చర్చ:మొహమ్మద్ షమీ పై అక్రమ సంబంధాల ఆరోపణలు
దిద్దుబాటు
మార్చు సహాయం అందించబడింది
క్రికెట్ పై నాకు పెద్దగా అవగాహన లేదు. భర్త పట్ల క్రౌర్యం, పురుషులపై హింస దృక్పథంతో వ్యాసం సృష్టించాను. ఈ వ్యాసం విడిగా ఉంచాలా, మొహమ్మద్ షమీ అనే వ్యాసం సృష్టించి విలీనం చేయాలా, నిర్వాహకులు దిశానిర్దేశం చేయగలరు. - శశి (చర్చ) 06:58, 23 మార్చి 2018 (UTC)
- వ్యాసం నిడివి ఎక్కువగానే ఉంది కాబట్టి మొహమ్మద్ షమీ అనే వ్యాసం సృష్టించి దానిలో ఒక విభాగం ఈ అంశాన్ని క్లుప్తంగా రాసి, ప్రధాన వ్యాసంగా దీనికి లింకు ఇస్తే బాగుంటుందని నా అభిప్రాయం. కానీ ఇప్పుడు మహమ్మద్ షమీ గురించి వ్యాసం రాసే వీరుడెవ్వడు? :-) రవిచంద్ర (చర్చ) 09:15, 23 మార్చి 2018 (UTC)
- రవిచంద్రగారూ, వీర శశిధర్ జంగం ఇక్కడ. మన వికీపీడియన్లలో క్రికెట్ గురించి షమీ గురించి తెలిసిన వీరులే లేకుంటే, ఈ కేసులు సమసేలోపు వారు వీరత్వం చూపకపోతే, ఈ వీరుడే క్రికెట్, షమీల గురించి మరింత అధ్యయనం చేసి, సృష్టిస్తాడు - శశి (చర్చ) 11:56, 23 మార్చి 2018 (UTC)
- శశి గారూ, మీ విశ్వాసం ప్రకారం వికీలో ప్రతీ వ్యాసం తయారవుతుంది. మొహమ్మద్ షమీ వ్యాసాన్ని సృష్టించాను. మీరు ఆ వ్యాసంలో వ్యక్తిగత జీవిత విభాగంలోని ప్రవేశించి విషయాలను చేర్చండి. ఈ వ్యాస లింకునుంచండి.--కె.వెంకటరమణ⇒చర్చ 12:12, 26 ఏప్రిల్ 2018 (UTC)
- కె.వెంకటరమణ గారు, ధన్యోస్మి! - శశి (చర్చ) 13:49, 1 మే 2018 (UTC)
- శశి గారూ, మీ విశ్వాసం ప్రకారం వికీలో ప్రతీ వ్యాసం తయారవుతుంది. మొహమ్మద్ షమీ వ్యాసాన్ని సృష్టించాను. మీరు ఆ వ్యాసంలో వ్యక్తిగత జీవిత విభాగంలోని ప్రవేశించి విషయాలను చేర్చండి. ఈ వ్యాస లింకునుంచండి.--కె.వెంకటరమణ⇒చర్చ 12:12, 26 ఏప్రిల్ 2018 (UTC)
- రవిచంద్రగారూ, వీర శశిధర్ జంగం ఇక్కడ. మన వికీపీడియన్లలో క్రికెట్ గురించి షమీ గురించి తెలిసిన వీరులే లేకుంటే, ఈ కేసులు సమసేలోపు వారు వీరత్వం చూపకపోతే, ఈ వీరుడే క్రికెట్, షమీల గురించి మరింత అధ్యయనం చేసి, సృష్టిస్తాడు - శశి (చర్చ) 11:56, 23 మార్చి 2018 (UTC)
ఈ వ్యాసం అవసరమా?
మార్చు- కింది చర్చలో పాల్గొని దీనిపై ఒక నిర్ణయం తీసుకోవడంలో సహకరించండి. చర్చపై నిర్ణయాన్ని ప్రకటించినవారు ఈ మూసను తీసేసి దీని స్థానంలో {{Discussion top}} అనే మూసను, చర్చకు అడుగున {{Discussion bottom}} అనే మూసనూ చేర్చవలసినది.
ఈ వ్యాసాన్ని ఉంచాలా మొహమ్మద్ షమీ వ్యాసంలో విలీనం చెయ్యాలా అని స్వయంగా వ్యాస సృష్టికర్తే అడిగారు. ఈ చర్చను ఐదేళ్ళ తరువాత ఇప్పుడే చూస్తున్నాను.
నా అభిప్రాయం:
- ఇది ఒక సంఘటన గురించిన వ్యాసం. అయితే ఇందులో ఒక ప్రముఖ వ్యక్తికి ప్రమేయం ఉంది కాబట్టి ఇక్కడ రాసాం గానీ, లేదంటే రాసేవాళ్ళం కాదు. ఎందుకంటే కేవలం ఒక సంఘటనగా దీనికి ప్రాముఖ్యత ఏమీ లేదని నా అభిప్రాయం. ఆ ప్రముఖుడికి ప్రమేయం ఉన్నంత మాత్రాన ఈ సంఘటనకు విషయ ప్రాముఖ్యత రాలేదని నా అభిప్రాయం.
- విడిగా ఈ వ్యాసంలో ఉన్న సమాచారంలో అంతగా ప్రాముఖ్యత లేనిది చాలానే ఉంది. ఉదాహరణకు:
- "షమీని సమర్థించిన ఇతరులు" అనే విభాగం అవసరం లేదు. కొద్దిగా రాస్తే సరిపోతుంది.
- అక్రమ సంబంధాలు అనే విభాగంలో నిర్దుష్టమైన ఆరోపణలేమీ లేవు
- గృహ హింస, హత్యా యత్నం, లైంగిక వేధింపులు, మ్యాచ్ ఫిక్సింగ్ వగైరా విభాగాల్లో ఆరోపణలు ఉన్నాయిగానీ మూలాల్లేవు.
మూలాల్లేకపోవడం, స్వల్పప్రాముఖ్యత మాత్రమే కలిగిన సమాచారం ఉండడం.. ఈ వ్యాసాన్ని తొలగించేందుకు హేతువు అని నేను చెప్పడం లేదు. అసలు వ్యాస విషయానికి ప్రాముఖ్యత లేదని నా ఉద్దేశం. ఇక్కడి సమాచారాన్ని క్లుప్తంగా మొహమ్మద్ షమీ వ్యాసంలో చేర్చి దీన్ని తొలగించాలని నా అభిప్రాయం. శశి, @రవిచంద్ర, @వెంకటరమణ గారలు, ఇతరులూ పరిశీలించవలసినది. చదువరి (చర్చ • రచనలు) 09:05, 6 సెప్టెంబరు 2023 (UTC)
- చదువరి గారూ, ఈ వ్యాసానికి విషయ ప్రాముఖ్యత లేదు. ఇందులో మూలాలు లేని సమాచారం ఎక్కువగా ఉంది. ఈ వ్యాసంలో తెలియ జేసిన ఆరోపణలను మొహమ్మద్ షమీ వ్యాసంలో విభాగంగా చేర్చబడింది. కనుక ఈ వ్యాసాన్ని తొలగించవచ్చు.➤ కె.వెంకటరమణ ❋ చర్చ 16:05, 6 సెప్టెంబరు 2023 (UTC)