చర్చ:జైపూర్ (రాజస్థాన్)

తాజా వ్యాఖ్య: విలీనం గురించి టాపిక్‌లో 1 సంవత్సరం క్రితం. రాసినది: Chaduvari

విలీనం గురించి మార్చు

చదువరి గారూ ఈ వ్యాసం జైపూర్ వ్యాసంలో విలీనం చేయాలనే ఉద్ధేశ్యంతో విలీనం మూస కూర్పు చేసారు.కానీ ఈ వ్యాసం వికీ డేటా లింకు పరిశీలించగా City Palace, Jaipur అనే ఆంగ్ల వ్యాసానికి కలుపబడింది.దీని శీర్షిక తప్పుగా ఉందనుకుంటాను.దీనిని జైపూర్ ప్యాలెస్ లేదా జైపూర్ రాజభవనం ఈ రెండిటిలో ఒకదానిని ప్రధాన శీర్షికగా సవరించి, రెండవది దారిమార్పు చేస్తే సరిపోతుందని నా అభిప్రాయం.ఈ వ్యాసం జైపూర్ (రాజస్థాన్) దీనికి వేరే వికీడేటా లింకు ఉంది. ఇది జైపూర్ జిల్లా ముఖ్యపట్టణ వ్యాసం.దీని విలీనం మూస తొలగిస్తే సరిపోతుంది.కాకపోతే ( జైపూర్ ) ఇంత పెద్ద వ్యాసం రాసారు,కానీవిచిత్రమేమిటంటే ఒక్కటంటే ఒక్క మూలం ఉంటే ఒట్టు. మనకు మంత్రసానితనం ఒప్పుకున్నాక తప్పుదు కదా? మీ అభిప్రాయం, సూచనలు, నిర్ణయం తెలుపగలరు.--యర్రా రామారావు (చర్చ) 11:50, 8 జనవరి 2021 (UTC)Reply

యర్రా రామారావు గారూ! శీర్షిక తప్పు కాదు సార్, ఎన్వికీ లింకు తప్పు. ఈ రెండు వ్యాసాలూ ఒకే విషయానికి - జైపూర్ నగరానికి - సంబంధించినవే. "జైపూర్ (రాజస్థాన్)" ను తీసుకెళ్ళి "జైపూర్" లో విలీనం చేసి, జైపూర్ (రాజస్థాన్) ను దారిమార్పుగా చెయ్యాలి. ఆ తప్పు అంతర్వికీ లింకును తీసేసాను. __చదువరి (చర్చరచనలు) 12:10, 8 జనవరి 2021 (UTC)Reply
మరొక జైపూర్ (ఒడిశా) రాష్ట్రంలో ఉంది.జైపూర్ (రాజస్థాన్) అనే ఉండాలనుకుంటాను. యర్రా రామారావు (చర్చ) 12:05, 20 ఫిబ్రవరి 2021 (UTC)Reply
జైపూర్ అనే ఉంచేస్తే సరిపోతుందనుకుంటాను. మిగతా వాటితో పోల్చినపుడు ఏది ప్రధానమైన పేరో దానికి ఆ పేరు ఉంచడం, మిగతా వాటిని క్వాలిఫై చెయ్యడమనేది సంప్రదాయం. జైపూర్‌లలో రాజస్థాన్ లోని జైపూర్ అన్నిటికంటే ప్రసిద్ధమైనది కాబట్టి దాఇకి జైపూర్ అని ఉండవచ్చు. ఆదిలాబాదు జిల్లాలోనిది, ఒరిస్సా లోనిదీ దానితో పోలిస్తే తక్కువ ప్రసిద్ధి చెందినవి.
పోతే.., ఒరిస్సా లోని జైపూర్‌కు జేపూర్ అని జయపూర్ అనీ కూడా పేర్లున్నాయి. అది సంస్థానంగా ఉన్నరోజుల్లో దాన్ని జయపురం సంస్థానం అనే వారు. పరిశీలించండి. __ చదువరి (చర్చరచనలు) 15:45, 20 ఫిబ్రవరి 2021 (UTC)Reply

జైపూర్ వ్యాసం తెంలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాదు జిల్లాకు చెందిన జైపూర్ మండలంలోని జైపూర్ గ్రామంగా 2006 ఏప్రిల్ 19న ప్రారంభించారు. ఇది గ్రామవ్యాసంగా ప్రారంభమైనప్పటికీ 2019 జూలై 8 న కిన్నర అరవింద్ గారు గ్రామ వ్యాసం స్థానంలో రాజస్థాన్ లోని జైపూర్ వ్యాసాన్ని అనువదించి సృష్టించి ఈ వ్యాసంలో చేర్చారు. ఈలింకు చూడండి. 2019 జూలై 26న యర్రా రామారావు గారు ప్రస్తుత మాచిర్యాల జిల్లాలోని జైపూర్ వ్యాసాన్ని మరలా సృష్టించారు. 2008 డిసెంబరు 24న అహ్మద్ నిసార్ సృష్టించిన జైపూర్ (రాజస్థాన్) వ్యాసాన్ని సుజాత గారు అభివృద్ధి చేసారు. ,వ్యాసం సృష్టించడానికి ముందుగా అదే వ్యాసం వికీ వ్యాసంగా ఉన్నదా? లేదా? అని పరిశీలించిన తదుపరి వ్యాసం సృష్టించాలి. కానీ అలా జరగలేదు. కనుక జైపూర్ (రాజస్థాన్) వ్యాసం సరియైనది. అందులో తర్వాత సృష్టించబడిన విస్తరించబడిన జైపూర్ వ్యాసాన్ని విలీనం చేయాలి.➤➤ కె.వెంకటరమణచర్చ 10:52, 20 జూన్ 2022 (UTC)Reply

వెంకటరమణ గారూ బాగా ఒపికతో నిశితంగా పరిశీలించి నందుకు ధన్యవాదాలు.దీనికి చాలా పెద్ద కథే ఉంది.మొట్టమొదట నేను 2017 లో వికీలో సవరణలు చేపట్టినప్పుడు ఈ వ్యాసంలో మొదటి సవరణ ఈ లింకులో చూపిన ప్రకారం నేను చేసాను. 2019 జనవరి 10 న అజయ్ బండి గారు తెలంగాణ రాష్ట్రంలోని జైపూర్ మండల వ్యాసం సృష్టించారు.ఆ వ్యాసం మండలంలోని గ్రామాలు విభాగంలో జైపూర్ అనే గ్రామ వ్యాసానికి ఈ లింకు జైపూర్ (ఒరిజనల్ గా ఇది గ్రామ వ్యాసమే, కానీ మధ్యలో కిన్నెర అరవింద్ గారు చేసిన తప్పిదం వలన ఈ వ్యాసం పూర్తి రూపాంతరం మారింధి) కలపబడింది. తరువాత నా పరిశీలనలో నేను ఇది గ్రామ వ్యాసం కాదని జైపూర్ (మంచిర్యాల జిల్లా) అని పరిశీలించగా పేజీ లేదని నిర్థారించుకుని 2019 జులై 26న మరలా గ్రామ వ్యాసం సృష్టించుట జరిగింది.జైపూర్ గ్రామ వ్యాసం సృష్టించినప్పుడు గ్రామం క్యాలిపై చేయకుండా సృష్టించినందున కూడా ఈ గంధరగోళం ఏర్పడింది.వీటని తగిన విధంగా సవరించాల్సిన అవసరం ఉంది. ఇందులో చదువరి గారు స్పందించవలసిందిగా కోరుచున్నాను. యర్రా రామారావు (చర్చ) 11:44, 20 జూన్ 2022 (UTC)Reply
@యర్రా రామారావు గారూ, జైపూర్ (రాజస్థాన్) వ్యాసం లోకి జైపూర్ వ్యాసాన్ని విలీనం చెయ్యాలనే అభిప్రాయం పట్ల నాకు అభ్యంతరమేమీ లేదు. విలీనం తరువాత దాన్ని "జైపూర్" కు తరలించాలని నా అభిప్రాయం. ఎందుకంటే ప్రధానమైన వ్యాసాన్ని ఆ పేరుతో ఉంచి, మిగతావాటిని క్వాలిఫై చెయ్యాలని నేను భావిస్తున్నాను. పరిశీలించండి. __ చదువరి (చర్చరచనలు) 13:02, 20 జూన్ 2022 (UTC)Reply
Return to "జైపూర్ (రాజస్థాన్)" page.