చర్చ:సురవరం ప్రతాపరెడ్డి

సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో 2013 సంవత్సరం, 33 వ వారంలో ప్రదర్శించారు.

పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ

Wikipedia
Wikipedia
వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులు ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో తెలుగు ప్రముఖులకు సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
మంచివ్యాసం మంచివ్యాసం ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై మంచివ్యాసం-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)


వికిప్రాజెక్టు తెలంగాణ ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలంగాణలో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో తెలంగాణకు సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
మంచిఅయ్యేది ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై మంచివ్యాసం అవ్వగలిగే-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)


వికీప్రాజెక్టు తెలుగు సమాచారం అందుబాటులోకి ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు సమాచారం అందుబాటులోకిలో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని తెలుగు పుస్తకాలు జాబితా చేసి ఆ పుస్తకాల ద్వారా వికీపీడియాలోని వ్యాసాలు అభివృద్ధి చేయడం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
??? ఈ వ్యాసానికి నాణ్యతా కొలబద్ద ఉపయోగించి ఇంకా విలువ కట్టలేదు.


మాండలిక భాష

మార్చు

చైతన్య గారు, తొలి వ్యాసము ఇంత విస్త్రుతముగా రాయడము అభినందనీయము. వ్యాసములో తెలంగాణా మాండలికము కొన్ని చోట్ల ఉపయోగించినట్లు గమనించాను. వికిపీడియా విజ్ఞాన సర్వస్వము అయినందున ప్రామాణిక భాష (పత్రికల భాష లేదా రేడియో భాష) ఉపయోగించవలెనని మనవి. --వైఙాసత్య 04:36, 16 నవంబర్ 2005 (UTC)

జన్మస్థలం

మార్చు

చైతన్యా!, చక్కటి వ్యాసం రాసారు. ప్రతాపరెడ్డి పుట్టింది అలంపురం తాలూకా లోని బోరవెల్లి అనే గ్రామమని నావద్ద ఉన్న తెలుగు వెలుగులు పుస్తకంలో ఉంది. ఒకసారి మీ సమాచారంతో సరిచూసి అవసరమైతే మార్చండి. __చదువరి 08:21, 16 నవంబర్ 2005 (UTC)

పుట్టింది బోరవెల్లి లోనే కానీ స్వగ్రామము ఇటికలపాడు అని ఈ వ్యాసములో ఉన్నది. --వైఙాసత్య 14:32, 16 నవంబర్ 2005 (UTC)

మాండలిక భాష

మార్చు

వైజాసత్య గారూ!వ్యాసములో తెలంగాణ మాండలికమును గురించి-ఇప్పటి తెలంగాణ కవులు కాని,రచయితలు కాని చాలా మంది తెలంగాణ భాషలోనే రచనలు చేస్తున్నారు.పత్రికలలో కూడా తెలిదేవర భానుమూర్తి వంటివారు తెలంగాణలో రాస్తున్నారు. రెండు జిల్లాలలో మట్లాడే భాష ప్రామాణిక భాష ఎలా అయింది, మిగిలినవి మాండలికాలు ఎలా అయినవి అనేది మనము మొదట అర్థం చేసుకోవాల్సి ఉంది.భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో గుంటూరు,కృష్ణా జిల్లాల వాళ్ళు వివిధ కారణాలవల్ల ఆర్థికంగా,తద్వారా రాజకీయంగా బలపడినందువలన ప్రచారసాధనాలు కూడా సహజంగానే వారి చేతిలోకి వెళ్లినయి.ఇప్పుడు మన రాష్ట్రంలో ఉన్న పెద్ద పత్రికలన్నీ కూడా దాదాపు అలాంటివే.తెలంగాణ లో ప్రస్తుతం పుట్టుకొస్తున్న చిన్న చిన్న పత్రికలలో తెలంగాణ భాష విస్తృతంగా ఉపయోగించబడుతుంది.ఏది ప్రామాణికం,ఏది కాదు అని రుజువు చేయడానికి కాదు ఆ పత్రికలు చేసే ప్రయత్నం.ఎవరి భాషపై వారికున్న గౌరవం,మమకారం వలన ఎవరి భాషని వాళ్ళు నూన్యతాభావం లేకుండా వాడుకునే స్వాతంత్ర్యం ఉండాలని చేసే కృషి.పత్రికలు/పుస్తకాలలో వాడే భాష వాటిలో తప్ప నేను ఎప్పుడూ విని ఎరుగను.పుస్తకాలలో చదివి మాత్రమే దాని వాడుక నాకు తెలుసు.వికిపీడియా వంటి మంచి వేదిక మీద అన్ని మాండలికాలనూ అందరికీ పరిచయం చేసి ఒకరి మాండలికం పట్ల మరొకరికి అవగాహన,గౌరవం పెంచే అవకాశం ఉందని నా అభిప్రాయం. నేను రాసిన దానిలో మాండలికము వలన ఎవరికైనా అర్థం కాని పదాలను ఉపయోగించినట్లు అనుకోవడం లేదు.నేను రాసింది ఈ వెబ్సైట్ ప్రమాణాలకు వ్యతిరేకంగా ఉంటే అది మార్చడానికి ఏ అభ్యంతరమూ లేదు.ధన్యవాదాలు. -చైతన్య

మీ భావాలు నాకు చాలా నచ్చాయి. తెలుగు వికిపీడియాలో ఇంకా భాషా ప్రదమైన ప్రమాణాల గురించి చర్చించలేదు. ఇటువంటి ప్రమాణాలు రూపొందించుటలో మీవంటి సభ్యుల అవసరం ఎంతైనా ఉంది. దీని గురిచి మరింతగా రచ్చబండలో చర్చించుదాము. --వైఙాసత్య 00:09, 17 నవంబర్ 2005 (UTC)

జన్మస్థలం

మార్చు

చదువరీ!మీరు చెప్పిన దానిపైన సరిచుసే ప్రయత్నంలో ఉన్నాను.రెండు,మూడు రోజులలో దాన్ని సరిచూసి మార్చగలను.దానిని ఎత్తిచూపినందుకు ధన్యవాదాలు.ఈలోపు మీకు ఖచ్చితమైన సమాచారం దొరికిన మార్చగలరు. -చైతన్య

ప్రతాపరెడ్డి జన్మస్థలం గురించి సరిచూడగా ఆయన ఇటికాలపాడులోనే జన్మించిండని తెలిసింది.ఐతే అది 'ఇటికాలపాడే ' కాని 'ఇటికలపాడు ' కాదు.నా సమాచార మూలము కూడా తెలియజేయమంటే తెలుపగలను. --చైతన్య 22:41, 1 డిసెంబర్‌ 2005 (UTC)
అవసరం లేదుగాని, తెలుసుకోవాలనే అసక్తి ఉంది. కాబట్టి తెలియజేయగలరు. అలాగే ఈ లింకు కూడా చూడండి. అయితే ఈ పేజీలో ఉన్న టెక్స్టు యూనికోడ్ లోకి మారలేదు, అంచేత మొత్తాన్ని కాపీ చేసి, నాగార్జున గారి పద్మ పేజీ లో పెట్టి సోర్స్ ఎన్కోడింగు శ్రీటెల్0900 ను ఎంచుకోండి. మీకు తెలుగు ప్రత్యక్షం. __చదువరి 23:53, 1 డిసెంబర్‌ 2005 (UTC)
చదువరీ! సురవరం ప్రతాపరెడ్డి జన్మస్థల సమాచారమూలం తెలుపమన్నరు కదా. సురవరం గురించి A.P Information Dept ప్రచురించిన ముద్దసాని రాంరెడ్డి రచించిన పుస్తకం ఈ సమాచార మూలం. అలాగే సురవరం ప్రతాప రెడ్డి memorial trust నుండి కూడా ఇదే సమాచారం అందింది.నేను స్వయంగా కాక ఇంకొకరి ద్వారా ఈ సమాచారం తెలుసుకున్నను. అందుకే మూలం తెలుపడానికి కొంత సమయం పట్టింది.--చైతన్య 15:42, 13 డిసెంబర్ 2005 (UTC)
థాంక్స్, చైతన్యా. __చదువరి 16:18, 13 డిసెంబర్ 2005 (UTC)
Return to "సురవరం ప్రతాపరెడ్డి" page.