చైనా భాష
దాదాపు మూడువేల సంవత్సరాలకు పైగా చైనా భాష వ్యవహారంలో ఉన్నట్టు ఐతిహాసిక ఆధారాల వల్ల తెలుస్తోంది. ఆసియా ఖండం లో సీనో-టిబెట్ భాషా కుటుంబానికి చెందిన ప్రధాన భాష చైనా భాష. దీనిని చైనీయ ’హాన్’ అని కూడా అంటారు. మరొక వర్ణనాత్మక మైన పేరు సినిటిక్( సిని- చైనా టిక్- టిబెట్; చైనా టిబేట్ భాషలు కలిసింది. అని అర్థం) చైనా భాష అనేది అనేక మాండలికాలు సమూహాన్ని సూచించే పేరు. ఈ మాండలికాలను ఉపభాషలు అనే వారున్నారు. చైనా భాష అనే పేరిట వ్యవహారంలో ఉన్న అన్ని ఉప భాషలు ప్రపంచంలో మరే భాషలోనూ లేవు. ప్రతి ఉప భాష కు ఒక ప్రత్యేకత ఉంది. ఈ ఉప భాషలలో ఒక దానిని చైనా వారు ప్రమాణికరించారు. ప్రస్తుతం ఐక్యరాజ్యసమితిలో వాడకానికి స్వీకరించిన ఐదు ప్రపంచ భాషలలోనూ ఆధునిక చైనా భాష ఒకటి.[2]
చైనీస్ | |
---|---|
స్థానిక భాష | చైనా, తైవాన్, సింగపూర్ |
స్వజాతీయత | హాన్ చైనీస్ |
స్థానికంగా మాట్లాడేవారు | (1.2 బిలియన్ cited 1984–2001) |
సినో-టిబెటన్
| |
ప్రామాణిక రూపాలు | ప్రామాణిక చైనీస్
కంటోనీస్
|
ప్రాంతీయ రూపాలు |
|
సరళీకరించిన చైనీస్ సంప్రదాయిక చైనీస్ లిప్యంతరీకరణలు: బోపోమోఫో పిన్యిన్ జియార్జింగ్ డంగన్ చైనీస్ బ్రెయిలీ | |
అధికారిక హోదా | |
అధికార భాష | చైనా, మకావ్, హాంగ్ కాంగ్, సింగపూర్, తైవాన్ |
నియంత్రణ | నేషనల్ కమీషన్ ఆన్ లాంగ్వేజ్ అండ్ స్క్రిప్ట్ వర్క్ (చైనా)[1] నేషనల్ లాంగ్వేజెస్ కమిటీ (తైవాన్) సివిల్ సర్వీస్ బ్యూరో (హాంగ్ కాంగ్) ప్రమోట్ మాండరీన్ కౌన్సిల్ (సింగపూర్) చైనీస్ లాంగ్వేజ్ స్టాండర్డైజేషన్ కౌన్సిల్ (మలేసియా) |
భాషా సంకేతాలు | |
ISO 639-3 | – |
చైనాలోని ఉప భాషలు దేనికి అదేగా ఒక ప్రాంతం వారి భాష మరొక ప్రాంతం వారికి అర్థం కానంత భిన్నంగా ఉండేవి మాండలిక శబ్దాలు తేడా సరేసరి ఉచ్చారణలలో ప్రాంతీయ వ్యత్యాసాలున్నాయి. వ్యాకరణంలో ఎక్కువ తేడాలు లేవు. ప్రాంతీయంగా ఎక్కువ వాడకంలో ఉన్న ఉప భాషలలో ప్రధానమైనవి. ఉత్తర,మధ్య, పశ్చిమ ప్రాంతాల్లో మాట్లాడే మాండరిన్ ఉత్తర, దక్షిణ ప్రాంతాలలో మాట్లాడే ’వూ’ ఆగ్నేయ ప్రాంతంలో మాట్లాడే ’మిన్’ ’కాన్’ ’హక్కా’’హ్సియాంగ్’ ’కాంటనీస్’ లేక యూచ్ భాషలు.
చైనా ఉప భాష లన్నిటికీ సాహిత్యం మాత్రం ఒక్కటే దాని పేరు ’వెన్ యన్’ ఈ ఉమ్మడి సాహిత్యాన్ని భావాత్మక మైన లిపిలో వ్యక్తం చేయడం పరిపాటి.ధ్వని విధేయమైన లిపి దాదాపు లేనట్లే అయితే ఈ లిపిని చదవడంలో ఉచ్చారణ బేధాలున్నాయి. ఎవరి ప్రాంతీయ పద్ధతిని బట్టి వారు చదువుతారు. 1917కు ముందు వెన్‌యెన్ పద్ధతి వ్రాతనే విస్తృతంగా అభిమానించేవారు. ఆ తర్వాత మాండలిక పద్ధతులలో అంటే పాయ్‌హువా పద్ధతిలో సాహిత్యాలను వెలయించడం ఎక్కువయింది. పాత సాహిత్య శైలి,ఒరవడి క్రమంగా మరుగున పడసాగాయి.
1990 సంవత్సరం ప్రాంతంలో జాతికి ఒకే భాష ఉండాలనే భావన ప్రచారమై జాతీయ భాష కోసం మాండరిన్ ఆధారంగా చేసుకుని ఆధునికీకరణను చేపట్టారు. ఇదే ఆధునిక ప్రామాణిక చైనా భాష జాతీయ భాష క్వోయూ లేక ఉమ్మడి భాష ప్యూటుంగ్ హువా.
1956లో సంస్కరించడానికి పూనుకొన్నారు ఉచ్చారణ అనుసరించి అంటే ధ్వని విధేయమైన అక్షరాలను రూపొందించి ఏక లిపిని రూపొందించారు. దీనిని పిన్యన్ అన్నారు. పిన్యన్ లిపిని విద్యాలయాలలో ప్రవేశపెట్టారు 1979 వరకు దీనిని ఒక క్రమంలో వాడుతూ ఇదే అని నిర్దేశించారు. ఆధునిక జాతీయ అవసరాలకు అనువుగా తీర్చిదిద్దే ప్రయత్నం కొనసాగింది.
చైనా భాషను చరిత్ర పండితులు స్థూలంగా నాలుగు యుగాల క్రింద విభజించారు. ఆదిమ యుగం (క్రీస్తుపూర్వం 500 వరకు) ప్రాచీన యుగం(క్రీ.పూ500 క్రీస్తు శకం ఆరంభం) మధ్యయుగం( క్రీస్తు శకం ఆరంభం 1000) ఆధునిక యుగం 1000 నుంచి క్రీస్తుపూర్వం ఐదు వందల సంవత్సరాల వరకు వచ్చిన శిలాశాసనాలు గేయాలు ఆనాటి భాషా స్వరూపాన్ని విదితం చేస్తున్నాయి. ఆపైన క్రీస్తు శకం ఆరంభం వరకు వాడుకలో ఉన్న భాష అతిప్రాచీన చైనాభాష ఇతర భాషాశబ్దాలు ఈ కాలంలో చైనా భాషలో చేరినట్లు దాఖలాలు కానవస్తున్నాయి. ఈ యుగంలో కన్ఫ్యూషియస్ మెన్షియస్ ప్రభృతులు రచనలు చేశారు. అవి నేటికీ పఠనీయాలే తర్వాత క్రీస్తుశకం 1000 వరకు గల కాలం మధ్యయుగం1901 ప్రాంతంలోనే ప్రముఖ పండితుడు లుఫాయెన్ వ్రాసినఉచ్చారణ కోసం ద్వారా పూర్వికులు చైనా భాషను ఎలా ఉచ్చరించే వారో తెలియవస్తోంది. క్రీస్తు చిత్రం 1000 తరువాత నడిచిన యుగం ఆధునిక యుగం ఆధునికయుగంలో 11వ శతాబ్దంలో స్సూ-మాక్వాన్‌గ్ అనే అధికారిక పండితుడు కూడా ఒక ఉచ్చారణ కోశం రచించాడు. ఈ రెండు కోశాలు అంతకు ముందు వారు రూపొందించిన శబ్ద కోశాల లోని వివిధ శబ్దాలను పేర్కొని వాటి మూలాలను రూపాంతరాలను ఉచ్చారణలనూ విశదం చేస్తున్నాయి.
ఒకే తీరు అక్షరాలు శబ్దాలు సందర్భాన్ని బట్టి భిన్నమైన అర్థాలకు సంకేతాలు అవుతూ ఉంటాయి ధ్వని ప్రణాళికను బట్టి అవే అచ్చులు హల్లులు కలిసి వేర్వేరు అర్ధాలను ద్యోతకం చేస్తాయి. చైనా భాషలో కలగలుపు అచ్చులు ఎక్కువ. మొత్తం ఈ భాషలో 21 అచ్చులు 23 హల్లులు ఉన్నాయి. డ-త-జ-ద-గ హల్లులు ప్రత్యేకంగా లేవు సందర్భాన్ని బట్టి ఒకే అక్షరాన్ని వేర్వేరు రీతులుగా ఉచ్ఛరిస్తారు పురాతన చైనా భాష ఉచ్చారణలో 6 స్వరాలు స్పష్టంగా వినిపించేవి. ఆధునిక ప్రామాణిక చైనా భాషలో నాలుగు స్వరాలు మాత్రమే ఉపయోగిస్తున్నారు చైనీయ లిపిలో ఒక అక్షరం ఒక భావానికి లేదా ఒక పదానికి సంకేతం అది చిత్రలిపి వివిధ భావాలకు సంకేతాలు చిత్ర రూప అక్షరాలే.ఈమధ్య విస్తృతార్థ సాధన కోసం సంక్లిష్ట అక్షరాలు బాగా ఉపయోగిస్తున్నారు ఈ లిపిని గుడి నుంచి వ్రాయడం ఒక విశేషం మరొకటి పైనుంచి కిందికి వ్రాయడం.
తెలుగు భాషలో వలె విభక్తులు నిర్దేశక సర్వనామాలు భూత భవిష్యత్ వర్తమానాలను సూచించే స్పష్టమైన శబ్ద రూపాలు చైనా భాషలో లేవు ఆయా అర్థాలను స్ఫురింప చేసే సంకేతాలు ఉన్నాయి క్రియా పదాలు సహాయంతోనే విశేషణాలు అధ్యాయాలు ఏర్పడుతూ ఉంటాయి ఈ విధంగా భాష సువ్యక్తం చేయడానికి దాదాపు ఐదు వేల లిపి సంకేతాలు నేర్చుకోవడం అవసరం అవుతుంది కానీ చైనా అంతటా ఈ సంకేతాలు అందరికీ అర్థం అవుతున్నాయి అందరికీ అర్థమయ్యే ఈ చిత్రాలు ఒక విధంగా చైనా జాతి సమైక్యంగా ఉంచడానికి ఆధారం అయింది ఎన్ని కల్లోలాలు వాటిల్లినప్పటికి ఎన్ని రకాలప్రభుత్వాలు నెలకొన్నప్పటికీ చైనా ప్రజలలో తాము ఏక జాతీయులం అనే భావం చెక్కుచెదరలేదు. భాష ఎన్ని ప్రాంతాలుగా విభక్త మైనప్పటికీ లిపి మాత్రం దేశమంతటా ఒక్కటిగానే మిగిలి ఉంది. చైనా ఏకతకు ఈ చిత్రలిపి (ఉచ్చారణలు వేరైనా) పునాది యాసల గందరగోళం ఏర్పడకుండా అక్షరాల ఉచ్చారణను భిన్నభిన్నంగా తీర్చిదిద్దుకున్నారు. ఉచ్చారణ సౌలభ్యం వలన సంగీత సాహిత్యాలకు సాన్నిహిత్యం కుదిరింది. కవితలకు నాటకాలకు సాన్నిహిత్యం సాధ్యమయింది. చైనీయులు కవితలను పాడుకునేవారు కాలక్రమాన ఆ గాన ఫణతులు ఇప్పటి వారు వాటిని ఏదో ఒక రాగం వరుసను సాగ లాగుతూ పాడుతున్నారు కేవలం చదవడం కంటే కొంచెం విభిన్నమైన విధానం ఇది చైనా భాష లోని నాటకాలు సాధారణంగా గేయ నాటకాలే.
చైనా చిత్రలిపి ఒక్కొక్క అక్షరం ఒక చిన్న సమాసం లాంటిది. ఈ అక్షర లాఘవం వలన వారి కవితకు దిఅర్థ పుష్టి చేకూరింది. వారి కవితలు టెలిగ్రాం భాషలో వ్రాసినట్లు ఉంటాయి. ఆనందాతిశయాన్నిఅగాథ విషాదాన్ని అలవోకగా అవి వ్యక్తం చేస్తాయి. సుదీర్ఘంగా వ్రాయవలసిన అగత్యం వారికి కలగలేదు సంక్షిప్త రచనలోని భాషా విశేషాలను వారు నిక్షిప్తం చేయగలిగారు.
లిపి వైచిత్రి వలన అక్షరాలలో నిక్షిప్తం కాగల భావన బాఃహుళ్యం వలన వాటిల్లిన నష్టాలలో ఒకటి. 2 ప్రముఖంగా పేర్కొనదగినవి దాదాపు వెయ్యి చిత్రాక్షరాలు నేర్చుకోవలసి ఉండడం వలన ఎంత నేర్చినా భాషాజ్ఞానం కొరవడడం తప్పనిసరి అయింది. వాడుకభాష ఎన్ని కోట్లమంది మాట్లాడుతున్నప్పటికీ వారందరికీ భాషా జ్ఞానం అలవడే అవకాశాలు తక్కువ అయ్యాయి. ఎక్కడో విద్యావ్యాప్తి సుగమమైన నగర ప్రాంతాలలో తప్ప మిగతా చోట్ల అధిక సంఖ్యాకులు నిరక్షరాస్యులుగానే ఉండిపోవలసి వచ్చింది. భాషా ప్రాధాన్యం క్షీణించి,లిపి లేఖనా పాండిత్యానికి ప్రాముఖ్యం హెచ్చింది. ఇది నా భాషాజ్ఞాన విస్తరణకు భావన నైపుని క్షీణతకు దారితీసింది. 1487 నుంచి 1921 వరకు పరిపాలనలో ఉద్యోగాలు సంపాదించాలంటే లేఖన ప్రావీణ్యం తప్పనిసరి యోగ్యత అయింది అధికారులు ఆమోదించిన రీతిలోనే వ్రాయాలి దానివలన ఊహలు వేదనలు వ్యక్తీకరించే అవకాశం సన్నగిల్లింది.
సాహిత్యం:
మార్చుచైనాలో లభించిన శాసనాలు అన్నిటిలోకి పురాతనమైనది క్రీస్తుపూర్వం 1384 నాటిది. ఎముకల పైన గుల్లలపైన చెక్కిన శాసనాలు అవి. అప్పటి లిపి కూడా ఇప్పటి లాగా చిత్రలిపే. అందుచేత ఇప్పటి వారు ఆ లిపిని భాషను అలవోకగా అర్థం చేసుకోగలరు. పురాతన శాసనాలలో అప్పటి కవితల ప్రసక్తి అప్పటి సంగీతం కానవస్తున్నది. క్రీస్తు పూర్వం 500సంవత్సరాల ప్రాంతం కన్ఫ్యూషియస్ యుగం ఆ కాలంలో వెలసిన గుడి గీతలు రాజదర్బార్ గేయాలు జానపద గేయాలు వగైరాలు షిహ్‌చిన్‌గ్ అనే పేరుతో ఒక సంకలనంగా లభిస్తున్నాయి అది ఒక పురాణ గ్రంథం ఒక భాగం ’ఇ-చింగ్’ పశ్చిమచైనా ప్రాంతంలో ఇది బాగా ప్రచారంలో ఉంది ఇంచుమించు ఇది ఒక కాలజ్ఞాన తత్వాలు సంకలనం వంటిది. ఆ తర్వాత క్రీస్తుపూర్వం 300 ప్రాంతంలో చూయువాన్ అనే కవి ఉద్భవించి చైనా కవితా జగత్తులో శాశ్వత కీర్తితో నిలిచిపోయాడు అతడు రచించిన విషాద నిరాసం అనే కావ్యం సుప్రసిద్ధమైంది రాజకీయాలనుభగ్న ప్రేమను మి ళితం చేసి స్వర్గభూముల లోకి ప్రయాణం కట్టించిన కవి అతడు.
చైనా పురాణాలు చెప్పే దాన్ని బట్టి మనుషులు దేవతలు యధేచ్ఛగా స్వర్గంలో విహరించి రావచ్చు శాంతి అనే నాయకుని పైన తిరుగుబాటు చేయడానికి అనే దేవుడు సహాయం చేస్తాడు తిరుగుబాటును అణచి వేసిన తర్వాత మనుషులు మానవ లోకం దాటి పోవడానికి వీలు లేకుండా స్వర్గానికి మానవ లోకానికి మధ్య పెద్ద అడ్డంకులను నెలకొల్పుతారు కానీ చిల్లరదేవుళ్ళు రెక్కల పాములు మాయసూకరాలు వింత కోతులు వగైరా పురాణ జంతువులు ఈ అడ్డంకులను లక్ష్యం చేయకుండా యథేచ్ఛగా స్వర్గానికి వెళ్లి వస్తూ మానవులకు అక్కడి వారితో ఏమైనా పనులు ఉంటే వాటిని చేసుకు వస్తూ ఉండేవి పురాణ పురాణ నాయకులకు వారి స్వర్గ యాత్ర లో జంతువులు వెంట ఉండడం మామూలే ప్రతి ఊరికి, ప్రతి కుటుంబానికి ప్రతి వంతెనకు ఇలా స్వర్గానికి వెళ్లి పనులు చేయించుకుని వచ్చే చిల్లర దేవుళ్ళు రక్షకులుగా ఉండేవారు చైనా సాహిత్యంలో ఇలాంటి దేవదూతలుకోకొల్లలు.
మొట్టమొదటి వచన రచనలు తాత్వికుల ఆలోచనల సంకలనాల రూపంలో వెలువడ్డాయి కన్ఫ్యూషియస్ విచార శాఖలావళి, అలాగే లా వోట్జూ అనే తావో తేచింగ్ భావన ఖండాలు మెన్‌షియస్ (ఆలోచనాంశాలు) ఇట్టి వచన రచనలకు ఉదాహరణలు క్రీస్తుపూర్వం 240 మొదటి సారిగా సలక్షణమైన పుస్తకం రూపొందింది. లూ-పూ-వీయ్ రచించిన 60 వ్యాసాల సంపుటి ల్యూ షీ చున్ చియూ వివిధ తత్వాల సారం వివిధ ప్రాంతాల జానపద గీతాల సంకలనం క్రీస్తుపూర్వం 225 వ సంవత్సరంలో దేశంలోని ఆటలను ఆలయాలలోనూ రాజదర్బారుల్లోనూ వాడుకలో ఉన్న సంగీత పద్ధతులను వీర గాధలనూ జానపద గేయాలనూ సేకరించి చేయడానికి ఒక సంగీత పరిషత్తు ’యూయెఫ్యూ’ నెలకొల్పారు ఈ సంకలనం నుంచి తరువాతి రచయితలు ఉత్తేజం పొందసాగారు అప్పటి నుంచి వివిధ శతాబ్దాలలో ఈ పరిషత్తు కార్యాచరణ కౌశల్ మెరుగు పరిచే కృషి కొనసాగుతూ వస్తోంది.
220 సంవత్సరం మొదలు భారతదేశం నుంచి వచ్చిన దండయాత్రల బృందాల ద్వారా సంక్రమించిన సాంస్కృతిక లక్షణాలను చైనా తన సంస్కృతి లో జీర్ణం చేసుకోసాగింది.అయినా తన ఆ సంప్రదాయాన్ని సురక్షితం చేసుకుంటూ ఉండేది రాజకీయ ఐకమత్యం తరచు భగ్నం అవుతూ ఉండడం వలన సాహితీ పరులు ఎప్పటికప్పుడు తమ సంప్రదాయాలనైనా పదిలం చేసుకోవాలని పట్టుదల వహించేవారు ఈ కృషి ఫలితంగా సాహిత్యంలో పాత ధనం పాతుకుపోయింది అధికార భాష శైలికి ప్రజా భాషా శైలికి మధ్య ఒక అగాథం నెలకొన్నది ఉత్తమ రచయితలు ప్రజల భాష ఉపయోగించడానికి గట్టి కృషి చేశారు.
చైనా సాహిత్యేతిహాసంలో స్వర్ణయుగంగా పేర్కొనదగిన కాలం క్రీస్తు శకం ఆరువందల నుంచి తొమ్మిది వందల వరకు ఈ కాలంలో వివిధ శైలులు సరి సమానంగా వాడుకోడానికి ప్రయత్నం జరిగింది వేరు వేరు శైలులు రంజకంగా అనుసరించడానికి రచయితలకు తగినంత స్వాతంత్రం ఉండేది క్రీస్తు శతకం 775 ప్రాంతంలో ’తూపూ’ అనే మహాకవి తన రచనలలో రాజకీయ నైశిత్యం , సాంఘీక పరిజ్ఞానం, నైతిక గాంభీర్యం, ప్రతిభావంతమైన కవితా కౌశలం ప్రదర్శించి లబ్ద ప్రతిష్టుడయ్యాడు.
ఆ తర్వాతి శతాబ్దాలలో సాహితీ నియమాలపై నా వివాదాలు ఎక్కువ అయ్యాయి రచనలు సర్వసాధారణంగా అంతకుముందు మునుపటి వారి రచనలకు అనుకరణలే అయ్యాయి 1644 నుంచి 1912 వరకు అంటే మన్‌చు దండయాత్రల కాలం నుంచి రచనలు ఎక్కువగా వెలువడ్డాయి కానీ వాటిలో ప్రతిభా వ్యుత్పత్తులు కొరవడ్డాయి ప్రతిభ విరాళంగా వచ్చేది సృజనాత్మక రచనలు అయ్యాయి సుదీర్ఘ కాలంలో వెలువడిన ప్రధమ నవల శోణా మందిరంలో స్వప్నం( డ్రీం ఆఫ్ ది రెడ్ చేంబర్) అనే విషాదాంత కథ దీనిని త్సానోచాన్ రచించాడు ప్రపంచ నవలా సాహిత్యంలో పేర్కొనదగిన గొప్ప నవల ఇది 1842లో నల్లమందు యుద్ధాలు తర్వాత పాశ్చాత్య సాహిత్యాన్ని చైనా భాషలోకి అనువదించే కృషి ముమ్మరంగా ప్రారంభం అయింది.
19వ శతాబ్దం ద్వితీయార్ధంలో డాక్టర్ సన్‌యాత్‌సేన్ ప్రభృతులు నూతన భావాల వశీకరణం రచన ప్రబోధిని సాగారు ఒక నూతన రాజకీయ వ్యవస్థ స్థాపన విశ్వాసం కల్పించ గలిగారు రచన ప్రక్రియలు ఆధునికం కాజొచ్చాయి. జాతీయ భావాలు పరివ్యాప్తం కావడం ఈ యుగం ప్రధాన లక్షణం 1919 మే 4న చైనాలోని షాన్ తున్‌గ్ రాష్ట్రాన్ని జపాన్ వారికి సంక్రమింప చేయాలని ఒక ఒడంబడిక జరిగేసరికి చైనా ప్రజలు తమ దేశంలోని ఒక భూభాగాన్ని మరో దేశానికి చేసే ఈ చర్యను తీవ్రంగా నిరసించారు అప్పటికే జరిగిన జాతీయతా ప్రచారం ఈ నిరసన ఉద్యమానికి దోహదం చేసింది జాతిని ఉత్తేజపరిచే రచనలు విరివిగా వెలువడ్డ నారంభించాయి. జాతీయ భావ ప్రధానమైన రచనలకు కమ్యూనిస్ట్ రచనలు తోడయ్యాయి ఈ రచనోద్ద్యమం పట్ల యువ రచయితలు పలువురు ఆకర్షితులయ్యారు కమ్యూనిటీ ఉద్యమం కూడా బలీయం కాజొచ్చింది. కార్మిక, కర్షక, సైనిక, వర్గాలకు ఉపకరించే రచనలు చేయడమే ధ్యేయంగా ఉండాలని కమ్యూనిస్టు నాయకుడు మావో-త్సే-తుంగ్ చేసిన నిర్దేశాన్ని అనుసరించే ఆధునిక సాహిత్యం రూపొందజొచ్చింది. కార్మికులు కర్షకులు సైనికులు క్షేమంగా ఉండడమే జాతీయ ఆలంబనం అనే విశ్వాసం బలపడింది ఈ దశలో సాహిత్యాభివృద్ధికి ఆధునిక ముద్రణ సౌకర్యాలు కూడా దోహదం చేశాయి ప్రభుత్వం కూడా వివిధ ఉప భాషా ప్రాబల్యాల వలన గందరగోళంగా తయారైన భాష వ్యవస్థను మార్చడానికి గట్టి చర్యలు తీసుకొని భాషాసమైక్యం చాలా వరకు సాధించగలిగింది ఉత్తమ గ్రంథాలను చైనా భాష లోకి పరివర్తనం చేయడం ఉత్తమ చైనా రచనలను ఇతర భాషల్లోకి అనువదింప చేయడం ప్రభుత్వ ప్రోద్బలంతో ఆరంభమయింది చైనా వారికే సరిగా అర్థం కాని ఉప భాషల వ్యవస్థతో ఇతర దేశాల వారికి గజిబిజి కలుగజేసిన చైనా సాహిత్యం వెనుక బట్టి ఆధునిక చైనా సాహిత్యం విశ్వ సాహితి రంగంలో ప్రవేశించింది వారి లిపిని వారే ఒక త్రోవకు చేర్చారు.[3]
మూలాలు
మార్చు- ↑ "china-language.gov.cn". Archived from the original on 2015-12-18. Retrieved 2021-12-07.
- ↑ చైనీస్ భాష#cite note-FOOTNOTEMair199110, 21-2
- ↑ విశ్వసాహితి - విజ్ఞాన సర్వస్వం. హైదరాబాద్: పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం. 1994. p. 830. ISBN 81-86073-09-4.