చెన్నమనేని హన్మంతరావు

జాతీయస్థాయి ఆర్థికవేత్తగా పేరుపొందిన చెన్నమనేని హనమంతరావు కరీంనగర్ జిల్లా నాగారంలో 1929, మే 15న జన్మించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఆర్థికశాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ పట్టా పొందిన హన్మంతరావు విద్యార్థిదశలోనే ఉద్యమంలో పాల్గొన్నారు. ఆల్ హైదరాబాదు స్టూడెంట్స్ యూనియన్‌కు జనరల్ సెక్రటరీగా ఎన్నికయ్యారు. 1947-48లో నిజాం వ్యతిరేక ఉద్యమంలోనూ పాల్గొన్నారు. 1957లో రాజకీయాల నుంచి వైదొలిగి ఆర్థిక పరిశోధన రంగంలోకి వెళ్ళారు.

చెన్నమనేని హన్మంతరావు
చెన్నమనేని హన్మంతరావు


జాతీయ సలహామండలి సభ్యులు

వ్యక్తిగత వివరాలు

జననం (1929-05-15)1929 మే 15
కరీంనగర్ జిల్లా నాగారం, తెలంగాణ
మతం హిందూ మతం

ఆర్థిక ప్రస్థానం

మార్చు

1961లో ఆర్థికశాస్త్రంలో పీహెచ్‌డి పొంది, ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో ఉద్యోగంలో ప్రవేశించారు. 1966లో చికాగో విశ్వవిద్యాలయంలో పోస్ట్ డాక్టోరల్ లో పీహెచ్‌డి కొరకు వెళ్ళారు. రాజీవ్‌గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 20 సూత్రాల సలహా కమిటీ చైర్మెన్‌గా అవకాశం లభించింది. 1990లో జాతీయ శ్రామిక సంఘం చైర్మెన్‌గా నియమితులైనారు. రిజర్వ్ బ్యాంక్ డైరెక్టరుగా, ఏడవ, ఎనిమిదవ పంచవర్ష ప్రణాళిక సభ్యుడిగా పనిచేశారు, ఆర్థికరంగంలో చేసిన సేవలకుగాను భారత ప్రభుత్వంచే పద్మభూషణ్ బిరుదు పొందారు. హన్మంతరావు, దేశంలోని సామాజిక, ఆర్థిక, వ్యవసాయరంగ పరిస్థితులపై అనేక పరిశోధనలు చేసి, విలువైన గ్రంథాలు రచించారు. 1982-86 మధ్య ఏడో, ఎనిమిదో కేంద్ర ఆర్థిక ప్రణాళిక సంఘం సభ్యుడిగా, ఇండియన్ సొసైటీ అగ్రికల్చర్ ఎకనామిక్స్ అధ్యక్షుడిగా పనిచేశారు. ఇటీవలి వరకు హైదరాబాదు ఎకనామిక్స్ అండ్ సోషల్ స్టడీస్8 అధ్యక్షుడిగా, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్స్ గ్రోత్ సంస్థ ఛైర్మన్‌గా పనిచేశారు. ప్రస్తుతం జాతీయ సలహామండలి సభ్యుడిగా కొనసాగుతున్నారు.[1] వ్యవసాయ అర్థశాస్త్రం, గ్రామీణ పేదరికం, ఆర్థిక సంస్కరణలు, అభివృద్ధి అంశాలపై వందకుపైగా పరిశోధన పత్రాలు, పుస్తకాలు రచించారు.

కుటుంబం

మార్చు

6 సార్లు శాసన సభ్యులుగా గెలుపొందిన చెన్నమనేని రాజేశ్వరరావు, ప్రముఖ భారతీయ జనతా పార్టీ నాయకుడు, కేంద్రమంత్రిగా పనిచేసిన చెన్నమనేని విద్యాసాగర్ రావు వీరి సోదరులే. సిరిసిల్ల తొలి శాసన సభ్యులు ఆనందరావు ఇతని మేనమామ. 2009లో వేములవాడ నుంచి గెలుపొందిన చెన్నమనేని రమేష్ ఇతని అన్న రాజేశ్వరరావు కుమారుడు.

పురస్కారాలు[2]

మార్చు
  • 1974, 1975: రఫీ అహ్మద్ కిద్వారీ మెమోరియల్ ప్రైజ్.
  • 1998: శ్రీ కంభంపాటి సత్యనారాయణ (సీనియర్) మెమోరియల్ అవార్డు.
  • 1994: కె.హెచ్ బతేజా అవార్డు.
  • 1995: ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్ అవార్డు.
  • 1991: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం, అనంతపురం నుండి తత్వ శాస్త్రంలో డాక్టరేట్.
  • 1998: కాకతీయ విశ్వవిద్యాలయం, వరంగల్ నుండి డాక్టరేట్.
  • 1994: శ్రీ రావి నారాయణ రెడ్డి మెమోరియల్ అవార్డు.
  • 2000: తెలుగు ఆత్మ గౌరవ పురస్కారం.
  • 2004: పద్మభూషణ పురస్కారం
  • 2023: ఆధ్యాత్మిక సాహిత్యం విభాగంలో తెలుగు విశ్వవిద్యాలయం - కీర్తి పురస్కారం (2021)[3]

మూలాలు

మార్చు
  1. "నమస్తే తెలంగాణా లో వ్యాసం". Archived from the original on 2016-03-05. Retrieved 2014-01-15.
  2. "హన్మంతరావు యొక్క వ్యక్తిగత వివరాలు". Archived from the original on 2014-01-18. Retrieved 2014-01-15.
  3. ABN (2023-09-12). "23 మందికి తెలుగు వర్సిటీ కీర్తి పురస్కారాల ప్రదానం". Andhrajyothy Telugu News. Archived from the original on 2023-09-13. Retrieved 2023-09-13.

ఇతర లింకులు

మార్చు