చర్చ:ముస్లిములపై అకృత్యాలు

తాజా వ్యాఖ్య: తొలగించండి టాపిక్‌లో 15 సంవత్సరాల క్రితం. రాసినది: Kumarrao
ఈ వ్యాసాన్ని మెరుగుపరచడంలో భాగంగా, వ్యాసంలో బొమ్మ(లు) చేర్చమని కోరడమైనది. బొమ్మలు ఎక్కించడంలో సహాయం కోసం ఈ పేజీ చూడండి.

హిందువులపై అకృత్యాలు వ్యాసాన్ని లాక్ చేసినట్లే ఇలాంటి ముస్లిములపై అకృత్యాలు, క్రైస్తవులపై అకృత్యాలు మొదలైన వ్యాసాలను కూడా లాక్ చేయమని వినతి. అనామకులు వీనిలో సమాచారాన్ని రాయడానికి వీలులేకుండా చేయండి. మూలాలు తప్పకుండా తెలపాల్సి ఉండేవిధంగా.Rajasekhar1961 09:01, 13 డిసెంబర్ 2008 (UTC)

వ్యాసం కొంచెం ముందుకు సాగనీయండి. మొదలుపెట్టినవారు ఒక షేపుకు తెచ్చిన తరువాత గానీ సరైన చర్య గురించి పరిశీలించడం సాధ్యం కాదు. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 09:14, 13 డిసెంబర్ 2008 (UTC)
  • ఇలాంటి ప్రత్యేకమైన వ్యాసాల విషయంలో వ్యక్తులు వికీపీడియాలో రిజిస్టర్ చేసుకోవాలని ఇవికీలో చాలా కఠినంగా ఉన్నాయి. ఇక్కడ నేను వ్యక్తుల్ని రిజిస్టర్ చేసుకోమనే అభ్యర్ధిస్తున్నాను.Rajasekhar1961 09:18, 13 డిసెంబర్ 2008 (UTC)
ఇలాంటి వ్యాసాలు సృష్టించేబదులు, 1947 లో జరిగిన దేశ విభజన వ్యాసం వ్రాసి, కొందరు నికృష్టుల వలన మన అవిభాజ్యదేశం ఎలా ముక్కలైందో, ఆ సమయాన హిందూ, ముస్లిం, సిక్కులు, అమాయక ప్రజలు దారుణంగా వధింపబడ్డారో, నేటికీ కాందిశీకులుగా, వలసలు చేసి దుర్భర జీవితాలు గడిపారో గడుపుతున్నారో వ్రాసి, దేశ ప్రజల కళ్ళు తెరిపించాలి. కాశ్మీర్ కాష్టం రగిల్చి, అమాయకుల ప్రాణాలు తీసి, నేటికీ 'కాశ్మీర్ పుండు' ఆరకుండా వుంచి, దేశాన్ని అతలాకుతలం చేసి, అశాంతిని రేకెత్తిస్తున్నవారి అసలు రంగును బయటపెట్టి, ప్రజలను చైతన్యవంతులను చేయుట అతిముఖ్యం.నిసార్ అహ్మద్ 12:26, 14 డిసెంబర్ 2008 (UTC)

మూలాలు

మార్చు

తెలుగు వికీలో ఆంగ్ల వికీనే మూలంగా ప్రకటించడం తగదు. ఆంగ్ల వికీ మూలాలు యధాతథంగఅ కాపీ చెయ్యాలి. రచయితలకు మనవి. రవిచంద్ర(చర్చ) 13:11, 14 డిసెంబర్ 2008 (UTC)

తొలగించండి

మార్చు
  • ఒక మతం హత్యల్ని మరొకరు ఎత్తి చూపే వ్యాసాలు వికీలో వద్దు.అన్ని మతాలలో హింస ఉంది. మతచరిత్రల్లోని హంతక ఆధ్యాయాలను వదిలి మంచిని మానవత్వాన్ని బోధించే సంఘటనలను పేర్కొనాలి. ఈ వ్యాసం తొలగించండి--Nrahamthulla 03:29, 22 మే 2009 (UTC)Reply
తొలగింపుకు వ్యతిరేకం అభిప్రాయాలు
  • మతపరమైన హింసాత్మక వ్యాసాలు కూడా ఉండాలి. కానీ అవి నిజానిజాల్ని సరైన మూలాలతో తెలియజేసేవిగా ఉండాలి. ఇవి కొందరికి బాధకలిగించినా చరిత్రను యధాతథంగా ఉంచడానికి మనం అందరూ ప్రయత్నించాలి. వ్యక్తిగత అభిప్రాయాలుగా ఉండకూడదని నా అభిప్రాయం.Rajasekhar1961 04:13, 22 మే 2009 (UTC)Reply
ప్రతి నాణేనికి బొమ్మా బొరుసు ఉన్నట్లే ప్రతిదానికి మంచీ, చెడూ రెండూ ఉంటాయి. అయితే కేవలం విమర్శగానే చూడటం మాత్రం సరైనది కాదు. ఇదివరకు ఒక అజ్ఞాత సభ్యుడు కేవలం మతాలను విమర్శించడం కోసమే రచనలు చేస్తున్నప్పుడు మతాలకు వ్యతిరేకంగా వ్యాసాలు వద్దు అని చర్చ తీసినది నేనే. చరిత్రను చూస్తే ప్రతి మతంపై ఇతర మతాల అకృత్యాలు ఉన్న సంగతి వాస్తవమే కావచ్చు, అంతమాత్రాన ఇతర మతాలను విమర్శించడం సమంజసం కాదు. ఇది చాలా సున్నితమైన విషయం అని నేను ఎప్పుడో చెప్పాను. విమర్శ అనేది విమర్శగానే ఉండాలి కాని కక్షతో, పగతో చేసేది/రాసేదిగా ఉండకూడదు. ప్రస్తుతం వ్యాసాలలో ఉన్న వివాదాస్పద మరియు ఆధారంలేని వాక్యాలను తొలిగిస్తే సరిపోతుంది. ఒక మతానిపై కేవలం అకృత్యాలు మాత్రమే కాకుండా ఇతర మతస్థులు చేసే మంచి పనులు కూడా వ్యాసాలలో చేర్చాలి. ఎందుకంటే పరాయి మతస్థులందరూ ఎదుటి మతంపై విమర్శించే వ్యక్తులు కారు. -- C.Chandra Kanth Rao-చర్చ 20:23, 22 మే 2009 (UTC)Reply
  • వ్యాసము తొలగించ వలసిన అవసరము లేదు. ఐతే సంఘటనలకు, విషయములకు సరి మూలములు సూచించవలయును.Kumarrao 04:24, 23 మే 2009 (UTC)Reply
Return to "ముస్లిములపై అకృత్యాలు" page.