చిలుక

ఒక పక్షి
(చిలుకలు నుండి దారిమార్పు చెందింది)

చిలుక (చిలక, రామచిలుక) ఒక రంగులతో ఆకర్షణీయంగా వుండే పక్షి. దీనిని పెంపుడు జంతువుగా కొంతమంది పెంచుతారు. సుమారు 350 జాతుల చిలుకలు 85 ప్రజాతులులో ఉన్నాయి. ఇవి సిట్టసిఫార్మిస్ (Psittasiformes) క్రమానికి చెందినవి. ఇవి ఉష్ణ , సమశీతోష్ణ మండలాలలో నివసిస్తాయి. వీటిని సిట్టసైనెస్ (psittacines) అని కూడా పిలుస్తారు.[1][2] వీటిని సామాన్యంగా రెండు కుటుంబాలుగా వర్గీకరిస్తారు: నిజమైన చిలుకలు (true parrots) , కాక్కటూ (cockatoos). ఇవి ప్రపంచవ్యాప్తంగా విస్తరించినా ఆస్ట్రేలియా , దక్షిణ అమెరికా ఖండాలలో ఎక్కువ రకాలు కనిపిస్తాయి.

చిలుక
భారతదేశంలో కనిపించే రామచిలుక
Scientific classification
Kingdom:
Phylum:
Class:
Order:
సిట్టసిఫార్మిస్

Systematics

(but see below)

Family Cacatuidae (cockatoos)
Family Psittacidae (true parrots)

(paraphyletic)

ఇది ఒక జాతి చిలుక

చిలకలకు బలమైన వంకీ తిరిగిన ముక్కు, బలమైన కాళ్ళు ఉంటాయి. ఎక్కువ చిలుకలు పచ్చరంగులో ఉంటాయి; అయితే కొన్ని పంచరంగుల చిలుకలు కూడా ఉంటాయి. చిలుకలు పరిమాణంలో 3.2 అంగుళాల నుండి 1.0 మీటరు పొడవు మధ్యలో ఉంటాయి. ఇవి ఎక్కువగా గింజలు, పండ్లు, మొగ్గలు , చిన్న మొక్కల్ని తింటాయి. కొన్ని జాతులు పురుగుల్ని , చిన్న జంతువుల్ని తింటాయి. సుమారు అన్ని చిలకలు చెట్టు తొర్రలలో గూళ్ళు కట్టుకుంటాయి. చిలుకలు చాలా తెలివైన పక్షులు. ఇవి మనుషుల గొంతును పోల్చి అదేవిధంగా తిరిగి మాట్లాడతాయి. అయితే పెంపుడు జంతువుల వ్యాపారం, వేట, పోటీ మొదలైన కారణాల మూలంగా ఇవి తొందరగా అంతరించిపోతున్నాయి.

భారతదేశములో చిలుక

మార్చు
గ్రబ్‌ల కోసం శోధించడానికి దాని బలమైన బిల్లును ఉపయోగించి పసుపు తోక గల నలుపు కాకాటూ

భారతదేశములో చిలుకను పెంపుడు పక్షిగానే కాక, భగవదంశగా కొలుస్తారు. రాముని ప్రతిరూపంగా ఎక్కువగా కొలవడం చూడవచ్చు. జ్యోతిష్యంలో చిలుక ప్రధాన పాత్ర పోషిస్తుంది. భారతదేశము నందే కాక మరికొన్ని దేశాలలో సైతం జ్యోతిష్యంలో చిలుకను ఉపయోగించుట ఉంది. భారతదేశమునందు పల్లెపల్లెలో ఎక్కడైనా చిలుకజోస్యం వారు చిలుకలతో కనిపిస్తారు.

చిలుకల్లో ఏది మగదో ఏది ఆడదో చెప్పడం చాలా కష్టం.మిగితా పక్షుల్లోలాగా చిలుక[permanent dead link]ను చూసి ఇది ఆడది ఇది మగది అని చాలా జాగ్రత్తగా చూస్తే గాని చెప్పలేం.

భాషా విశేషాలు

మార్చు

తెలుగు భాషలో చిలుక పదానికి ముద్దుల చిలక, చిలక పలుకులు, అకుచిలక, గడ్డిచిలక, చిలుకలకొలికి లాంటి వివిధ ప్రయోగాలున్నాయి.[3]

వర్గీకరణ

మార్చు

ఈ క్రింది వర్గీకణలో అనేక ఉపప్రజాతులు గుర్తించబడినాయి.సూక్ష్మ తులనతో చూసినప్పుడు ఆ ఉపప్రజాతులు కూడా జాతులుగానే కనిపిస్తాయి కాని ఆ వర్గీకరణ ఇంకా పూర్తికాలేదు.

 
రెయిన్బో లోరికీట్, ఆస్ట్రేలియా
 
చిలుక అస్థిపంజరం

ప్రజాతి స్ట్రిగోపిడాయె: న్యూజీలాండ్ చిలుకలు.

  • జాతి నెస్టోరిని: రెండు జాతులు కలిగిన ఒక తెగ,

కియ , కా కా న్యూజీలాండ్ దేశానికి చెందినవి.

  • తెగ స్ట్రిగోపిని : న్యూజీలాండ్ దేశానికి చెందిన అంతరించిపోవటానికి దగ్గరగా ఉన్న కకాపో

ప్రజాతి కకాటుయిడాయె: కొకాటూస్

  • ఉపప్రజాతి మైక్రోగ్లోస్సినాయె
  • ఉపప్రజాతి కాలిప్టోర్హించినాయె: ముదురురంగు కొకాటూస్
  • ఉపప్రజాతి కకాటుయినాయె: తెల్లని కొకాటూస్

ప్రజాతి సిట్టాసిడాయె: నిజమైన చిలుకలు

ఇతర సూచీలు

మార్చు

మూలాలు

మార్చు
  1. "Psittacine". American Heritage Dictionary of the English Language, Fourth Edition. Houghton Mifflin Company. 2000. Retrieved 2007-09-09.
  2. "Psittacine". Merriam-Webster Online Dictionary. Merriam-Webster, Inc. Retrieved 2007-09-09.
  3. "చిలుక( బ్రౌన్ నిఘంటువు)". DSAL.
  4. de Kloet, RS; de Kloet SR (2005). "The evolution of the spindlin gene in birds: Sequence analysis of an intron of the spindlin W and Z gene reveals four major divisions of the Psittaciformes". Molecular Phylogenetics and Evolution. 36 (3): 706–721. doi:10.1016/j.ympev.2005.03.013. PMID 16099384.
  5. Miyaki, Y.; Matioli, R.; Burke, T.; Wajntal, A. (1998). "Parrot evolution and paleogeographical events: Mitochondrial DNA evidence" (PDF). Molecular Biology and Evolution. 15 (5): 544–551.
"https://te.wikipedia.org/w/index.php?title=చిలుక&oldid=4340115" నుండి వెలికితీశారు