విడుదలకు ముందు సినిమా గురించి వ్రాయవచ్చునా?

మార్చు

ఇంకా విడుదల కాని సినిమాల గురించి రాయడం అంత ఉచితం కాదనిపిస్తుంది. వికీపీడియా ప్రకటన మాధ్యమం కాదు. విడుదలైన తర్వాత పేజీ తయారుచేస్తే ఆ సినిమా చూచి ఆనందించినవారు వివిధ విషయాలను అక్కడ చేర్చవచ్చును. మరోలా భావించకండి.Rajasekhar1961 07:30, 30 మే 2009 (UTC)Reply

మీరు చెప్పినది సరియైనదే. తెవికీ నియమాలను నేను అతిక్రమించదలచుకోలేదు. మరోలా భావించట్లేదు. ఇకపై ఇలా జరగదు. sasi 07:49, 31 మే 2009 (UTC)Reply
వికీ నియమాలను పాటించడానికి వీరా సంసిద్ధత చాలా సంతోషం. కాని రాజశేఖర్ అభిప్రాయంతో నేను విభేదిస్తున్నాను. ఏ వ్యాసాన్నయినా నిరాధారంగా వ్రాయకూడదు. ప్రకటనగా అసలు వ్రాయకూడదు. ఇది విడుదలైన సినిమాలకు, విడుదల కాని సినిమాలకు, ఇతర వ్యాసాలకు కూడా వర్తించే నియమం. ఆ సంగతి అలా ఉంచితే సినిమా విడుదలయ్యేంతవరకూ వ్యాసాలు వ్రాయకూడదని నేను అనుకోవడం లేదు. కొన్ని ఉదాహరణలు- కురుక్షేత్రం (సినిమా), జల్సా వంటి సినిమాలకు విడుదలకు ముందే మీడియాలో పెద్దయెత్తున కవరేజి లభించింది. ఆ విషయాలు వికీలో కూడా వ్రాయవచ్చును. విడుదలకు ముందు "సినిమా కధ, సినిమా సమీక్ష" వంటివి వ్రాయడం అనుచితం. కాని ఆ "సినిమా గురించి" వ్రాయవచ్చుననుకొంటున్నాను. బాగా తెలిసిన సభ్యులెవరైనా ఈ విషయమై క్లారిఫికేషన్ ఇస్తే ఉపయోగకరంగా ఉంటుంది. --కాసుబాబు 17:23, 31 మే 2009 (UTC)Reply
ఏది ప్రచారం, ఏది ప్రచారం కాదు అనేదానికి ఖచ్చితమైన సరిహద్దంటూ ఏమీ లేదు. విడుదల కాని సినిమాల వ్యాసాలు వ్రాయడమే ప్రచారం కాదు, ఒక విధంగా చూస్తే విడుదలైన సినిమాలు కూడా ప్రచారం కిందకు వస్తాయి. ఈ విధంగా రెండో దృష్టిలో చూస్తే ప్రతీదీ ప్రచారం కిందికే వస్తుంది. రాజకీయ పార్టీల, రాజకీయ నాయకుల వ్యాసాలు కూడా ప్రచారం అనుకోవచ్చు, అలాంటప్పుడు వీటన్నింటినీ తొలిగించలేము కదా! మళ్ళీ మొదటికి వస్తే సినిమా కథ, సినిమా సమీక్ష వ్రాయకున్నా (విడుదలకు ముందే సినిమా కథ తెలుసుకోవడం కష్టమే) ప్రచారం కిందికే వస్తుంది. సినిమా గురించిన ప్రకటనలలో కూడా సినిమా కథ, సమీక్ష ఉండదని మనకు తెలుసు. ఇక మొత్తం దృష్టితో ఆలోచిస్తే ప్రస్తుతమున్న ఈ వ్యాసంలో ఒక ఇన్ఫోబాక్స్ మాత్రమే ఉంది. కాబట్టి దాన్ని అంతగా పట్టింకోనవసరం లేదని నా అభిప్రాయం. ఎందుకంటే ఈ వ్యాసం చూసి సినిమా చూడాలని ఆసక్తి పెంచుకుంటారని అనుకోలేము. కేవలం సినిమా అంశంపైనే కాకుండా అన్ని అంశాలపై "ప్రచారం" గురించి మనం ప్రత్యేకంగా చర్చించవలసిన అవసరం ఉంది. భవిష్యత్తులో దీనిపై వాదోపవాదాలు జరుగకుండా ఇప్పటినుంచే దృష్టి పెట్టాలి. -- C.Chandra Kanth Rao-చర్చ 17:56, 31 మే 2009 (UTC)Reply
  • వికీ నిబంధనల గురించి నాకు అంత లోతుగా తెలియదు. నేను ఒక సామాన్యమైన సభ్యునిగా తోచిన సలహా ఇచ్చాను. ఈ వ్యాసాన్ని తొలగించనవసం లేదు. చిత్రం విడుదలైన తరువాత విస్తరించవచ్చును.Rajasekhar1961 04:55, 1 జూన్ 2009 (UTC)Reply
విడుదలకు ముందు సినిమాల గురించి వ్రాయటంలో అభ్యంతరమేమీ లేదు. విడుదలకు ముందే ఫలానా ఇతివృత్తంపై ఈ సినిమాను తీస్తున్నామని చాలామంది దర్శక నిర్మాతలు చెప్పుకుంటూనే ఉంటారు. అలాంటివి ఆధారాలతో వ్రాయవచ్చు. "ఇదో అద్భుతమైన చిత్రం ఫలానా తేదీ విడుదలౌతుంది, ఖచ్చితంగా చూడదగిన చిత్రం" వంటి అభిప్రాయాలు లేకపోతే చాలు. --వైజాసత్య 17:43, 3 ఆగష్టు 2009 (UTC)
Return to "మగధీర" page.