చర్చ:పాములపర్తి వెంకట నరసింహారావు
పి.వి.గారి లాన్టి వారి గురిన్ఛి వ్రాసె అప్పుడు వారు అని వుపయొగిన్ఛాలి. ఉన్నాడు, ఛెసాడు అని రాయకుడదు.యెక వఛనమ్ లొ వ్రాయకుడదు. అలా వ్రాస్థె అధి వ్రాసె వారి అగ్నానన్ని తెలియజెస్థున్ది. గమనిన్ఛన్డి.
పి.వి. గారిని వరంగల్ జిల్లా ప్రముఖుల పేజీ లో తప్పుగా చేర్చారు. ఆయన కరీంనగర్ కు చెందిన వారు.కావున నేను మారుస్తున్నాను.
పీవీ నర్సింహారావు ఎక్స్‌ప్రెస్ వే
మార్చుఈ వ్యాసంలో "పీవీ నర్సింహారావు ఎక్స్‌ప్రెస్ వే" విభాగము అవసరం లేదనుకుంటా. పీవీ గారి పేరున్నంత మాత్రాన ఆ ఎక్స్‌ప్రెస్‌వే కు పీవీకి ఎలాంటి సంబంధం లేదు. కాకుంటే గుర్తింపులు విభాగంలో "హైదరాబాదులో నిర్మించిన దేశంలోనే అతిపొడవైన ఫ్లైఓవర్‌కు పీవీగా పేరుపెట్టార"ని ఒక వాక్యం మాత్రం వ్రాయవచ్చు. ఎక్స్‌ప్రెస్ గురించి వివరణకై సమాచారం లభిస్తే ప్రత్యేక పేజీ పెట్టవచ్చు.-- C.Chandra Kanth Rao-చర్చ 19:01, 19 అక్టోబర్ 2009 (UTC)
చంద్రకాంత్ గారితో ఏకీభవిస్తున్నాను. -- Navamoini 20:44, 19 అక్టోబర్ 2009 (UTC)
ఇన్నయ్య చెప్పిన విశేషాలు
మార్చు సహాయం అందించబడింది
ఇన్నయ్య చెప్పిన విశేషాలు అనే శీర్షిక అనవసరం. వాటిని తగిన శీర్షికల క్రిందకు చేర్చేసి మూలాల్లో ఇన్నయ్య పేరు ఇస్తే సరిపోయేదానికి ప్రత్యేకమైన శీర్షిక పెట్టడం ఎందుకు? ఎబ్బెట్టుగా ఉంది. నేనే తీసివేద్దును కానీ అంత సమాచారం ఒక్కపెట్టున తొలగించడం ఎందుకని సహసభ్యుల్ని అడుగుతున్నాను.--పవన్ సంతోష్ (చర్చ) 13:26, 11 నవంబర్ 2014 (UTC)
- పవన్ సంతోష్ గారూ, మీరు చేయాలనుకున్నది సరైన పని. ఇన్నయ్య గారు వారి బ్లాగులో వివిధ ప్రముఖులతో పరిచయాలను తమ బ్లాగులో వ్రాశేవారు. కొంతమంది అవి యధాతధంగా ఎత్తివ్రాశారు. నేను కొన్నివ్యాసాల్లో వాటిని వ్యాసంలో కలుపుతూ వ్రాశాను. ఇంగ్లీషులో ఇలాంటివాటిని anecdotes అంటారు ఇలాంటి కాంటెక్స్టు లేని పొడిపొడి వాక్యాల వళ్ళ మేగజిన్ పాఠకుల గాసిప్ దాహం తీరుతుంది కానీ ఆ వ్యక్తి వళ్ళ పెద్దగా లోతుగా తెలియదు. అందులోనూ ఇవి ఒక వ్యక్తి (ఇన్నయ్య గారు) ధృక్కోణం నుంచి వస్తున్నాయని గమనించి చాలా జాగ్రత్తగా వ్యాసంలో సమకూర్చాలి. --వైజాసత్య (చర్చ) 23:40, 28 నవంబర్ 2014 (UTC)
- థాంక్సండీ. అలా చేశాను. వాటిలో నరసింహారావు వ్యాసానికి పనికివచ్చే విశేషాలు తక్కువ కనుక తీసివేశాను.--పవన్ సంతోష్ (చర్చ) 11:11, 29 నవంబర్ 2014 (UTC)