"చీకటి"(ఆంగ్లం:Darkness) అనునది "వెలుగు" లేదా వెలుతురు కు వ్యతిరేకార్థాన్నిచ్చే పదం. అనగా ఒక ప్రదేశంలో దృగ్గోచర కాంతి లేమిని సూచిస్తుంది. ఇది అంతరిక్షం లో నలుపు రంగులో కనిపిస్తుంది. మానవులు కాంతి గాని, చీకటి గాని ప్రబలమైనపుడు దాని రంగును స్పష్టంగా గుర్తించ లేరు[1]. కాంతి లేనప్పుడు ఆ ప్రదేశం వర్ణవిహీనంగా, పూర్తి నలుపుగా గోచరిస్తుంది. వివిధ సంస్కృతులలొ "చీకటి" అనుదానికి వివిధ రకముల సామ్యములు ఉన్నాయి.

The Creation of Light, by Gustave Doré

భాషా విషయాలు మార్చు

చీకటి అనే పదం నిఘంటువు ప్రకారం చీకు, కట్టు అనే రెండు పదాల కలయికతో ఏర్పడింది. చీకటికి సంస్కృతంలో అంధకారము, అంధము, అగువు, ఆసక్తము, తమస్సు, తిమిరము, నభోరజస్సు, నిశాచర్మము, నీలపంకము, భూచ్ఛాయ, మబ్బు, మేచకము, రజోబలము, రజోరసము మొదలైన పేర్లు ఉన్నాయి.

వెలుతురు ప్రసరించని ప్రదేశాన్ని చీకటి ప్రదేశం అంటారు. చీకటి తక్కువగా ఉంటే మసకచీకటి అని, అదే ఎక్కువగా ఉంటే మబ్బుచీకటి లేదా కారుచీకటి అని అంటారు. చీకటి ఎక్కువయ్యే కొలది కనిపించుట తక్కువ అవుతుంది.

ప్రతిరోజు రాత్రి చీకటిగా ఉంటుంది. చంద్రుడు పెద్దగా కనిపిస్తున్నపుడు తక్కువ చీకటి గాను, చంద్రుడు చిన్నగా కనిపిస్తున్నప్పుడు ఎక్కువ చీకటి గాను ఉంటుంది. అందువలనే అమావాస్యను చీకటిరాత్రి అంటారు.

ఎక్కువగా నేరాలు రాత్రి సమయంలో జరుగుతాయి. ముఖ్యంగా వ్యభిచారం అందువల్లనేమో దీనిని చీకటితప్పు అని అంటారు.

శాస్త్రీయత మార్చు

గోచరత్వము మార్చు

 
Stare at the image for a minute, then look away. The eye supplies the light and dark complements to the image.

చీకటి అను దృగ్విషయము కాంతి లేమిని అనగా కాంతిని కొన్ని సెకన్ల పాటు చూచి వెంటనే వేరొక వైపు చూసినపుడు కూడా మనకి "చీకటి" అనే దృగ్విషయం గోచరిస్తుంది. ఆ ప్రదేశంలో కాంతి ఉన్నా సరే కొన్ని సెకన్లపాటు చీకటి అనె దృగ్విషయం కలుగుతుంది.(ఈ దృగ్విషయాన్ని after images అంటారు) అలా చూసినపుడు మన కన్ను చురుకుగా ఉన్నప్పటికి, రెటీనా ఉద్దీపన చెందక పోవటంవల్ల మనకు చీకటి గోచరిస్తుంది.[2]

భౌతిక శాస్త్రము మార్చు

భౌతిక శాస్త్ర పదముల ప్రకారం ఒక వస్తువు ఫోటాన్లు(కాంతి కణములు) శోషణం చేసుకున్నపుడు చీకటి అంటారు. అనగా ఇతర వస్తువుల కంటే ఇది మసకగా కనిపిస్తుంది. ఉదాహరణకు జటిలమైన నలుపు రంగు దృగ్గోచర కాంతి ని పరావర్తనం చెందించలేదు. కాంతిని శోషించు కుంటుంది. అందువల్ల అది చీకటిగా కనిపిస్తుంది. అదే విధంగా తెలుపు రంగు హెచ్చు దృగ్గోచర కాంతి ని పరావర్తనం చెందిస్తుంది. అందువల్ల అది కాంతి వంతంగా కనబడుతుంది.[3] అధిక సమాచారం కొరకు రంగు అనే వ్యాసం చూడండి.

కాంతి అనునది పరిమితి లేకుండా శోషించబడదు. శక్తి నిత్యత్వ నియమం ప్రకారం శక్తి ని సృష్టించలెము. నాశనం లేయలేము ఇది ఒకరూపం నుండి వేరొక రూపం లోనికి మారుతుంది. చాలా వస్తువులు దృగ్గోచర కాంతిని శోషించుకుంటాయి.అది ఉష్ణం గా మార్చబడుతుంది.[4] అందువల్ల ఒక వస్తువు చీకటిగా కనిపించవచ్చు, అది ఒకానొక పౌనఃపున్యము వద్ద వెలుగే కాని మనం గుర్తించలెము. మరింత సమాచారం కొరకు ఉష్ణగతిక శాస్త్రం చూడండి.

ఒక చీకటి ప్రదేశం కాంతి జనకాలను పరిమితంగా కలిగి ఉండి ఆ ప్రదేశం చూచుటకు కష్టంగా ఉంటుంది. రాత్రి, పగలు అనునవి కాంతి యొక్క వెలుగు, చీకటి యొక్క ప్రతిరూపాలు. మానవుల వంటి ఏదైనా సరీసృపం ఒక చీకటి ప్రదేశానికి పోయినపుడు దాని కంటి పాప విస్తరిస్తుంది. ఎందువలనంటే రాత్రి కాలంలో హెచ్చు కాంతిని తన కంటి గుండా పంపేందుకు చేసే ప్రయత్నంవల్ల. మానవుని కంటిలో కాంతిని గ్రహించే కణాలు మరికొన్ని కణాలను ఉత్పత్తి చేయుటకు చీకటిలో ప్రయత్నిస్తాయి.

సాంకేతికంగా మార్చు

ఒక బిందువు వద్ద రంగు అనునది, (సాధారణ 24-బిట్ల కంప్యూటర్ నందు ప్రదర్శన) మూడు ప్రాథమిక రంగు (red, green, blue) ల విలువలు 0 నుండి 255 వరకు వ్యాపించెది. ఎప్పుడైతే ఎరుపు, ఆకుపచ్చ, నీలం యొక్క పిక్సెల్స్ పూర్తిగా ప్రకాశించబడతాయో (255,255,255), అపుడు ఆ వస్తువు పూర్తిగా తెలుపు రంగులో కనబడుతుంది. పై మూడు రంగులు యొక్క పిక్సెల్స్ అప్రకాశములవుతాయో (0,0,0) అపుడు ఆ వస్తువు నలుపుగా(చీకటి) గా కనబడుతుంది.

యివి కూడా చూడండి మార్చు

సూచికలు మార్చు

  1. http://www.uni-leipzig.de/~psycho/wundt/opera/wundt/OLiPsych/OLiPsy06.htm
  2. David T. Horner, Demonstrations of Color Perception and the Importance of Contours, Handbook for Teaching Introductory Psychology, Volume 2, page 217. Psychology Press, Texas, 2000) "Afterimages are the complementary hue of the adapting stimulus and trichromatic theory fails to account for this fact". http://books.google.ca/books?id=qyjYzloWfoMC&lpg=PA217&ots=fdXFRLg7GZ&dq=retina%20that%20is%20unstimulated%20produces%20a%20complementary%20afterimage&pg=PA216#v=onepage&q=retina%20that%20is%20unstimulated%20produces%20a%20complementary%20afterimage&f=false Archived 2013-11-05 at the Wayback Machine
  3. Mantese, Lucymarie (March 2000). "Photon-Driven Localization: How Materials Really Absorb Light". American Physical Society. Retrieved on 2007-01-21.
  4. Dr. Denise Smith. "Exploring the Electromagnetic Spectrum: The Herschel Experiment" (powerpoint). Space Telescope Science Institute. Retrieved on 2007-01-21. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2007-02-06. Retrieved 2013-02-09.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)"ఆర్కైవ్ నకలు". Archived from the original on 2007-02-06. Retrieved 2013-02-09."ఆర్కైవ్ నకలు". Archived from the original on 2007-02-06. Retrieved 2013-02-09.
"https://te.wikipedia.org/w/index.php?title=చీకటి&oldid=3912435" నుండి వెలికితీశారు