చర్చ:కైకాల సత్యనారాయణ
తాజా వ్యాఖ్య: 4 సంవత్సరాల క్రితం. రాసినది: రవిచంద్ర
రెండు పేజీలు ఎందుకు
మార్చుకైకాల సత్యనారాయణ నటించిన సినిమాలు వాడుకరి:రవిచంద్ర గారు, రెండు పేజీలు ఎందుకు ఒక్క నటునికి వివరించగలరు తెలియక అడుగుతున్నాను. ప్రభాకర్ గౌడ్ నోముల 06:43, 6 ఆగస్టు 2020 (UTC)
- వాడుకరి:ప్రభాకర్ గౌడ్ నోముల గారూ, సత్యనారాయణ గారు చాలా సీనియర్ నటులు. 750కి పైగా చిత్రాల్లో నటించారు. అవన్నీ కైకాల సత్యనారాయణ వ్యాసంలో రాస్తే వ్యాసం మొత్తం సినిమాల జాబితానే నిండిపోతుంది. కానీ మన ఉద్దేశ్యం అది కాదు. వ్యాసం సత్యనారాయణ గారి గురించి అన్ని వివరాలను పేర్కొనాలి. అందుకని ఆయన నటించిన ముఖ్యమైన సినిమాల జాబితాను వ్యాసంలో ఉంచి మిగతా సినిమాలను జాబితా వ్యాసంలోకి మార్చాను. ఇలాంటి జాబితా వ్యాసాలే ఇతర ప్రముఖ నటులకోసం సృష్టించబడటం మీరు చూసిఉండవచ్చు. మీ అనుమానం నివృత్తి అయిందనుకుంటాను. ఇంకా ఏమైనా సందేహాలుంటే అడగండి. - రవిచంద్ర (చర్చ) 06:55, 6 ఆగస్టు 2020 (UTC)