చారుకేశి రాగము కర్ణాటక సంగీతంలో ఒక రాగం. ఇది 72 మేళకర్త రాగాల వ్యవస్థలో 26వ మేళకర్త రాగము.[1] ముత్తుస్వామి దీక్షితుల కర్ణాటక సంగీత పాఠశాఅలలో ఈ రాగాన్ని "తరంగిణి" అని పిలుస్తారు. ఈ రాగాన్ని వినేవారికి కరుణ రసాన్ని, భక్తిభావాన్ని రేకెత్తిస్తుంది.

Charukesi
ఆరోహణS R₂ G₃ M₁ P D₁ N₂ 
అవరోహణ N₂ D₁ P M₁ G₃ R₂ S
సమానార్ధకాలుAeolian dominant scale
చారుకేశి scale with Shadjam at C

రాగ లక్షణాలు

మార్చు

ఆరోహణ: స రి గ మ ప ధ ని స
C D E F G G# A# C
అవరోహణ: స ని ధ ప మ గ రి స
C A# G# G F E D C

ఈ రాగంలోని స్వరాలు : చతుశ్రుతి రిషభం, అంతర గాంధారం, శుద్ధ మధ్యమం,పంచమము, శుద్ధ ధైవతం, "కైశికి నిషాదం". ఈ సంపూర్ణ రాగం లో ఏడు స్వరాలు ఉంటాయి.

ఉదాహరణలు

మార్చు

ఈ రాగంలోని కొన్ని ప్రసిద్ధిచెందిన రచనలు.

  • ఆడమోడిగలదే - త్యాగరాజు కీర్తన
  • కృపయా పాలయ శౌరే- స్వాతీ తిరునాళ్
  • లక్ష్యగీతం శ్రీరాజద్గుణ రూపకం, వేంకటముఖి

త్యాగరాజు రచించిన ఆడమోడి గలదే, పాపనాశం శివన్ రచించిన కరుణై వరూమో, స్వాతి తిరునాళ్ రచించిన కృపాయ పాలయ సౌరే అనేవి చారుకేశి రాగంలోని ప్రాచుర్యం పొందిన కృతులు. ప్రముఖ వాయులీన కళాకారుడు, స్వరకర్త లాల్గుడి జయరామన్ చారుకేశి రాగంలో "ఇన్నం ఎన్ మనం" అనే ముఖ్యమైన వర్ణాన్ని స్వరపరిచాడు. ఇది కర్ణాటక సంగీత కళాకారుడు మహారాజపురం సంతానంకు ఇష్టమైనది. ఈ పాటతొ కచేరీలను ప్రారంభించేవాడు. ముత్తుస్వామి దీక్షితులు తరంగిణి రాగంలో స్వరపరచిన "పాలయమాం పరమేశ్వరి" కీర్తన చారుకేశి రాగానికి ఉదాహరణ. అతను "మాయే త్వం యాహి" అనే కీర్తనను కూడా స్వరపరిచాడు.

తెలుగు సినిమా పాటలు

మార్చు
క్రమ సంఖ్య రాగం సినిమా పాట చిత్రం గాయకుడు
1 చారుకేశి భలి భలి భలి భలి దేవా మాయాబజార్
2 చారుకేశి ఈ పగలు రేయిగ పండు వెన్నెలగ సిరిసంపదలు
3 చారుకేశి ఎంత మంచి దానవోయమ్మా కన్నతల్లి
4 చారుకేశి ఎవరో ఈ నవ నాటక సూత్ర పెళ్ళి చేసి చూడు
5 చారుకేశి రేపల్లె వచ్చెను వేణువు వచ్చెను

వనమెల్ల వచ్చేనురా....

నీ రాక కోసం నిలువెల్ల కనులై[2]

శారద పి.సుశీల
6 చారుకేశి పాడనా ప్రభు పాడనా ఘంటశాల
7 చారుకేశి రాగం తానం పల్లవి[3] శంకరాభరణం బాలసుబ్రహ్మణ్యం
8 చారుకేశి వంశీ కృష్ణ యదు వంశీ కృష్ణా వంశవృక్షం
9 చారుకేశి ఊరేది పేరేదీ ఓ రాజమకుటం


మూలాలు

మార్చు
  1. Ragas in Carnatic music, డా॥ఎస్.భాగ్యలక్ష్మి రచన, ప్ర.సం.1990, సీబీహెచ్ పబ్లిషర్స్
  2. "saradha movie review". www.sbdbforums.com. Retrieved 2020-07-30.
  3. "S.P. Balasubrahmanyam Ragam Thanam Pallavi lyrics - official". www.paroles-musique.com. Retrieved 2020-07-30.