వినేశ్ ఫోగట్

వినేశ్ ఫోగట్ (జననం 25 ఆగస్టు 1994) భారత కుస్తీ క్రీడాకారిణి. ఆమె కజిన్లు గీతా ఫోగట్బబితా కుమారిలు అంతర్జాతీయ స్థాయి కుస్తీ  క్రీడాకారిణులు. ఆమె 2014 కామన్ వెల్త్ క్రీడల్లో భారతదేశం తరఫున  కుస్తీ క్రీడలో బంగారు పతకం గెలుచుకున్నారు. వినేశ్ కజిన్లు గీతా, బబితా కూడా కామన్ వెల్త్ క్రీడల్లో బంగారు పతకాలు గెలుచుకున్నవారే.

Vinesh Phogat receives Arjuna Award in 2016.jpg

వ్యక్తిగత జీవితం, కుటుంబంసవరించు

మాజీ జాతీయ స్థాయి కుస్తీ క్రీడాకారుడు మహావీర్ సింగ్ ఫోగట్  తమ్ముడు రాజ్ పాల్ కుమార్తె వినేశ్. ఆమె కజిన్లు గీతా ఫోగట్, బబితా  కుమారిలు అంతర్జాతీయ స్థాయి కుస్తీ క్రీడాకారిణులు. వారి స్ఫూర్తితోనే వినేశ్ కుస్తీ క్రీడలోకి అడుగుపెట్టారు.[1][2]

వినేశ్, ఆమె కజిన్లు కుస్తీ క్రీడ ఆడటాన్ని హర్యానాలోని వారి గ్రామ  ప్రజలు మొదట్లో ఒప్పుకోలేకపోయారు. ఆడపిల్లలకు కుస్తీలో  శిక్షణనిస్తున్నందుకు వినేశ్ పెద్దనాన్న మహావిర్ ను, తన కుమార్తెను శిక్షణ ఇప్పిస్తున్నందుకు ఆమె తండ్రి రాజ్ పాల్ నూ గ్రామస్థులు   దాదాపుగా వెలివేశారు. కానీ వారి సంఘ్ నియమాలకు వ్యతిరేకంగా వినేశ్ పెద్దనాన్న, తండ్రులు ఆమెకు, ఆమె కజిన్లకు కుస్తీలో శిక్షణ ఇస్తూ వచ్చారు.[3]

కెరీర్సవరించు

2013 ఏషియన్ కుస్తీ చాంపియన్ షిప్స్సవరించు

ఢిల్లీలో జరిగిన పోటీలో మహిళల ఫ్రీస్టైల్ 51కేజీ విభాగంలో కాంస్య  పతకం గెలుచుకున్నారు. థాయిలాండ్కు చెందిన థో-కేవ్ శ్రీప్రపపై  పోటిలో 3:0 తేడాతో కాంస్య పతకం గెలిచారు.

మూలాలుసవరించు

  1. "Vinesh wins gold, with help from her cousin". The Indian Express. 30 July 2014. Retrieved 30 July 2014. Italic or bold markup not allowed in: |publisher= (help)
  2. "Meet the medal winning Phogat sisters".
  3. "I Am A Girl, I Am A Wrestler | Tadpoles". Tadpoles (in ఇంగ్లీష్). 2014-07-24. Archived from the original on 2015-11-23. Retrieved 2015-11-02.