చర్చ:రేవూరి అనంత పద్మనాభరావు
సాటిలేని మేటి
మార్చుఅవధాన కళకు సంబంధించి పద్మనాభరావు భావాలు-అనుభవాలపై ప్రసిద్ధ ఆంగ్ల పత్రిక 'వీక్' 2013లో ప్రచురించిన సమగ్ర కథనం ఇది. ఇందులో ఆయన ధారణ శక్తి, బహుముఖ నైపుణ్యం, సాహితీ సవాళ్ళను అలవోకగా స్వీకరించే శక్తి సామర్ధ్యాల గురించి అనేక వివరాలున్నాయి. ఆ విభిన్న సాహితీ ప్రక్రియను పలు తెలుగు ప్రాంతాల్లో పద్మనాభరావు దిగ్విజయంగా నిర్వహించిన తీరును ఎన్నో పత్రికలు బహు విధాలుగా ప్రశంసించాయి.ఆయన ఆధ్యాత్మిక పాటవాన్ని ఎంతగానో కొనియాడాయి. 2020-12-22T16:27:55 శరత్ బాబు
క్లుప్తత, మూలాలు అవసరం
మార్చువ్యాసం సుదీర్ఘ పరిచయపత్రం అయిపోయినట్లనిపించింది. వ్యాసాన్ని క్లుప్తీకరించాలి. ఉదాహరణకు రచనలన్నీ పేర్కొనవలసిన అవసరంలేదు. ముఖ్యమైన లేక బాగా పేరువచ్చిన రచనలు పేర్కుంటే చాలు. ఒక్క మూలం కూడా లేకపోవడంతో ఇది అసలు విజ్ఞానసర్వస్వ వ్యాసం కానేరదు. వాడుకరి:శరత్ బాబు, ఇతర సంపాదకులు గమనించి సరిచేయమని కోరుతున్నాను. --అర్జున (చర్చ) 23:26, 3 మార్చి 2021 (UTC)
- వాడుకరి:శరత్ బాబు గారు, మీరు సాక్షి మూలాన్ని చేర్చినందులకు ధన్యవాదాలు. తొలగింపు హెచ్చరికను తొలగించాను. సాధ్యమైనంతవరకు మూలాలు మూడవ వ్యక్తి/సంస్థ ప్రచురించినవైతేనే బాగుంటుంది. ప్రవేశిక, వ్యక్తిగతజీవితం, వృత్తి నేను క్లుప్తీకరించాను. అలా మిగతా వ్యాసాన్ని కుదించండి. --అర్జున (చర్చ) 00:37, 7 మార్చి 2021 (UTC)