జల్సా 2008 లో త్రివిక్రం శ్రీనివాస్ దర్శకత్వంలో విడుదలైన సినిమా. పవన్ కల్యాణ్, ఇలియానా ఇందులో ముఖ్యపాత్రల్లో నటించారు.

జల్సా
(2008 తెలుగు సినిమా)
దర్శకత్వం త్రివిక్రమ్ శ్రీనివాస్
నిర్మాణం అల్లు అరవింద్
కథ త్రివిక్రమ్ శ్రీనివాస్
చిత్రానువాదం త్రివిక్రమ్ శ్రీనివాస్
తారాగణం పవన్ కళ్యాణ్,
ఇలియానా
సంగీతం దేవీశ్రీ ప్రసాద్
సంభాషణలు త్రివిక్రమ్ శ్రీనివాస్
ఛాయాగ్రహణం కే.వి. గుహన్,
రసూల్ ఎల్లోర్
కూర్పు ఎ.శ్రీకర్ ప్రసాద్
నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

చదువులో ఎంతో చురుకుగా ఉండే సంజయ్ సాహు (పవన్ కళ్యాణ్), తన క్లాస్ మేట్ ఇందు (కమలినీ ముఖర్జీ)ని పెళ్ళి చేసుకోవాలని అనుకుంటాడు. పోలీసు అధికారి అయిన ఇందు తండ్రి (ప్రకాష్ రాజ్) ఇందుని ఒక ధనిక సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కి ఇచ్చి పెళ్ళి చేస్తాడు. కొంతకాలం తర్వాత స్నేహితురాళ్ళైన జ్యోత్స్న (పార్వతి మెల్టన్), భాగమతి (ఇలియానా) లు ఇద్దరూ సంజయ్ ని ప్రేమిస్తారు. ఎంతో తెలివైన జో అంటే సంజయ్ ఇష్టపడక పోగా అమాయకురాలైన భాగీ సంజయ్ మెప్పును పొందటానికి ప్రయత్నిస్తూ ఉంటుంది.

ఒక ప్రక్క దామోదర రెడ్డి (ముకేష్ రిషి) అనే భయంకర ఫ్యాక్షనిస్టు సంజయ్ కొరకు మనుషులతో వెదికిస్తూ ఉంటాడు. సంజయ్ స్నేహితుడు (ఆలీ) ని ఎరగా వేసి అతనిని బంధించాలి అని పథకం వేస్తాడు దామోదర రెడ్డి. ఆ నేపథ్యంలో తన స్నేహితులకు సంజయ్ ఒక మాజీ నక్సలైట్ అని తెలుపుతాడు. తన చిన్న నాటే గుండె జబ్బుతో సోదరుని కోల్పోయిన సంజయ్, ఎదిగిన తర్వాత తల్లిదండ్రులని కూడా కోల్పోవటంతో నక్సలైట్లలో కలుస్తాడు. నక్సలిజం సమస్యలకి పరిష్కారం కాదు అని తెలుసుకున్న సంజయ్ జనజీవన స్రవంతిలో కలిసిపోయి విద్యాభ్యాసం సాగిస్తూ ఉంటాడు.

భాగమతి ఇందు చెల్లెలే అని సంజయ్ కి తెలుస్తుంది. భాగమతిని తన కుమారుడు (శివాజీ) ని వివాహమాడేలా ఎత్తుగడ వేస్తాడు దామోదర రెడ్డి. తన రెండవ కుమారుడి హత్యకి కారణం అయినందువల్లనే దామోదర రెడ్డి తన కోసం వెదికిస్తున్నాడని తెలుసుకున్న సంజయ్ అతడిని ఎలా ఎదుర్కొన్నాడన్నదే చిత్రం ముగింపు.

తారాగణం

మార్చు

సంభాషణలు

మార్చు
  • బెదిరింపుకి భాష అక్కర లేదు
  • సిగ్గు లేక కాదు సార్, ఇన్ ఫర్మేషన్ లేక, ఇన్ ఫర్మేషన్ ఉంటే ఇవన్నీఎందుకు చేస్తాం?
  • ఏదో కంట్రోల్ లో పెడదామని రెండు మూడు దెబ్బలేస్తే ఏడుపులు, పెడబొబ్బలు, డొమెస్టిక్ వయొలెన్స్, TV9
  • వీడి పర్సు కొట్టేసినా వీడు బిల్లెలా కడతాడో తెలుసుకోవాలంటే చూస్తూనే ఉండండి, నిరంతర వార్తాస్రవంతి, TV9
  • పంటకి పురుగు పట్టకుండా మందు చల్లాడు, పని చేయలేదు, తను తాగాడు, పనిచేసింది.
  • నేను కూడా మార్గదర్శిలో చేరాను. ఒక గన్ను కొనుక్కున్నాను.
  • నాకెప్పుడూ తొందర, పది నిముషాల ముందర, అందుకే నా జీవితమంతా చిందరవందర
  • యుద్ధంలో గెలవడమంటే శత్రువును చంపటం కాదు శత్రువును ఓడించటం.

విశేషాలు

మార్చు

పాటల వివరాలు

మార్చు

ఈ చిత్రం లోని పాటలు విడుదలైన రోజు నుండి విశేష ప్రేక్షకాదరణ పొందినవి.

  • సరిగమ పదనిసా - (గానం: బాబా సెహగల్) (రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి)
  • మై హార్ట్ ఈజ్ బీటింగ్ - (గానం: కె.కె) (రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి)
  • యు & ఐ - (గానం: దేవిశ్రీ ప్రసాద్)
  • చలోరే చలోరే చల్ (తెలుగు) - (గానం: రంజిత్) (రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి)
  • జెన్నిఫర్ - (గానం: బెన్ని, ప్రియా) (రచన: రామజోగయ్య శాస్త్రి)
  • గాల్లో తేలినట్టుందే - (గానం: టిప్పు, గోపిక పూర్ణిమ) (రచన: భాస్కరభట్ల)
  • చలోరే చలోరే చల్ (హింది) - (గానం: దేవిశ్రీ ప్రసాద్) (రచన: రాక్విబ్ అలాం)
"https://te.wikipedia.org/w/index.php?title=జల్సా&oldid=4375848" నుండి వెలికితీశారు