చెంగల వెంకటరావు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సినీ నిర్మాత, రాజకీయ నాయకుడు

చెంగల వెంకటరావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సినీ నిర్మాత, రాజకీయ నాయకుడు. ఆయన 1999 నుంచి 2009 వరకు పాయకరావుపేట శాసనసభ నియోజకవర్గం ఎమ్మెల్యేగా పని చేశాడు.

చెంగల వెంకటరావు

మాజీ ఎమ్మెల్యే 1999 నుండి 2009
ముందు కాకర నూకరాజు
తరువాత గొల్ల బాబురావు
నియోజకవర్గం పాయకరావుపేట శాసనసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
సంతానం చెంగల విజయలక్ష్మి
నివాసం విశాఖపట్నం

నిర్మించిన సినిమాలు

మార్చు

రాజకీయ జీవితం

మార్చు

చెంగల వెంకటరావు పాయకరావుపేట శాసనసభ నియోజకవర్గం నుండి 1999 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగు దేశం అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి గంటెల సుమనా పై 7576 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచాడు. ఆయన 2004లో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గంటెల సుమనా పై 13689 ఓట్ల మెజారిటీతో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచాడు.[2]వెంకటరావు 2009 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గొల్ల బాబూరావు చేతిలో 656 ఓట్ల స్వల్ప మెజారిటీతో ఓటమి పాలయ్యాడు. ఆయన 2013లో తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లో చేరాడు. చెంగల వెంకటరావు 2014లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసి టీడీపీ అభ్యర్థి వంగ‌ల‌పూడి అనిత చేతిలో ఓడిపోయాడు.

వివాదాలు

మార్చు

చెంగల వెంకటరావు 2007లో నక్కపల్లి మండలం బంగారమ్మపేట అనే మత్స్యకార గ్రామంలో బీచ్ మినరల్స్ కంపెనీ పెట్టడానికి ప్రయత్నాలు జరిగాయి. గ్రామసభ జరిగినప్పుడు ఎమ్మెల్యే చెంగల సహా ఆయన అనుచరవర్గం పరిశ్రమ పెట్టడానికి వీళ్లదని ఖరాఖండిగా చెప్పారు. కానీ మరో వర్గం వారు పరిశ్రమను పెట్టితీరాలని వాదించింది. దీంతో అక్కడ ఇరువర్గాల మధ్య గొడవ జరిగింది. ఈ గొడవలో ఒక మత్స్యకారుడు మరణించాడు. బంగారయ్యపేటలో జరిగిన ఘర్షణలో మత్స్యకారుడు మరణానికి చెంగల వెంకట్రావు, అతని అనుచరులే కారణమంటూ కేసు పెట్టారు. పదేళ్లపాటు కేసు విచారణ జరగగా 2017 మే 24న అనకాపల్లిలోని జిల్లా సెషన్స్ జడ్జి కోర్టు వెంకటరావుతో పాటు 21 మందికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.[3]

మూలాలు

మార్చు
  1. News18 Telugu (2 December 2020). "'స‌మ‌ర‌సింహారెడ్డి' టైటిల్ వెనుక ఇంట్రెస్టింగ్ కథ.. డైరెక్టర్ బి.గోపాల్ టెన్షన్". News18 Telugu. Retrieved 25 May 2021. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)CS1 maint: numeric names: authors list (link)
  2. Sakshi (19 March 2019). "ఇండిపెండెంట్‌గా చెంగల కుమార్తె?". Sakshi. Archived from the original on 25 మే 2021. Retrieved 25 May 2021.
  3. Deccan Chronicle (25 May 2017). "Murder case: Payakaraopeta former MLA, 20 others get life imprisonment". Deccan Chronicle (in ఇంగ్లీష్). Archived from the original on 25 మే 2021. Retrieved 25 May 2021.