చెన్నమనేని రమేష్ బాబు

చెన్నమనేని రమేష్ బాబు తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, వేములవాడ నియోజకవర్గ శాసన సభ్యుడు.[1]

చెన్నమనేని రమేష్ బాబు
చెన్నమనేని రమేష్ బాబు

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార కాలం
2009 - ఇప్పటి వరకు
నియోజకవర్గము వేములవాడ, తెలంగాణ

వ్యక్తిగత వివరాలు

జననం ఫిబ్రవరి 3
రాజకీయ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి
నివాసము వేములవాడ, తెలంగాణ

జీవిత విశేషాలుసవరించు

ఈయన కమ్యూనిస్ట్ నాయకుడు చెన్నమనేని రాజేశ్వరరావు, లలిత దేవి దంపతులకు జన్మించాడు. ఈయన జర్మనీలో ఉన్నత విద్యను అభ్యసించాడు.

రాజకీయ విశేషాలుసవరించు

2009లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వేములవాడ నియోజకవర్గం నుంచి పోటీచేసి గెలుపొందాడు. ఆ తరువాత తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరి 2010లో జరిగిన వేములవాడ శాసనసభ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో శాసన సభ్యునిగా గెలుపొందాడు. 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ టికెట్ పై పోటీ చేసి సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆది శ్రీనివాస్ పై 28,000 పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.[2]

మూలాలుసవరించు

  1. http://myneta.info/telangana2014/candidate.php?candidate_id=101
  2. చెన్నమనేని రమేష్ బాబు. "Vemulawada Election Result 2018 Live Updates: Ramesh Chennamaneni of TRS Wins". న్యూస్18. Retrieved 27 April 2019.