చర్చ:అమెరికా సంయుక్త రాష్ట్రాలు

తాజా వ్యాఖ్య: దారి మార్పు టాపిక్‌లో 2 సంవత్సరాల క్రితం. రాసినది: Getsnoopy

అమెరికా అంటే తెలుగు వాళ్లు సాధారణంగా అమెరికా దేశాన్నే వ్యవహరిస్తారు. ఇంత ప్రసిద్ధ పేరు దారిమార్పు చేయటం బాగోలేదు --వైజాసత్య 07:43, 10 జూన్ 2007 (UTC)Reply

అంగ్ల వికీపీడియాలో చాలా చర్చ జరిగింది. ఆంగ్ల వికీలో అలా చేశారని ఇక్కడ కూడా హైదరాబాదు (భారతదేశం) లాంటివి సృష్టించటం అసమంజసం --వైజాసత్య 07:48, 10 జూన్ 2007 (UTC)Reply
ఔను, అమెరికా అనగానే ముందు తలపుకు వచ్చేది అమెరికా దేశమే. ఈ పేజీని అమెరికా దేశానికి ఉంచి, అమెరికా ఖండాలు పేజీకి లింకును ఆ పేజీలో పైన రాయాలి. __చదువరి (చర్చరచనలు) 17:18, 10 జూన్ 2007 (UTC)Reply
ఊ ఊ ఊ నేను వ్రాసిన సహాయ వాక్యాలు తరలింపువల్ల పోయాయి..ఊ ఊ అనుబంధ చర్చ కూడా తరలింపు జరగాలి--మాటలబాబు 23:14, 21 జూన్ 2007 (UTC)Reply
ఆంగ్ల వికీ నుండి రాష్ట్రాల మూస ను తెస్తే అనువదించడం తేలిక అవుతుంది కదా--మాటలబాబు 21:26, 21 జూన్ 2007 (UTC)Reply

ఆంగ్ల వికీ నుండి రాష్ట్రాల మూస ను తెస్తే అనువదించడం తేలిక అవుతుంది కదా--మాటలబాబు 21:26, 21 జూన్ 2007 (UTC)Reply

అమెరికన్ ప్రెసిడెంట్స్ పేర్లు వెబ్ సైట్ ఇందులో చేర్చండి. వీలుని బట్టి తెలుగు లిపిలో రాస్తాను. హెడ్డింగ్ పెడితే , అక్కడ ఈ పేర్లు రాస్తాను. http://www.whitehouse.gov/about/presidents Talapagala VB Raju 03:09, 17 జూన్ 2010 (UTC)Reply

దారి మార్పు

మార్చు

@Chaduvariగారు, మీరు "చర్చకు స్పందించలేదు" అని వ్రాసారు. చర్చ ఎక్కడైంది? ఈ లేఖ చర్చ పుటలో నాకు కనబడలేదు. జరిగింది జరిగినా, ఇక్కడ విషయం ఏమిటంటే దేశం పేరు "అమెరికా" కాదు. ఖండం పేరు అమెరికా, ఇంకా అందులో ఉన్న దేశం పేరు సంయుక్త రాష్ట్రాలు. దీంట్లో చర్చ చేయాల్సిన విషయం ఏంటో నాకు తెలీదు ఎందుకంటే ఈ తథ్యము ఎవరైనా వెతికి తెలుసుకోవచ్చు – ఐక్యరాజ్య సమితిలో ఈ రాజ్యాని అధికారిక పేరు "United States of America" అంటే "అమెరికావి సంయుక్త రాష్ట్రాలు". మీకు ఎక్కడా దేశం పేరు అధికారికంగా "America" అని కనిపియదు. ముందు చూపించిన ఐక్యరాజ్య సమితి పత్రములో స్థూలాక్షరాలలో వ్రాసిన పేర్లు ఆ ఆ దేశాల అసలు అధికారిక చిన్న పేర్లు. దాంట్లో మీకు స్పష్టంగా కనిపిస్తుంది "United States" అనే పదాలు ఉన్నాయి, "America" అనై పదం కాదు. అదే విధానంగా వేరే దేశాల పేర్లు చూస్తే వాటి చిన్న పేర్లు అందరికి తెలిసిన వాడుక పేర్లతో కలుస్తాయి – Bangladesh, Ukraine, ఇంకా భారత దేశాని "India" కూడా. దీనితో మీకు అర్థం అవుతుంది ఈ దేశాని పేరు "అమెరికా" కాదని. ప్రస్తుతం ఈ పుట పేరు ఎవరో గూగుల్ ద్వారా అనువదించినట్లు ఉంది. Getsnoopy (చర్చ) 05:21, 11 మే 2022 (UTC)Reply

@Getsnoopy గారూ, దీనికి సమాధానం రాయడం మరచిపోవడంతో ఆలస్యమైంది.
మీరు ఇలాంటి దారిమార్పులు ఇదొక్కటే కాదు, ఇంకా కొన్ని చేసారు. వాటికి సంబంధించి మీతో చర్చించినపుడు ఆయా పేర్లకు మూలాలు చూపించమంటే చూపించలేదు మీరు. ఉదా: జశ్వంత్ సింగ్/"జస్వంత్ సింహ" మన్మోహన్ సింగ్/"మన్మోహన్ సింఘ్". అలాగే ఇది. అందుకే తరలింపులో అలా రాసాను.
పోతే, ఇక్కడ చర్చ "అమెరికా" కరెక్టా, "అమెరికా సంయుక్త రాష్ట్రాలు" అనేది సరైనదా అని కాదు. ఏది ఖండమో ఏది కాదో అనేది కాదిక్కడీ చర్చ. కాబట్టి దాని గురించి మాట్టాడకండి.
ఇక్కడి చర్చ ఏమిటంటే.. "అమెరికా సంయుక్త రాష్ట్రాలు" సరైనదా, "అమెరికావి సంయుక్త రాష్ట్రాలు" సరైనదా అనేది. "యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా" ను "అమెరికావి సంయుక్త రాష్ట్రాలు" అని తెలుగు తెలిసిన వారెవరూ అనరు. ఈ పేజీని తరలించకముందు చర్చించని దానికి కారణం ఇది కూడా. ఎక్కడైనా అన్నారేమో చూపించండి. __ చదువరి (చర్చరచనలు) 02:01, 20 మే 2022 (UTC)Reply
చదువరి గారి అభిప్రాయలతో ఏకీభవిస్తున్నాను.@Getsnoopy గారు చేసిన దారిమార్పులు సముచితంగా లేవు. జశ్వంత్ సింగ్/"జస్వంత్ సింహ" మన్మోహన్ సింగ్/"మన్మోహన్ సింహ", అమెరికా సంయుక్త రాష్ట్రాలు/ "అమెరికావి సంయుక్త రాష్ట్రాలు" దారిమార్పులలో "జస్వంత్ సింహ", "మన్మోహన్ సింహ","అమెరికావి సంయుక్త రాష్ట్రాలు" అనే పదాలు తెలుగువాడిగా నేను ఎక్కడా వినలేదు, చదువుకోలేదు. సందిగ్దంగా ఉన్న ఇలాంటి పదాలు లేదా శీర్షికలు చర్చకు పెట్టటం మంచిదికానీ, మనకు తోచినట్లు ఏకపక్షంగా చేయటం శ్రేయస్కరం కాదు. యర్రా రామారావు (చర్చ) 04:30, 20 మే 2022 (UTC)Reply
@Chaduvariగారు, ఆ వేరే పుటల సంగతి పక్కన పెడదాము. వాటికి కూడా ఎక్కడ చర్చ కాలేదు నాకు తెలిసినంతవరకు, కాని వాటికి కూడా నేను సాక్షాలు ఆలోచనలు ఇవ్వగలను ఇంకెక్కడైనా.
ఈ విషయానికొస్తే, ఇక్కడ ఖండం పేరేంటో అనేది ముఖ్యమే ఎందుకంటే అది వ్యాకరణంతో సంబంధించింది, ఇంకా అది అర్థం చేసుకున్నాకే ఈ విషయానికి రావచ్చు. ఆంగ్లంలో "of" అనే పదానికి రెండు అర్థాలున్నాయి – ఒకటి "చెందిన" అనే అర్థం, ఇంకొకటి "అనే" అనే అర్థం. మొదటి అర్థానికి ఒక ఉదాహరణ "The cities of Telangana" – తెలుగులో దీన్ని "తెలంగాణాకి చెందిన నగరాలు" లేదా "తెలంగాణావి నగరాలు" అని వ్రాయొచ్చు. రెండో అర్థానికి ఒక ఉదాహరణ "The state of Telangana" – తెలుగులో దీన్ని "తెలంగాణా అనే రాష్ట్రం" లేదా "తెలంగాణా రాష్ట్రం" అని వ్రాయొచ్చు. దీంతో మనము అర్థం చేసుకోవచ్చు రెండిటిని. ఇలా "United States of America" ని తెలుగులో "అమెరికా సంయుక్త రాష్ట్రాలు" అని అనువదిస్తే దాని అర్థం మొత్తానికి మారిపోతుంది (దేశం పేరు "అమెరికా" ఇంకా ఆ దేశం సంయుక్త రాష్ట్రాలతో కూడి ఉందని), వాస్తవికంగా తప్పు అవుతుంది, ఇంకా దీన్ని ఎవరో గూగుల్ ద్వారా అనువాదం చేసినట్టు ఉంటుంది. ప్రపంచంలో ఏ దేశం పేరు అధికారికంగా "అమెరికా" అని లేదు. నేను పైన వ్రాసాను ఆ దేశాని అధికారిక పేరేంటో – అది "United States", "America" కాదు. "United States of America" అంటే అమెరికా (ఖండాని) కి చెందిన ఒక దేశం ఇంకా ఆ దేశం పేరు "సంయుక్త రాష్ట్రాలు" అని. ఐతే ఈ అర్థాన్ని సంక్షిప్తంగా వ్రాస్తే "అమెరికావి సంయుక్త రాష్ట్రాలు" అని వ్రాయాలి. Getsnoopy (చర్చ) 04:50, 25 మే 2022 (UTC)Reply
Return to "అమెరికా సంయుక్త రాష్ట్రాలు" page.