వంగలపూడి అనిత
వంగలపూడి అనిత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 2014, 2024 శాసనసభకు జరిగిన ఎన్నికలలో పాయకరావుపేట శాసనసభ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచి 2024 జూన్ 12న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హోం వ్యవహారాలు & విపత్తు నిర్వహణ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది.[1]
వంగలపూడి అనిత | |||
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 12 జూన్ 2024 | |||
గవర్నరు | ఎస్. అబ్దుల్ నజీర్ | ||
---|---|---|---|
ముందు | తానేటి వనిత | ||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2024 | |||
ముందు | గొల్ల బాబురావు | ||
నియోజకవర్గం | పాయకరావుపేట | ||
టీడీపీ మహిళా అధ్యక్షురాలు
| |||
పదవీ కాలం 2021 జనవరి 30 – ప్రస్తుతం | |||
పదవీ కాలం 2014 – 2019 | |||
ముందు | గొల్ల బాబురావు | ||
తరువాత | గొల్ల బాబురావు | ||
నియోజకవర్గం | పాయకరావుపేట | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | లింగరాజుపాలెం గ్రామం, ఎస్.రాయవరం మండలం, అనకాపల్లి జిల్లా, ఆంధ్రప్రదేశ్, భారతదేశం | 1984 జనవరి 1||
రాజకీయ పార్టీ | తెలుగుదేశం పార్టీ | ||
సంతానం | 2 |
జననం, విద్యాభాస్యం
మార్చువంగలపూడి అనిత 1984 జనవరి 1 న ఆంధ్రప్రదేశ్, విశాఖపట్నం జిల్లా, ఎస్.రాయవరం మండలంలోని లింగరాజుపాలెం గ్రామంలో జన్మించింది. ఆమె తండ్రి పేరు వంగలపూడి అప్పారావు. ఆమె 2009లో ఆంధ్ర యూనివర్సిటీ నుండి ఎం.ఏ. ఎం.ఇడి పూర్తి చేసి ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేసి 28 ఏళ్ల వయసులో తన ఉద్యోగానికి రాజీనామా చేసి 2012లో రాజకీయాల్లో అడుగుపెట్టింది.
రాజకీయ జీవితం
మార్చువంగలపూడి అనిత 2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పాయకరావుపేట శాసనసభ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప వైఎస్సార్సిపి అభ్యర్థి చెంగల వెంకటరావుపై 2,828 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి అడుగు పెట్టింది. ఆమె 2018లో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు సభ్యురాలిగా నియమితురాలైంది.[2] అనిత 2019 ఎన్నికల్లో కొవ్వూరు శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి తానేటి వనిత చేతిలో 25,248 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యింది.[3][4] ఆమె 2021 జనవరి 30 న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగు మహిళ అధ్యక్షురాలిగా నియమితురాలైంది.[5]
వంగలపూడి అనిత 2024లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనససభ ఎన్నికలలో పాయకరావుపేట నుండి టీడిపి అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి వైయస్ఆర్సీపీ అభ్యర్థి కంబాల జోగులుపై 43727 ఓట్ల మెజారిటీతో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచి, జూన్ 12 2024న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హోం వ్యవహారాలు & విపత్తు నిర్వహణ శాఖ మంత్రిగా భాధ్యతలు చేపట్టింది.[6][7]
మూలాలు
మార్చు- ↑ Eenadu (12 June 2024). "చంద్రబాబు టీమ్ ఇదే.. కొత్త మంత్రుల వివరాలు ఇలా." Archived from the original on 12 June 2024. Retrieved 12 June 2024.
- ↑ Sakshi (20 April 2018). "తితిదే బోర్డు మెంబర్ల నియామకం." Archived from the original on 13 February 2022. Retrieved 13 February 2022.
- ↑ TV9 Telugu, TV9 (18 October 2019). "అనితా ఓ అనితా..! నీ సెగ్మెంట్ ఎక్కడ? Defeated TDP MLA Anitha in search of assembly constituency". TV9 Telugu. Archived from the original on 24 మే 2021. Retrieved 24 May 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Andhrajyothy (5 April 2019). "'రౌడీయిజం..గూండాయిజంపై షర్మిల మాట్లాడడం హాస్యాస్పదం'". www.andhrajyothy.com. Archived from the original on 24 మే 2021. Retrieved 24 May 2021.
- ↑ News18 Telugu (6 March 2020). "పంతం నెగ్గించుకున్న టీడీపీ మహిళా అధ్యక్షురాలు..." News18 Telugu. Archived from the original on 24 మే 2021. Retrieved 24 May 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ BBC News తెలుగు (12 June 2024). "ఏపీ క్యాబినెట్లో మహిళా మంత్రులు.. ఒకప్పుడు ఏం చేసేవారు, ఇప్పుడు ఎలా మంత్రులయ్యారు". Archived from the original on 12 June 2024. Retrieved 12 June 2024.
- ↑ Andhrajyothy (13 June 2024). "అనిత అనే నేను..." Archived from the original on 13 June 2024. Retrieved 13 June 2024.