కప్ 2007 లో ఇతని మంచి ఫామ్ కొనసాగింది. 4 హాఫ్ సెంచరీలు, 64 అత్యధిక స్కోరుతో 43.75 సగటుతో 350 పరుగులు చేయగలిగాడు.

ఫిక్సింగ్ ఆరోపణలు

మార్చు

మనోజ్ దేశప్రియతోపాటు 2023-08-29పానదుర క్రికెట్ క్లబ్, కలుతర ఫిజికల్ కల్చర్ క్లబ్ మధ్య జరిగిన దేశవాళీ ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా దుష్ప్రవర్తన కారణంగా చమర సిల్వా 2017 సెప్టెంబరు నుండి అన్ని రకాల క్రికెట్ నుండి రెండేళ్లపాటు నిషేధించబడ్డాడు. 2017 జనవరిలో జరిగిన ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచ్‌లో పాణదుర జట్టు అసాధారణ స్కోరింగ్ రేట్ చేసిన తర్వాత పాణదుర క్రికెట్ క్లబ్ కెప్టెన్ చమర సిల్వా మ్యాచ్ ఫిక్సింగు ఆరోపణలకు దోషిగా నిర్ధారించబడ్డాడు. [10][11]

మూలాలు

మార్చు
  1. "Chamara Silva profile and biography, stats, records, averages, photos and videos".
  2. St. John's vs Royal Panadura clash will be interesting Archived 16 మార్చి 2013 at the Wayback Machine
  3. St John's and Panadura Royal clash on March 15 and 16 Archived 15 మార్చి 2013 at the Wayback Machine
  4. "1st Round, Colombo, Aug 17 2004, Twenty-20 Tournament". ESPN Cricinfo. Retrieved 2023-08-29.
  5. "Cricket: Mixed opinions on Provincial tournament". Sunday Times (Sri Lanka). 26 March 2018. Archived from the original on 2018-03-27. Retrieved 2023-08-29.
  6. "All you need to know about the SL Super Provincial Tournament". Daily Sports. 26 March 2018. Archived from the original on 2018-03-27. Retrieved 2023-08-29.
  7. "SLC Super Provincial 50 over tournament squads and fixtures". The Papare. Retrieved 2023-08-29.
  8. "Squads, Fixtures announced for SLC Provincial 50 Overs Tournament". The Papare. 2023-08-29. Retrieved 2023-08-29.
  9. "India v Sri Lanka 2006-07". Cricinfo. 2008-10-16. Retrieved 2023-08-29.
  10. Weerasinghe, Damith (2017-09-16). "Chamara Silva suspended; Local match fixing verdict released". Retrieved 2023-08-29.
  11. "Chamara Silva banned for two years from cricket". ESPNcricinfo. Retrieved 2023-08-29.