చర్చ:హైదరాబాదు రైల్వే స్టేషను

తాజా వ్యాఖ్య: పేరు మార్పు టాపిక్‌లో 5 సంవత్సరాల క్రితం. రాసినది: Hydkarthik

దిన పత్రికలో వచ్చిన వ్యాసాన్ని యధాతథంగా కాపీ చేశారా లేదా కొన్ని ముఖ్యమైన పాయింట్లు మాత్రమే తీసుకున్నారా తెలుపలేదు. అనుమతి లేనిదే యధాతథంగా వ్యాసాన్ని కాపీ చేయడం కాపీుల్లంఘన కిందికి వస్తుంది. అంతేకాకుండా మూలాలు విభాగంలో ఈనాడు దినపత్రికలో వచ్చిన వ్యాసం ఆధారంగా అని వ్రాశారు. కాని ఈ వ్యాసం ఇంతటితో ఆగిపోయేది లేదు. మునుముందు ఇంకెవరైనా ఎక్కడినుంచో సేకరించిన సమాచారం జతచేయవచ్చు. అప్పుడు ఆ సమాచారం కూడా ఈనాడులోనిదే అనుకొనే పరిస్థితి రావచ్చు. కాబట్టి మూలం అనేది వాక్యాలకే ఉండాలి కాని వ్యాసం మొత్తానికి కాదు. -- C.Chandra Kanth Rao(చర్చ) 12:10, 8 అక్టోబర్ 2008 (UTC)

  • కొన్ని ముఖ్యమైనవి మాత్రమే తీసుకున్నాను. తేదీలు, వ్యక్తులు వంటివి. మొత్తం అంతా కాదు. తప్పుగా ఉంటే మార్చండి.Rajasekhar1961 13:10, 8 అక్టోబర్ 2008 (UTC)
తప్పుగా ఉందని కాదు కాని మీరు ముఖ్యమైన వాక్యాలు తీసుకుంటే ఆ వాక్యాల చివరన మాత్రమే రెఫరెన్స్ ఇవ్వండి చాలు. ఈ వ్యాసం ఈనాడు హైదరబాదు డిస్త్రిక్ట్ టాబ్లాయిట్‌లో వచ్చిందనుకుంటా. మా జిల్లా పేపరులో ఈ వ్యాసం రాలేదు కాబట్టి ఈ వ్యాసం నేను చూడలేను. -- C.Chandra Kanth Rao(చర్చ) 13:18, 8 అక్టోబర్ 2008 (UTC)

పేరు మార్పు మార్చు

చదువరి, JVRKPRASAD, చర్చ గారలారా, ఈ పుట పేరును హైదరాబాద్ దక్కన్ అని మార్చాలంటే ఏమి చేయాలి? Hydkarthik (చర్చ) 18:10, 26 మార్చి 2019 (UTC)Reply

హైదరాబాదు దక్కన్ నాంపల్లి రైల్వే స్టేషను అనేది సరైన పదం. మార్చాలంటే పెద్ద విశేషం కాదు. JVRKPRASAD (చర్చ) 01:26, 27 మార్చి 2019 (UTC)Reply
Hydkarthik గారూ, పేజీ పేరును సవరించడం పేజీ పాఠ్యంలోని భాషా సవరణల్లాంటిది కాదు. పేరును సవరించాలంటే పేజీని ఆ కొత్త పేరుకు తరలించాలి. పేజీకి పైన ఉన్న ట్యాబ్‌బార్‌లో "మరిన్ని" అనే ట్యాబు కింద ఉన్న "తరలించు" అనే లింకును నొక్కితే తరలించేందుకు అవసరమైన ఫారము వస్తుంది. ఇక దాని ప్రకారం ముందుకు పోవడమే. ఒక సంగతి.. పేజీని సృష్టించే ముందు ఆచితూచి పేరును ఎంచుకోవాలి, తరలించేముందు కూడా అలానే జాగ్రత్తగా కొత్త పేరును ఎంచుకోవాలి. ఇంకా ఏదైనా సందేహాలుంటే నా చర్చ పేజీలో రాయండి.__చదువరి (చర్చరచనలు) 01:39, 27 మార్చి 2019 (UTC)Reply
JVRKPRASAD గారూ ఐఆర్‌సిటిసి వెబ్‌సైటులో దాని పేరు హైదరాబాద్ దక్కన్ అని ఉన్నది. __చదువరి (చర్చరచనలు) 01:42, 27 మార్చి 2019 (UTC)Reply
చదువరి గారు, మీకు కొన్ని లింకులు ముఖ్యమైనవి ఇస్తాను. దయచేసి చూడండి. (1) [1], (2) [2] (3) [3], (4) బొమ్మలు లోని క్రింద పేర్లు చూడండి. అలాగే మీరు చెప్పిన లింకు ఐఆర్‌సిటిసి వెబ్‌సైటు అనేది రైల్వేలకు అనుబంధ సంస్థ. సరాసరి రైల్వే వారు నిర్వహించరు. ప్రైవేటు వారి భాగంతో సడుస్తుంది అని మాత్రం నాకు తెలుసు. ఇంత పెద్ద పేర్లను వారికి అనుగుణంగా సూక్ష్మంగా కొందరు మార్చుకుంటారు. JVRKPRASAD (చర్చ) 01:57, 27 మార్చి 2019 (UTC)Reply
హైదరాబాదు దక్కన్ నాంపల్లి రైల్వే స్టేషను అనే దానిని ప్రజలు ఎక్కువగా హైదరాబాదు అనే పిలుస్తున్నారు. అలాగే హుజూర్ సాహిబ్ నాందేడ్ రైల్వే డివిజను అనే దానిని నాందేడ్ డివిజను అని మాత్రమే రైల్వేలు గురించి, పనిచేస్తున్నవారు ఎక్కువగా ఈ పేరుతోనే వాడుతున్నారు, వాడుకలో ఉన్నది. దయచేసి ఇతరులు తమ అభిప్రాయం కూడా చెప్పవచ్చును. ప్రజలకు ఎక్కువ అందుబాటులో, వాడుకలో ఉన్న పేరు తప్పులేదని నా అభిప్రాయం మాత్రం చెప్పాను.JVRKPRASAD (చర్చ) 01:57, 27 మార్చి 2019 (UTC)Reply
JVRKPRASAD గారూ, "ప్రజలకు ఎక్కువ అందుబాటులో, వాడుకలో ఉన్న పేరు తప్పులేదని నా అభిప్రాయం మాత్రం చెప్పాను." - మీ ఈ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను. అసలు అలా బాగా వాడుకలో ఉన్న పేరునే పేజీ శీర్షికగా పెట్టాలి. మిగతా పేర్లను దారిమార్పులుగా పెట్టాలి. (రావిశాస్త్రి గా ప్రసిద్ధుడైన రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారి పేజీకి రావిశాస్త్రి పేరు పెట్టడమే సముచితం.) __చదువరి (చర్చరచనలు) 02:47, 27 మార్చి 2019 (UTC)Reply
JVRKPRASAD, చదువరి, చర్చ గారలారా, ఆ రైల్వే స్టేషను యొక్క అధికారిక పేరు "హైదరాబాద్ దక్కన్" మాత్రమే. http://indiarailinfo.com లో మాత్రము దాని పేరును హైదరాబాదు దక్కన్ నాంపల్లి రైల్వే స్టేషను అని తప్పుగ్గా ఇస్తారు. బుక్ చేసుకొన్న టికెట్టుపైకూడా హైదరాబాద్ దక్కన్ అని మాత్రమే ఉంటుంది. అదే విధముగా, నాందేడ్ విషయములో రైల్వే స్టేషను పేరు "హజూర్ సాహిబ్ నాందేడ్" కానీ డివిజను పేరు కేవలము "నాందేడ్" మాత్రమే.Hydkarthik (చర్చ) 16:07, 27 మార్చి 2019 (UTC)Reply
Return to "హైదరాబాదు రైల్వే స్టేషను" page.