చిత్రదుర్గ

కర్ణాటక రాష్ట్రం లోని చిత్రదుర్గ జిల్లా లోని నగరం

చిత్రదుర్గ, నగరం బళ్ళారినుండి షిమోగా, దావణెగెరే వెళ్ళు మార్గంలో, బళ్ళారినుండి 125కి.మీ దూరంలో ఉంది.అలాగే బెంగళూరు-దావణేగెరె (బెంగళూరు-పుణె జాతీయరహదారి-4) రాస్తాలో, బెంగుళూరుకు 210కి.మీ దూరంలో ఉంది. బళ్ళారి-బెంగళూరు రహదారిలో బళ్ళారికి 105 కి.మీ దూరంలో చళ్ళెకెరే అను పట్టణం నుండి 20కి.మీ.దూరంలో ఈ నగరం ఉంది. ఈ నగరం పేరుమీదనే జిల్లా ఉంది. ఈ నగరానికి వెలుపల వున్న, పెద్దపెద్ద గ్రానెట్‌ బండలు (రాళ్ళు) వున్న, కొంచెం నిలువుగా వున్న కొండలను (గుట్ట) కలుపుచూ పెద్దరాళ్లతో కట్టిన గోడలతో 'చిత్రదుర్గ కోట' ఉంది. ఈ కోట చిత్రమైన కోట విన్యాసం కలిగి వుండటం వలన 'చితుర దుర్గ, చిత్రకళా దుర్గ' అని అంటారు. చిత్రదుర్గను కల్లినకొటే (కన్నడలో' కల్లు' అనగా రాయి అని అర్ధం) అనియు, ఉక్కుదుర్గం, ఏడు గోడలదుర్గం (కోట) అని కూడా పిలువబడుతుంది.

Chitradurga
chinmuladri
City Municipal Council
Historic temple in Chitradurga
Historic temple in Chitradurga
Nickname: 
Fort City (Kote Nadu)
Chitradurga is located in Karnataka
Chitradurga
Chitradurga
Coordinates: 14°14′N 76°24′E / 14.23°N 76.4°E / 14.23; 76.4
Country India
StateKarnataka
RegionBayaluseeme
DistrictChitradurga
Established1465
Founded byThimmanna Nayaka
Government
 • TypeCity Municipal Council
 • Member of ParliamentA Narayanaswamy[1]
విస్తీర్ణం
 • Total64.11 కి.మీ2 (24.75 చ. మై)
Elevation
732 మీ (2,402 అ.)
జనాభా
 (2021)
 • Total3,30,234
Demonym(s)Durgan, Durgans, Durgadavaru
Languages
 • OfficialKannada
Time zoneUTC+5:30 (IST)
PIN
577501, 577502, 577524
Telephone code08194
Vehicle registrationKA-16
Websitehttps://chitradurga.nic.in

పేరువెనుక చరిత్ర

మార్చు

మహాభారతంలో భీముడు, హిడింబాసురుడు ఒకరిపై ఒకరు యుద్ధ సమయంలో విసురుకున్నరాళ్ళు అవి అని అక్కడివాళ్ళ నమ్మకం.ఒక్కోరాయి ఒక్కో ఆకారంతో చిత్రవిచిత్రాలుగా కనిపిస్తాయి.అక్కడి దుర్గం పేరు అందుకే "చిత్రదుర్గ" అయింది

పురాతన చరిత్ర

మార్చు

పురాతత్వశాఖవారికి సామాన్యశక పూర్వం 3వ శాతాబ్బికి చెందిన అవశేషాలు లభించాయి.

ఇతిహాసిక కథనం

మార్చు

ఈ దుర్గానికి చెందిన గుట్టలతో మహాభారత చరిత్ర""ముడుపడివున్నది.దుర్గానికి చెందిన ఈ కొండల(గుట్ట)లో 'హిడింబ'అనే అసురుడు,'హిడింబి'అనే అతని సోదరి నివసించెవారు. హిడింబాసురుడు కౄరస్వభావం కలిగివుండి,ప్రజలను హింసిస్తూ, నరభక్షణ చేసెవాడు. అతని సోదరి హిడింబి సాత్విక స్వభావంకల్గివుండెది. పాండురాజు పుత్రులైన పాండవులు జూదంలో ఓడి పోయి, రాజ్యంతో పాటు సర్వసంపదలను,చివరికి ద్రౌపదినికూడా ఒడ్డి ఓడిపోయి, సుయోధనునితో చేసుకున్నఒప్పందం ప్రకారం 12 ఏళ్ల వనవాసంచేస్తూ, తమతల్లి కుంతితోపాటు ఇక్కడికి వచ్చినప్పుడు, హిడింబుడు పాండవులను ఎదిరింస్తాడు.భీమునితో జరిగిన పోరాటంలో హతుడవ్వుతాడు. తదనంతరం భీముడు సాత్వికగుణంకలిగిన హిడింబిని,తనతల్లి , సోదరులకోరిక మేరకు పెళ్ళాడతాడు.ఈ దంపతులకు జన్మించినవాడే""ఘటోత్కచుడు.అర్జున-సుభద్రల పుత్రుడుఅయిన అభిమన్యుడు ఇష్టపడిన శశిరేఖను ఆమె తండ్రి, శ్రీ కృష్ణుని సోదరుడైన బలరాముడు, శశిరేఖను ధుర్యోధనుని కుమారుడైన లక్ష్మనకు ఇచ్చి కళ్యాణానికి సిద్దమవ్వగా, శ్రీ కృష్ణుని సహకారంతో అభిమన్యు-శశిరేఖలపిళ్ళిజరిపిస్తాడు. ఘటొత్కచుడు తన తండ్రిలా బలపర్క్రామాలు కలిగివుండటమే కాక, తన తల్లి వైపునుంచి సంక్రమించిన అసుర మాయవిద్యలలో ఆరితేరినవాడు.భారత సంగ్రామ సమయంలో ఘటొత్కఛుడు తన అసురమాయవిద్యతో కౌరవసేనను కకాలవికంచేయ్యగా, పాపుపోని రారాజు కర్ణునుని ఎలాగైనా ఘటొచ్కతున్ని సంహరించమని వేడుకొనగా, కర్ణుడు ఇంద్రుని నుండి పొందిన, అర్జునున్ని సంహరించటానికై దాచివుంచిన 'శక్తి'అస్త్రాన్ని ఘటొత్కచునిపై ప్రయోగించి సంహరిస్టాడు.ఆవిధంగా ఘటొత్కచుడు భారత యుద్ధంలో తన ప్రాణాన్ని అర్పించి, తనపినతండ్రి ప్రాణదాతగా నిలిచాడు.

 
చిత్రదుర్గ పట్టణం.కోట నుండి దృశ్యం.
 
చిత్రదుర్గ కోట.
దస్త్రం:Chitradurga -raghavendramatam.JPG
చిత్రదుర్గ రాఘవేంద్ర మఠం.
 
చిత్రదుర్గలోని రాతి ఇసురురాయి (తిరగలి).
 
చిత్రదుర్గ దీపస్తంభం.

చరిత్ర

మార్చు

బ్రహ్మగిరి వద్ద లభించిన ఆశోకునికాలం నాటి రాతిశాసనాన్నిబట్టి, ఈ దుర్గం మౌర్యసామ్రాజ్యంలోని సామంతరాజ్యమని తెలుస్తున్నది. మౌర్యపలనకాలంలో ఈ దుర్గాన్ని రాష్ట్రకూటులు, చాళుక్యులు, హయసులులు పాలించినట్లుగా తెలుస్తున్నది. అయితే విజయనగరసామ్రాజ్యపలన కాలంలో, పాలెగాండ్లు (Paleyagars) లేదా 'నాయకర్లు'అనబడు పాలకుల వంశపాలనలో ఈ వగరం మంచిప్రాభల్యంసంతరించుకున్నది.విజయనగర చక్రవర్తి, 'తిమ్మననాయక్' అనే సైన్యాధిపతి (chieftain) యుద్ధాలలో కనపర్చిన ప్రతిభ, సేవలకు, అతనిని చిత్రదుర్గ పాలకునిగా (governor) నియమించాడు.విజయనగరసామ్రాజ్యపతనానంతరం ఈ దుర్గాన్ని స్వత్రంత రాజ్యంగా ప్రకటించుకున్నారు. తిమ్మననాయకర్కుమారుడు అయిన ఒబన నాయక/ మదుకరనాయక్ ( 1588) లో గద్దెనెక్కిపాలన ప్రారంభించిన తదుపరి క్రమంగా ఈ ప్రాంతంలో చిత్రదుర్గ పాలకుల ప్రాభల్యం పెరిగింది. మధుకరనాయకుని కుమారుడు కస్తూరి రంగప్ప (1602 ) తండ్రి తదనంతరం గద్దెనెక్కాడు.ఇతనికాలంలో పాలనకొంతమేరకు శాంతియుతంగా సాగినది. కస్తూరిరంగప్పకు సంతానం లేక పోవడం వలన, అతని దత్తపుత్రుడు రాజ్యాధికారంలోకి వచ్చినప్పటికి, 'దళవాయుల' తిరుగుబాటు వలన పదవిచ్యుతుడు అయ్యాడు. అతని తరువాత మదకరినాయకుడు II సోదరుడు చిక్కన్న నాయకుడు పాలన బాధ్యతలు స్వీకరించాడు (1676).ఆ తురువాత అతనిసోదరుడు 1686లో 'మదకరినాయక III' పేరుతో రాజ్యాధికారాన్ని చేచిక్కించుకున్నాడు.కాని తిరిగి అతని పాలనను దళవాయిలు వ్యతిరేకించడం వలన, వారికి దూరపు బంధువైన 'బ్రమ్మప్ప నాయకుడు 'అధికారంలోకి (1689) లోకి వచ్చాడు. ఇతనిపాలనలోనే 'నాయక్‌'లపాలన గణతికెక్కి, ప్రాభల్యం పొందినది. నాయక్‌పాలకులలో పాలానాదక్షుడుగా పీరుపొందాడు.తదనంతరం హిరి మదకరినాయక్‌ IV (1721, కస్తూరి రంగప్ప నాయక్‌ II (1748, మదకరినాయక్‌ v (1758) చిత్రదుర్గను పాలించినప్పటికి, వారి పాలన అంతగా చెప్పుకోవలనిన స్ధాయిలో లేదని తెలుస్తున్నది. 1779 లో హైదర్‌ఆలి, అతనికుమారుడు టిప్పు సుల్తానుతో జరిగిన యుద్ధంలో మదకరినాయక్‌ v ఓడిపోవడంవలన చిత్రదుర్గ హైదర్‌ఆలి వశమైనది. తదనంతరం టిప్పిసుల్తాను బ్రిటీషు వారిచేతిలో ఓడిపొయ్యిన పిమ్మట 'చిత్రదుర్గ' మైసూరుకు చెందిన ఒయల్‌కుటుంబపాలనలోకి వెళ్ళినది.

చిత్రదుర్గ కోట

మార్చు

పెద్ద గ్రానైట్‌బండలను కలిగివున్న కొండలను (గుట్టలను) కలుపుతూ వర్తులాకారంగా కోట గోడలనిర్మాణం జరిగింది. ఏడు రాతితో కట్టిన గోడలను కలిగివున్నది. కోట మొదటి కూట గోడకు చుట్టు బయటి వైపున పెద్దకందకం వున్న్నది.కోటలోనికి ప్రవేశించటానికి 18 కోట గుమ్మాలు, 38 వెనుక ప్రవేశ ద్వారాలున్నాయి.ప్రస్తుతం వీటిలో చాలా శిథిల స్ధితిలో ఉన్నాయి.కోట గుమ్మాల తలుపులు తొలగిం పబడినవి. కోట గోడలు కూడా అక్కడక్కడ శిథిలమైనవి. అత్యవసర పరిస్ధితులలోకోటలోనికి రహస్యంగా వెళ్ళూటకు కొన్నిరహస్యమార్గాలు ఉన్నాయి.ఈ రహస్య మార్గాలు సహజంగా కొండరాళ్ల మధ్యనుండు ఖాళీల, చీలికలద్వారా ఏర్పాటు చేసారు.కొండలఎతైన శిఖరభాగన పహర కోటబురుజులను ఏర్పాటు చేసారు. ఈ బురుజులనుండి నలువైపుల 4-6కి.మీ దూరం వరకు కపిస్తుంది. అందు వలన శత్రుసేనలరాకను ముందస్తుగా గమనించి అప్రమత్తులగుటకు వీలున్నది.రెండవ కోట గోడను దాటిన తరువాత నూనె బావి (ఎన్నెకొలె) ఉంది. బవుశా ఇందులో నూనెను నిల్వ వుంచే వారెమో. రాతిని తొలచి, పిద్దతొట్టిలా చేశారు. దుర్గం యొక్క గూడల పైభాగం వెడల్పుగా వుండి నలుగురైదుగు నడిచేలా ఉన్నాయి.కొన్నిగోడలపైభాగంన దాగివుంది తుపాకు లను ప యోగించెలా కట్టడాలు న్నాయి. గోదలు కొన్నిచోట్ల 20-25 అడుగులఎత్తు (పల్లంగావున్నచోట, కొండబండల (రాళ్ళ) మీద15-20అడుగులఎత్తు ఉన్నాయి.నాల్గవ కోట దాటినతరువాత మొడటగా గణపతి ఆలయంవున్నది.ఈ ఆలయం గర్భగుడి ఒక పెద్ద బండరాయిని దాపు చేసుకునివున్నది. కోటగోడలుకూడా చాలా మేరకు శ్శిథిలమై ఉన్నాయి. గోడలను దాటుకొని లోపలికి వెళ్లగానే విశాలమైన బయలు ప్రదేశం దర్శన మిస్తుంది. ఇక్కడనే రాతిదీపస్తంభం, రాతి స్థంబాల ఉయ్యాలకొక్కెలు, వసంతకోనేరు, కొన్నిపాతకట్టడాలు, సిద్ధేశ్వరిదేవి గుడి, కొద్దిదూరంలో మట్టిగోడలతో నిర్మించిన టంకశాల (Mint home) ఉన్నాయి. కొండకు ఒకవైపున చిన్నగుట్టపై లింగేశ్వర ఆలయం ఉంది.ముందుకు వెళ్ళిన విశాలమైన ప్రదేశంలో రాఘవేంద్రస్వామి మఠం ఉన్నాయి. ఈ మరం స్ధంభాలు, పై కప్పు రాళ్లను చెక్కి నిర్మించినవే. ఈ మఠం పక్కనే సిద్ధలింగేశ్వరస్వామి ఆలయం ఉంది. ఈ ఆలయంయొక్క గర్భగుడి, ముందుకుచొచ్చుకు వచ్చిన కొండయొక్కపెద్దరాయిలోపలి భాగంలో వుండి, ఆలయంగోడలుగా ఈ రాయి సహజ సిద్ధంగా మూసి ఉంది.ఈ ఆలయం ముందు పెద్దఆరుగువుండి, పర్వదినాలలో కళాకారులు తమ కళలను ప్రదర్శించెవారు.ఈ ఆలయంలోనే 16 వ శతాబ్దినాటి శిలాశాసనపలకాలు రెండు ఉన్నాయి. ఈ గుడికి వెనుక వైపున రాళ్లతో, పైకప్పుతో సహ సహజసిద్ధంగా ఏర్పడిన కొండగుహాలున్నాయి. పైకప్పురాళ్ళు పద్దప్రమాణంలో వుండి ఒకదానిమీద ఒకటి పేర్చివుండటం విస్మయం గొల్పుతుంది. టంకశాలనుండి దిగువకు వెళ్ళిన అక్కడ అక్కా-చెల్లెల్ల (అక్కా-తంగి) చెరువులున్నాయి. కొండలపైన కురిసిన నీరు ఈ రెండుచెరువులలో చేరువిధంగా కాల్వలున్నాయి. అక్కచెరువు నిండిన తరువాత నీరు అలుగు ద్వారాచెల్లెలు చెరువులు ప్రవహించును. రెండుచెరువులు నిండిన తరువాత నీరు కొండ దిగువకు పారేటట్లు నిర్మించారు. 'అక్క'చెరువుకు ఎదురుగా వున్న గుట్టపై వేణుగోపాలస్వామి దేవాలయం ఉంది. మరొకవైపున్ననునుపైన ఉపరితలం వున్న పెద్ద బండరాయి యుతమైన కొండపైన కోట బురుజు ఉంది. దీన్నిని అతిప్రయాసమీద పర్యాటకులు ఎక్కవలెను.ఈ చెరువుకు మూడోవైపున రాజభవనాలు, ఆయుధనిల్వగిడ్డంగులు, వాటికి వేరువగా కాపలాగార్ల బంకరులున్నాయి. రాజభవనాలు పూర్తిగా జీర్ణించిపొయ్యి, కేవలం పూనాదులు కన్పిస్తున్నాయి. అక్కా-చెళ్లెకా చెరువలనుండి దిగువవైపునకు ప్రయాణించిన బాటప్రక్కన రెండు పెద్ద రాళ్ళ మధ్యలోచల్లని మంచినీళ్లచలమ (తన్నీరు దోని.) ఉంది. చిన్నగుంటలో చల్లని నీటి వూట ఉంది. వేసవికాలంలో కూడా ఈకుంటలో నీరు వూట వస్తుంటుంది.

ఒనకె ఒబవ్వకుండి

మార్చు

ఇంకను క్రిందివైపునకువెళ్ళిన ఒబక ఒబవ్వనకుండి కన్పిసుంది. కన్నడ చరిత్రలో కిత్తురు చెన్నమ్మ (కిత్తూరు రాణి చెన్నమ్మ, బ్రిటీషు వారికి వ్యతిరేకంగా పోరాటం సల్పిన వీరవనిత) తరువాత అంతగా గణతికెక్కిన మహిళ. ఒబవ్వ దుర్గలోని ఒక కోట కాపలా భటుని భార్య.మదకరినాయకుడుv కు హైదరిఆలికి (టిప్పుసుల్తాను తండ్రి) కి యుద్ధంజరుగుతున్న కాలంఅది. హైదర్‌ఆలి దాడిని మదుకర్‌ నాయక్‌ సమర్ధవంతంగా ఎదుర్కుంటున్నాడు.ఏలాగైన సరే దుర్గాన్ని స్వాధీనమొదవలెనని హైదర్‌ఆలి ప్రయత్నంచేస్తున్న రోజులవ్వి. ఒకరోజు కాపలావిధిలో వున్న భర్తకు మధ్యహన్నం భోజనం తీసుకెళ్ళినది ఒబవ్వ.ఆమే భర్త కాపలస్దలానికి దగ్గరలోవున్న సత్రంలో భోజనంచేయుటకు ఉపక్రమించాడు.భర్తకు నీళ్ళుతేవటానికి నీటి చెలమవద్దకు వెళ్ళుచున్న ఒబవ్వకు, రెండు బండ రాళ్ళ మధ్యనున్న సన్నని కన్నంనుండి హైదర్‌ఆలి సైనికుడు లోపలికి రావడం గమనించింది. ఆ కన్నంనుండి ఒకతూరి ఒకమనిసి అతికష్టమీద రాగలడు. అప్పూడే భోజనంచేస్తున్న భర్తను భజనంవద్దనుండి లీపడం ధర్మంకాదని భావించిన ఒబవ్వ, తనకు అందుబాటులో వున్న ఒనెకే (రోకలి) ని తీసుకునివెళ్ళి ఆ కుండి పక్కనే నిల్చుని, కన్నంనుండి లోపలికి వస్తున్న ఆలి సైనికుని తలమీద బలంగామోది, పక్కకు లాగివేసింది.ఆ కన్నంచాలా ఇరుకుగా వున్నందున ఇవతల జరుగుతున్నది అవతల వున్న సైనికులకు కన్పించె, తెలిసే వీలులేదు. ఆవిధంగా ఒబవ్వ లోపలికి వస్తున్న ఒక్కొక్క భటునుని రోకలోతోతలమీదబాది చంపడం మొదలుపెట్టినది. భోజనంముగించుకొనివచ్చిన ఒబవ్వభర్తకు, వందలసంఖ్యలో గుట్టలుగా పడివున్న హైదర్‌సైనికుల శవాలమధ్య రోకలిపట్టుకుని వున్న ఒబవ్వ అపరకాళినే తలపించింది.ఆవిధంగా ఒకసామాన్యభటుని భార్య అయిన ఒబవ్వ వీర వనితగా నిలిచింది.ఇప్పటికి చిత్రదుర్గకు వచ్చే పర్యాటకుకు తప్పనిసరిగా ఈ కుండిని చూసి, ఆమె వీరత్వాన్ని తలచుకును పులస్తారు. రాయలసీమలోని చాలా మంది ఆడవారికి ఒబవ్వ, ఒబులమ్మ అనేపేర్లు ఉన్నాయి. కన్నడలో అవ్వ అనగా 'అమ్మ'ని అర్ధం.

 
ఒబవ్వ కుండి.
 
పవనవిద్యుత్తు-గాలిమరలు

టంకశాల

మార్చు

ఇక్కడి టంకశాలను మట్టిగోడలతో నిర్మించారు. ఈ మట్టిగోడలను ఒకవిశిష్టమైన పద్ధతిలోనిర్మించారు. నలుపలకలుగా చెక్కిన పునాది రాళ్లను పునాదిగా వాడి వాటిమీద మట్టి గోడలను కట్టారు. ఈ మట్టిగోడలను ఒకే సారిగా కాకుండగా కొంతఎత్తువరకు వరుసగా గోడను కట్టి, ఆరినతరువాత పైవదుసగోడను నిర్మించారు.పునాదికి ఇరువైపుల గోడమందంలో చెక్కపలకలను అమర్చి, వాటిని కదలకుండ మేకులతో బిగించి బాగా కలిపిన బంకమన్ను, గులక ఇసుక వంటి వాటిని మిశ్రం చేసి పలకలమధ్యన మెత్తెవారు.గోడ ఆరిన తరువాత, చెక్కపలకలను పై వరుసలో ఆమర్చి గోడను కట్టెవారు. గోడలను కట్టి రెండు వందల సంవత్సరాలయిన ఇప్పటికి ఈ మొండిగోడలు వానలకు తట్టుకుని నిల్చి అలనాటి భవన నిర్మాణనిపుణుల నైపుణ్యానికి తార్కాణంగా నిల్చున్నాయి. ఈ టంకశాలలో నాణెల ముద్రణ, వసూలు చేసిన శిస్తును ఇక్కడే భద్రపరచేవారట.

భారీ రాతి తిరగల్లు

మార్చు

కోటలోనికి మొదటి కోట ద్వారాన్ని దాటిన తరువాత ఎడమవైపునకు 200 మీటర్ల దూరం వెళ్లినచో అక్కడ పెద్ద పరిమాణంలో వున్న రాతి తిరగల్లు నాలుగు ఉన్నాయి. నాలుగు దిక్కులను సూచిస్తు నాలుగు వైపుల వీటిని వుంచారు.దాదాపు 9-10అడుగుల గొయ్యిని విశాలంగా వుండి, దాని గోడలను చెక్కిన రాళ్లతో రివిటింగ్‌ చేశారు. రాతి ఇసురురాయి పైభాంనవున్న తిరిగే రాతి అంచులకు గంట్లువున్నాయి. గొయ్యిలో మధ్యలో ఇరుసువంటిదాన్ని ఆమర్చి, దానినుండి ఇసురురాళ్లను తిరిగేలా మరలను అమర్చి, ఆ ఇరుసును తిప్పడం ద్వారా ఏకకాలంలో నాలుగు తిరగల్లు తిరెగెలా చేసెవారు. మధ్య ఇరుసును మనష్యులతోకాని, జంతువులతోకాని తిప్పెవారు. స్ధానికులకథనం ప్రకారం ఈ ఇసురురాళ్లను పయోగించి రోట్టెల పిండి ఆడించారని. కాని ఈక్కడ పర్యాటక శాఖవారు వుంఛిన వివరణ బోర్డు ప్రకారం తుపాకులలో వుపయోగించే మందు పొడిని తయారుచేసెవారట.

మతం-ఆలయాలు

మార్చు

ఈ కోటలో వైష్ణవ, శైవ మందిరాలు వుండటం వలన ఈ కోట పాలకులు రెండు మతాలను అభిమానించి, ఆదరించినట్లు తెలుస్తున్నది. చిన్నవి, పెద్దవి దాదాపు 20ఆలయాలవరకు వున్నప్పటికి, ఇందులో చాలా గుడులు శిథిలమైనవి.కోటలో ఒక మసీదు కూడా ఉంది. దీనిని, హైదర్‌ఆలి పాలన సమయంలో నిర్మించింటారు. ఈ దుర్గం పురాతన కట్టడాల సంరక్షణ శాఖ ఆధీనంలో ఉంది. కోట బయటవున్న కందకంకూడా కొంతమేరకు ఆక్రమణకు గురైనది.

వస్తుప్రదర్శనశాల

మార్చు

కోటకు బయట ఎదురుగా కాలేజివున్నది. మరికొద్దిదూరంలో ప్రవేట్‌వ్యక్తులచే నిర్వహించబడుతున్న'వాల్మికి మ్యుజియం'వున్నది.ఈ మ్యుజియంలో దుర్గను పాలించిన నాయక్‌ల చిత్రపటాలు, నాటి ఖడ్గాలు, కైజారులు, తుపాకులు, నాణెలు ఉన్నాయి.

పవన విద్యుత్తు

మార్చు

చిత్రదుర్గ నగరానికి చుట్టుపక్కల 2-4కి.మీ పరిధిలో కొండల వరుసలు ఉన్నాయి.వీటి మీద వందలసంఖ్యలో గాలిమరలను ఆమర్చారు.

వ్యవసాయం

మార్చు

ఈ ప్రాంతంలో వ్యవసాయం ఎక్కువగా వర్షాధారం మీద ఆధారపడివున్నది. ఇక్కడ పొద్దుతిరుగుడు పంట సాగు అధికం. అయితే దానిమ్మ పండ్ల సాగులో ఈ జిల్లా దేశంలోనే మొదటి స్థానం ఆక్రమించింది.[2] ఈ జిల్లాలోని చెళ్ళెకెరే (చిత్రదుర్గనుండి 18 కి.మీ.) లో నూనె మిల్లులు చాలా అధిక సంఖ్యలో ఉన్నాయి.చెళ్లెకెరెను నూనె నగరం (ఎణ్ణే నగర) అని అంటారు.ఇవికాకుండ వరి, జొన్న, ఉల్లి, మిరప పంటలను సాగు చేయుదురు.

ప్రజలు-భాష

మార్చు

ఇది కర్నాటక ప్రాంతం అవటం వలన ఇక్కడి ప్రజల మాతృభాష కన్నడం అవ్వడం సహజం, అయితే కన్నడంతో పాటు ఇక్కడి ప్రజలలో చాలా మంది తెలుగు ధారాళంగా మాట్లాడుతారు. చిత్రదుర్గ జిల్లాకు ఆనుకుని అనంతపురం జిల్లా వుండటం వలనను, వందల ఏళ్లక్రితం రాయలసీమతదితర ప్రాంతాల నుండి తెలుగువారు వలస వెళ్ళడం వలనైతేనేమి, ఇక్కడ రెండుభాషలు సహజీవనం చేస్తున్నవి.

మూలాలు

మార్చు
  1. "Chitradurga MP". NIC. Archived from the original on 26 October 2014. Retrieved 13 October 2014.
  2. The New Indian Express, Thursday, May 08, 2014

వెలుపలి లంకెలు

మార్చు