చర్ఖీ దాద్రి జిల్లా

హర్యానా లోని జిల్లా

హర్యానా రాష్ట్రంలోని 22 జిల్లాల్లో చర్ఖీ దాద్రి జిల్లా ఒకటి. 2016 నవంబరు 16 న ఈ జిల్లాను ఏర్పరచారు. జిల్లా ముఖ్య పట్టణం చర్ఖీ దాద్రి. [1] ఈ జిల్లా హర్యానాలో దక్షిణ భాగంలో ఉంది

చర్ఖీ దాద్రి జిల్లా
హర్యానాలో జిల్లా స్థానం
హర్యానాలో జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంహర్యాణా
ముఖ్య పట్టణంచర్ఖీ దాద్రి
Time zoneUTC+05:30 (IST)

చరిత్ర మార్చు

బ్రిటిష్ కాలంలో మార్చు

బ్రిటీష్ పాలన సమయంలో, చర్ఖీ దాద్రి 575 చదరపు మైళ్ల విస్తీర్ణంతో, ఏటా రూ .1,03,000 ఆదాయం కలిగిన సంస్థానం. 1857 నాటి తిరుగుబాటులో, మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జఫర్‌కు పేరుకే విధేయత చూపిన దాద్రి నవాబు బహదూర్ జంగ్ ఖాన్, బ్రిటిష్ వారికి లొంగిపోయాడు. 1857 నవంబరు 27 న అతన్ని ఢిల్లీలో సైనిక కోర్టు మార్షల్ విచారణ చేసింది. అతన్ని లాహోర్‌కు తరలించారు. ఫుల్కియన్ రాజవంశానికి చెందిన జింద్ సంస్థానపు రాజు స్వరూప్ సింగ్‌ 1857 యుద్ధంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి చేసిన సేవలకు గుర్తింపుగా బ్రిటిషువారు దాద్రిని అతనికి బహూకరించారు.

1874 మేలో, అతని వారసుడు రాజా రఘుబీర్ సింగ్ జింద్‌పై యాభై గ్రామాల ప్రజలు తిరుగుబాటు చేశారు. కాని రాజు తిరుగుబాటును అణచివేసాడు. తిరుగుబాటులో పాల్గొన్న మూడు ప్రధాన గ్రామాలు, చర్ఖీ, మంకావాస్, జోజు లను తగలబెట్టించాడు.

జిల్లా ఏర్పాటు మార్చు

2016 నవంబరు 16 న హర్యానా రాష్ట్ర ప్రభుత్వం చర్ఖీ దాద్రిని రాష్ట్రం లోని 22 వ జిల్లాగా అధికారికంగా ప్రకటించింది. [2] [3]

పరిపాలనా విభాగాలు మార్చు

2018 డిసెంబరు నాటికి, జిల్లాలో 2 ఉప విభాగాలు (చర్ఖీ దాద్రి, బాద్రా ), 2 తహసీళ్ళు (చర్ఖీ దాద్రి, బాద్రా), ఒక ఉప తహసీలు (బాండ్ కలాన్) ఉన్నాయి. [2] [1]

జనాభా వివరాలు మార్చు

2001 భారత జనాభా లెక్కల ప్రకారం, [4] చర్ఖీ దాద్రి జనాభా 44,892. ఈ సంఖ్య చర్ఖీ దాద్రి జిల్లాలోని ఇతర పట్టణాలు, గ్రామాల జనాభాను మినహాయించింది.

జిల్లా ప్రముఖులు మార్చు

  • ఫోగట్ సోదరీమణులు : గీతా ఫోగట్, బబితా కుమారి, ప్రియాంక ఫోగట్, రితు ఫోగట్, వినేష్ ఫోగట్, సంగీతా ఫోగట్, వీరందరూ మహావీర్ సింగ్ ఫోగట్ (తండ్రి) వద్ద శిక్షణ పొందారు.
  • హుకమ్ సింగ్, హర్యానా మాజీ ముఖ్యమంత్రి.
  • కిరణ్ షియోరన్, ధనశ్రీ గ్రామానికి చెందిన దాద్రి జిల్లాకు చెందిన మొదటి భారత ఆర్మీ కమిషన్డ్ లేడీ ఆఫీసర్ (మ . 2017 మార్చి 11).
  • అతేలా కలాన్ కు చెందిన ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటిబిపి) లో మొదటి అసిస్టెంట్ కమాండెంట్ ( 2017 నవంబరు 29) శ్రీ దినేష్ కుమార్ సంగ్వాన్.

మూలాలు మార్చు

  1. 1.0 1.1 "Charki Dadri notified as 22nd district of Haryana". The Times of India. 5 December 2016.
  2. 2.0 2.1 Charkhi Dadri creation.
  3. Notification of new district charki Dadri issued; Publication: Business Standard newspaper; Published: 3 December 2016; Accessed: 6 March 2017
  4. "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 2004-06-16. Retrieved 2008-11-01.